newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

లాక్‌డౌన్ @ 35 డేస్.. 31 వేల కేసులు, వెయ్యి మరణాలు

29-04-202029-04-2020 09:06:49 IST
Updated On 29-04-2020 10:00:15 ISTUpdated On 29-04-20202020-04-29T03:36:49.979Z29-04-2020 2020-04-29T03:36:36.929Z - 2020-04-29T04:30:15.921Z - 29-04-2020

లాక్‌డౌన్ @ 35 డేస్.. 31 వేల కేసులు, వెయ్యి మరణాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించి 35 రోజులు పూర్తయింది. కాగా మంగళవారం నాటికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 31,329కి చేరుకుంది. వెయ్యిమందికి పైగా కరోనా బారినపడి చనిపోయారని రాష్ట్రాల ఆరోగ్య శాఖలు వెల్లడించిన డేటా తెలిపింది. మంగళవారం ఒక్కరోజే 74 మంది కరోనా మృతులు నమోదు కావడం రికార్డు. ఒకేరోజు ఇంతమంది మహమ్మారికి బలకావటం ఇదే తొలిసారి. సోమవారం కూడా 54 మంది దేశవ్యాప్తంగా కరోనా మృతులు నమోదు కావడం విశేషం.

ప్రపంచంతో పోలిస్తే భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తున్నా గత 7 రోజుల్లోనే 10 వేల మందికి వైరస్ సోకడం భీతికలిగిస్తోంది. లాక్ డౌన్ అత్యంత కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలల్లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉండటం గమనార్హం. ఈ రెండు రాష్ట్రాల్లో 8 రోజులలోపే వైరస్ సంక్రమించిన రోగుల సంఖ్య రెట్టింపు అయింది.

ప్రపంచంలోని 20 పెద్దదేశాల గణాంకాలను పరిశీలిస్తే భారత్ కంటే 84 రెట్లు అధికంగా కరోనా రోగులను ఆ దేశాలు నమోదు చేశాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్అగర్వాల్ పేర్కొన్నారు.  కానీ ముంబైలో మాత్రమే పరిస్థితి తీవ్రంగా ఉందని, మహారాష్ట్ర మొత్తంమీద ఇంతవరకు 9,318 కరోనా కేసులు నమోదు కాగా, ఒక్క ముంబైనగరంలోనే 6 వేల కేసులు నమోదయ్యాయని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.  నగరంలో ఒక్క రోజే 393 కేసులు నమోదయ్యాయని, ధారవిలోనే 41 కొత్త కేసులు మంగళవారం నమోదు కావడం ప్రమాదకర పరిస్థితిని చూపిస్తోందని ఆరోగ్య శాఖ కార్యదర్శి తెలిపారు.

దేశంలో కరోనా రోగుల సంఖ్య అధికంగా గల రాష్ట్రాలు మహారాష్ట్ర (9,318), గుజరాత్ (3774), ఢిల్లీ (3,314). ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు 31 లక్షలమంది కరోనా రోగులు నమోదు కాగా, 2,13 వేలమంది చనిపోయారు. ఇక అమెరికా 57,000 మరణాలతో టాప్‌లో నిలవగా, ఇటలీ (27,000), స్పెయిన్ (23,000) మరణాలతో తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. 

అయితే మే 3 తర్వాత లాక్ డౌన్ ఆంక్షలను కొన్ని రంగాల్లో సడలించనున్న సందర్భంగా రానున్న రోజులు భారత్‌కు చాలా కీలకమైనవని కేంద్ర ఆరోగ్య శాఖ అత్యున్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పుడు దేశం అన్నిటికంటే మిన్నగా హాట్ స్పాట్లను గుర్తించడం, ఈ రెడ్ జోన్లు.. గ్రీన్ జోన్లలోకి వ్యాపించకుండా నిరోధించడమే కీలకమని అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సూచించారు.

శానిటైజర్లను విస్తృతంగా వాడటం, మాస్క్ తప్పనిసరిగా ధరించడం, దగ్గు వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకోవడం భారతీయుల జీవనంలో చాలా ముఖ్యమైన అంశాలుగా మారుతున్నాయని గులేరియా పేర్కొన్నారు. లాక్ డౌన్ సడలింపు సందర్భంగా కేసులు నమోదు కానీ ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలు ఎలా ప్రారంభించడం అనేదే సమస్యగా మారుతుందని చెప్పారు.

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   10 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   21 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle