newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

లాక్‌డౌన్ అంటే ఎలా ఉండాలో చూపించిన వాషింగ్టన్.. తగ్గిన కేసులు

06-04-202006-04-2020 08:51:31 IST
Updated On 06-04-2020 08:57:39 ISTUpdated On 06-04-20202020-04-06T03:21:31.774Z06-04-2020 2020-04-06T03:21:29.747Z - 2020-04-06T03:27:39.089Z - 06-04-2020

లాక్‌డౌన్ అంటే ఎలా ఉండాలో చూపించిన వాషింగ్టన్.. తగ్గిన కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్‌లో లాక్ డౌన్ ప్రకటించి పదిరోజులు దాటింది. కానీ పదిరోజులు దాటిన తర్వాత కూడా  లాక్ డౌన్ అంటే ఏమిటో, దాని అవసరం ఏమిటో తెలీని అజ్ఞానంలో, పరమ నిర్లక్ష్య స్వభావంతో మన వాళ్లు రోడ్లమీదికి వచ్చేస్తున్నారు. నిత్యావసరాలను తీసుకోవడం పేరిట వందల సంఖ్యలో షాపుల ముందు గుమికూడుతున్నారు. శనివారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రేషన్ బియ్యం పంపిణీ కేంద్రాల వద్ద వందలాది లబ్ధిదారులు ఒక్కసారిగా తోసుకువచ్చిన దృశ్యాలు చూసినవారికి మన దేశంలో నిజంగా లాక్ డౌన్ అమలవుతోదా అనే అనుమానం వచ్చి ఉంటుందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

అందుకే పది రోజుల లాక్ డౌన్ తర్వాత కూడా కరోనా కేసులు తగ్గడం కాదుకదా రోజురోజుకూ రెట్టింపు అవుతూ ప్రస్తుతం 3 వేలమందికి దేశవ్యాప్తంగా వైరస్ సోకగా రోగుల సంఖ్య 10 వేల సంఖ్యను తాకడానికి మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ సమయం పట్టదంటున్నారు. కాని ప్రస్తుతం కరోనా వైరస్ బారిన చిక్కి చిగురుటాకులా వణికిపోతున్న అమెరికాలో కూడా ఒక నగరం యావత్ ప్రపంచానికి లాక్ డౌన్ అంటే ఏంటో,  దాన్ని ఎలా అమలు చేయాలో అత్యంత పకడ్బందీగా చేపట్టి ఒక ఆదర్శపూరిత నమూనాగా ప్రపంచం ముందు నిలబడింది.

ఆ ప్రయత్నంలో ఆ నగరం ఎంత విజయవంతమైందంటే అమెరికాలో కరోనా వైరస్ సోకిన రాష్ట్రాల్లో తొలి స్థానం నుంచి పదో స్థానానికి చేరుకుంది. అంటే దాదాపు సేఫ్టీ జోన్‌ లోకి ప్రవేశించింది. ఆ నగరం పేరు వాషింగ్టన్. 

అమెరికాలో మొట్టమొదటగా కరోనా మహమ్మారి బారినపడిన వాషింగ్టన్‌ రాష్ట్రంలో కేసుల తీవ్రత క్రమంగా తగ్గుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల కేసుల సంఖ్యాపరంగా తొలి స్థానం నుంచి పదో స్థానానికి పరిమితమైంది. శనివారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసుల జాబితాను పరిశీలిస్తే వాషింగ్టన్‌ స్టేట్‌ పదో స్థానంలో నిలిచింది. మార్చి మూడో వారంలో 3,250 కేసులతో మొదటి స్థానంలో ఉన్న వాషింగ్టన్‌ స్టేట్‌ ఇప్పుడు 6,966 కేసుల దగ్గర ఆగిపోయింది.

అదే సమయంలో వంద కంటే తక్కువ కేసులు నమోదై కేసుల జాబితాలో చిట్టచివరన ఉన్న న్యూయార్క్, న్యూజెర్సీ ఇప్పుడు కరోనా కేసులకు కేంద్రబిందువయ్యాయి. తాజాగా న్యూయార్క్‌లో 1,03,476, న్యూజెర్సీలో 29,895 కేసులు నమోదయ్యాయి. మార్చి మూడో వారంలో 5 వేల కేసులతో రెండో స్థానంలో ఉన్న కాలిఫోర్నియా ఇప్పుడు 12,581 కేసులతో మూడు స్థానంలో ఉంది. వాషింగ్టన్‌ ప్రభుత్వానికి, పోలీసులకు అక్కడి ప్రజలు సంపూర్ణంగా సహకరించడం వల్లే కేసులు పెరగలేదని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా రివర్‌సైడ్‌ కల్చరల్‌ స్టడీస్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ టోబీ మిల్లర్‌ అన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆయన 4 రోజులపాటు సియాటిల్‌లో ఉన్నారు.

‘నేను అనుకోకుండా సియాటిల్‌లో లాక్‌డౌన్‌ కావాల్సి వచ్చింది. వారంపాటు అక్కడే ఉన్నా. సియాటిల్‌లో ప్రజలు రోడ్లపైకి రాకపోవడం, వచ్చినా పోలీసులు వారిని ఇళ్లకు తిప్పి పంపడం చూశా. సియాటిల్‌ పోలీసు చీఫ్‌తో కలసి ఓ రోజంతా కింగ్‌కౌంటీ ప్రాంతంలో తిరిగా. అబ్బురం అనిపించింది. ఇది అమెరికాయేనా అన్నంత అనుమానం వచ్చింది. నిత్యావసర సరుకుల స్టోర్స్‌కు కూడా గంటకు 10–15 మంది ప్రజలు, అది కూడా 5 మీటర్ల సామాజిక దూరం పాటిస్తూ సరుకులు కొనుగోలు చేయడం చూశా. కరోనా మార్చి 30న ఇంతటి భయంకరమైన అనుభవాన్ని ఇస్తుందని ఆ రోజున (మార్చి 19న) అనుకోలేదు.

అయినా ఆ రోజు నేను తిరిగిన కింగ్‌కౌంటీలోని సియాటిల్, కిర్క్‌లాండ్, కెంట్, రెడ్‌మాండ్, ఫెడరల్‌ వే, మ్యాపిల్‌ వ్యాలీలో జనం బయటకు రావడానికి భయపడ్డారు. ఈ రోజు నాకు అనిపిస్తోంది. అక్కడి పాలకులు, పోలీసులు, ప్రజలు ప్రదర్శించిన పరిణతిని అమెరికాలో మరెక్కడా చూడలేదు. తిరిగి నేను రివర్‌సైడ్‌ (కాలిఫోర్నియా) వచ్చిన తరువాత కూడా దాదాపు అదే స్థాయిలో లాక్‌డౌన్‌ అమలవుతున్నా కింగ్‌కౌంటీ తరహాలో మాత్రం లేదు. ఇవ్వాళ న్యూయార్క్, న్యూజెర్సీతోపాటు అనేక రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న ఈ విపత్తును చూస్తుంటే వాషింగ్టన్‌ స్టేట్‌ గ్రేట్‌. కాలిఫోర్నియాలో కొంతలో కొంత బెటర్‌’ అని ప్రొఫెసర్‌ టోబీ మిల్లర్‌ పేర్కొన్నారు.

కరోనా కేసుల వ్యాప్తి ప్రారంభం కావడంతోనే వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాలు మార్చి మొదటి వారంలోనే లాక్‌డౌన్‌ ప్రకటించాయి. కాలిఫోర్నియాలో 4 కోట్ల మంది, వాషింగ్టన్‌లో 76 లక్షల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఫేస్‌బుక్‌ సహా వందల కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ వెసులుబాటు కల్పించాయి. పని లేకుండా రోడ్లపైకి వస్తే పోలీసులు టికెట్‌ (జరిమానా) వేయడం ప్రారంభించారు. 100 నుంచి 400 డాలర్ల జరిమానా విధించారు. దీంతో ఆ రెండు రాష్ట్రాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. 

నిత్యావసర వస్తువుల కోసం దుకాణాల దగ్గరకు వెళ్లినప్పుడు 3 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఇంటికి ఒకరిద్దరు కాకుండా ఒక కమ్యూనిటీలో ఉండేవారు 4–5 కుటుంబాలకు అవసరమైన వస్తువుల కోసం ఒక్కరే వెళ్తుండేవారు. ‘ఇంత చేసినా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

కానీ ఇక్కడి పోలీసులు ఈమాత్రం కట్టడి చేయకపోతే 4 కోట్ల మందిలో ఎంతమందికి ఈ వ్యాధి సోకి ఉండేదో తలుచుకుంటేనే భయంకరంగా ఉంది’అని మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగిని పుచ్చలపల్లి సరస్వతి అన్నారు. సియాటిల్‌లో ఉంటున్న సరస్వతి కుటుంబం నెల రోజులుగా ఇంటి బయటకు రాలేదు. కాలిఫోర్నియాలోనూ ప్రజలు భయం భయంగానే బతుకుతున్నారు. అక్కడా నెల రోజులుగా లాక్‌డౌన్‌. 

మామూలుగా అయితే న్యూయార్క్‌ మాదిరే ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ఇక్కడకు వస్తుంటారు. ఈ కారణంగానే వైరస్‌ వ్యాప్తి చెందింది. కఠినమైన లాక్‌డౌన్‌ కారణంగా 10 వేల కేసుల దగ్గర ఉన్నామని, న్యూయార్క్, న్యూజెర్సీ మాదిరి ఇక్కడ కూడా ఆంక్షలు లేకపోతే కేసులు లక్షల్లో ఉండేవని శాన్‌ఫ్రానిస్‌స్కో సమీపంలోని హేవార్డ్‌లో ఉంటున్న సిద్దూ పొలిశెట్టి అన్నారు. ట్విట్టర్‌ కార్యాలయంలో పనిచేసే సిద్దు నెల రోజులుగా వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు.

ప్రపంచానికి వాషింగ్టన్ నగరం బోధిస్తున్నది ఒకటే. లాక్ డౌన్‌ని ఆషామాషీగా తీసుకోవద్దు. మనసావాచా దాన్ని పాటించండి. మీ ఆరోగ్యం మీదే అని మర్చిపోకండి. మరి భారత్ కానీ ఇతర ప్రపంచ దేశాలు కానీ వాషింగ్టన్ చెబుతున్న పాఠాన్ని స్వీకరిస్తాయా? 

 

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle