newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

లడాఖ్‌లో ప్రధాని మోడీ..... అవాక్కవుతున్న రక్షణశాఖ అధికారులు

03-07-202003-07-2020 11:06:12 IST
Updated On 03-07-2020 12:12:53 ISTUpdated On 03-07-20202020-07-03T05:36:12.176Z03-07-2020 2020-07-03T05:35:31.854Z - 2020-07-03T06:42:53.674Z - 03-07-2020

లడాఖ్‌లో  ప్రధాని మోడీ..... అవాక్కవుతున్న రక్షణశాఖ అధికారులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రధానమంత్రి నరేంద్రమోడీ లడాఖ్ చేరుకున్నారు. ఆయన పర్యటన గురించి రక్షణ శాఖ అధికారులకు కూడా తెలీకపోవడం విశేషం. వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన లఢక్ పర్యటనకు పూనుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిన ఆయన లేహ్ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె ఉన్నారు. నరేంద్ర మోడీ లేహ్ పర్యటనకు వెళ్తున్నట్లు చివరి నిమిషం వరకూ ఎవరికీ తెలియదు.

లడాఖ్ లో తాజా పరిస్థితిని అంచనా వేసేందుకు మోడీ రంగంలోకి దిగారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కూడా మోడీ పర్యటనకు సంబంధించిన సమాచారం తెలియదంటే.. ఆయన ఎంత హఠాత్తుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనేది అర్థం చేసుకోవచ్చు. లేహ్ చేరుకున్న వెంటనే ఆయన 14 కార్ప్స్ సైన్యాధికారులతో సమావేశం అయ్యారు.

చైనా దుశ్చర్యలను ఎండగడుతున్న భారత్ డ్రాగన్ దేశానికి సరైన సమాధానం చెప్పేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అక్కడ మన దేశం హై పవర్‌‌ బోట్స్‌ను మోహరిస్తోంది.తూర్పు లడాఖ్‌లోని పాంగోంగ్‌ సరస్సు పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ దురాక్రమణకు కేంద్రంగా ఉంది, భూభాగాన్ని విడిచిపెట్టాలని భారతీయులని బెదిరిస్తోంది.ఒక వైపు చర్చలు జరుపుతున్న చైనా తన సైన్యాన్ని బోర్డర్‌‌లో మోహరిస్తున్నట్లు తెలుస్తోంది

దీంతో అక్కడ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు బరువును మోయగలిటే విమానాలు, హెలికాప్టర్ల ద్వారా భారీ సంఖ్యలో వాటిని అక్కడికి చేరుస్తున్నారు. ఇప్పటికే టీ–90 లాంటి బాహుబలి యుద్ధ ట్యాంక్‌లను కూడా బోర్డర్‌‌లో ఉంచారు. లడాఖ్ లో ఏం చేయాలనేదానిపై మోడీ రక్షణ శాఖ అధికారులతో చర్చించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన వేళ ప్రధాని టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. గాయపడ్డ సైనికులను ఆయన పరామర్శించారు. సైనిక అధికారులతో కలిసి సరిహద్దులను పరిశీలించారు. ఆర్మీ కమాండెంట్లతో మోడీ భేటీ అయి వ్యూహాలను అమలుచేయనున్నారు. 

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   4 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   20 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle