newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

లక్షల కోట్ల వైరస్‌లూ కూడా దానికే భయపడతాయి

01-04-202001-04-2020 14:48:16 IST
Updated On 01-04-2020 14:50:36 ISTUpdated On 01-04-20202020-04-01T09:18:16.977Z01-04-2020 2020-04-01T09:18:15.021Z - 2020-04-01T09:20:36.403Z - 01-04-2020

లక్షల కోట్ల వైరస్‌లూ కూడా దానికే భయపడతాయి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ బారినపడిన వారి మరణాలు పెరుగుతున్న కొద్దీ ఏం చేస్తే కరోనా నుంచి తప్పించుకుంటాం అనే పిట్టకథలు, ఇంటివైద్యాలు, ఉచిత సలహాలు ప్రతిచోటా ఎక్కువైపోతున్నాయి. ఇది తినాలి.. అది తినకూడదు. ఫలానిది ముట్టకూడదు. చికెన్ తింటే అంతే లాంటి వైద్యులుకాని వారి ప్రచారాలు సోషల్ మీడియాలో రాజ్యమేలుతున్నాయి. కానీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న లక్షల కోట్ల వైరస్‌లు మనుషుల్లో ఉన్న ఒకే ఒక బలమైన అంశానికి తలవంచుతున్నాయని దాన్ని పెంపొందించుకోవాలంటే మనుషులు తమ శరీరాలను అత్యంత దృఢంగా మల్చుకోవాలని ఇన్ని కోట్ల వైరస్‌లూ బలమైన దేహం ముందు మాత్రమే ఓడిపోతాయని తాజా అధ్యయనం తేల్చిచెప్పింది.

కరోనా వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య నిపుణులు గత రెండు నెలలుగా చెబుతున్న విషయాలను వింటూనే ఉన్నాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి వైరస్‌ బారిన పడవచ్చు. అప్పుడు ఆ వైరస్‌ను తట్టుకొని ప్రాణాలను నిలబెట్టుకోవడం అందరి అవసరం. మరి అందుకు ఏం చేయాలి. మనుషుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నట్లయితే ఒక్క కరోనానే కాదు, పలు రకాల వైరస్‌లను, బ్యాక్టీరియాలను తట్టుకొని బతికి బట్టకట్టవచ్చు. సహజంగా ఆరోగ్యవంతంగా ఎదుగుతున్న పిల్లల్లో, యువతీ యువకుల్లో రోగ నిరోధక శక్తి సహజంగా ఎక్కువగా ఉంటుంది. వృద్ధులవుతున్నా కొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గుతూ వస్తుంది. 

అందుకే రోగనిరోధక శక్తి తగ్గకుండా పలు రకాల విటమిన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎలాంటి వైరస్‌నయినా నివారించుకోవచ్చు. అయితే సీ విటమిన్‌ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని గత రెండు నెలలుగా తెగ ప్రచారం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సీ విటమిన్‌ సప్లిమెంట్లు, సైట్రిస్‌ కలిగిన పండ్లను తెగతింటున్నారు. కానీ ఇది ఒక నమ్మకమే తప్పా సీ విటమిన్‌ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందనడానికి శాస్త్ర విజ్ఞానపరంగా ఎలాంటి ఆధారాలు లేవని బిర్మింగమ్‌ యూనివర్శిటీ ‘ఇమ్యునిటీ అండ్‌ ఏజింగ్‌’ విభాగంలో పని చేస్తోన్న ప్రొఫెసర్‌ జానెట్‌ లార్డ్‌ చెప్పారు. 

అన్నింటికన్నా ముఖ్యమైనది వ్యాయామమని, ఏ రకమైన వ్యాయామమైనా ఎంతో కొంత ఉపయోగకరమని ఆయన తెలిపారు. వ్యాయామం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచే ‘టీ–సెల్స్‌’ను శరీరంలో పెంచడంతోపాటు శరీరమంతా సంచరిస్తూ ఇన్‌ఫెక్షన్లను ఎప్పటికప్పుడు గుర్తించి రోగ నిరోధక వ్యవస్థకు సంకేతాలు పంపించే ‘మాక్రోఫేజెస్‌’ ఉత్పత్తి కూడా వ్యాయామం వల్ల పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలిందని ఆయన చెప్పారు. పైగా వ్యాయామం వల్ల వృద్ధాప్యం కూడా తొందరగా రాదని ఆయన తెలిపారు. 60 ఏళ్లు దాటిన వారు రోజుకు పది వేల మెట్లు ఎక్కడానికి సమానమైన దూరం నడిచినట్లయితే రోగ నిరోధక శక్తి బాగా పెరగుతుందని ఆయన చెప్పారు.

ఇక డైట్‌లో ఉప్పును బాగా తగ్గించాలని, మోతాదుకు మించి ఉప్పును తీసుకున్నట్లయితే అది రోగ నిరోధక శక్తిని దెబ్బ తీస్తుందని సస్సెక్స్‌ యూనివర్శిటీలో ఇమ్యునాలోజీ విభాగం లెక్చరర్‌ జెన్నా మాక్సియోచి చెప్పారు. ఆల్కహాల్‌ కూడా మోతాదుకు మించి తీసుకోరాదని, అది కూడా రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుందని ఆయన తెలిపారు. 

డీ విటమిన్‌ కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ‘బ్రిటిశ్‌ సొసైటీ ఆఫ్‌ ఇమ్యునాలోజీ’ అధ్యక్షుడు, లండన్‌ యూనివర్శిటీ కాలేజ్‌ ఇమ్యునాలోజీ ప్రొఫెసర్‌ అర్నే అక్బర్‌ తెలిపారు. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులో విటమిన్‌ డీ ఉంటుంది. ఉదయం పూట ఎండలో నిలబడినా డీ విటమిన్‌ వస్తుంది. రోగ నిరోధక శక్తిలో డీ విటమిన్‌ తర్వాత ఈ విటమిన్, జింక్‌ ప్రధాన పాత్రను పోషిస్తాయి. కాజు, పల్లీలు, బాదం గింజలతోపాటు విజిటెబుల్‌ ఆయిల్స్, సోయాబిన్, సన్‌ ఫ్లవర్‌ ఆయిల్స్‌ ద్వారా ఈ విటమిన్‌ లభిస్తుందని పలువురు వైద్యులు తెలిపారు. మాంసం, నత్త గుల్లలు, పాల ఉత్పత్తుల్లో, బలవర్థకమైన తృణ ధాన్యాల్లో జింక్‌ లభిస్తుందని వారు తెలిపారు. 

ఎలాంటి శారీరక శ్రమ లేకుండా వీటిన్నింటిని తింటున్నాం కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుందనుకుంటే పొరపాటని, ఎంతోకొంత శారీరక శ్రమ ఉంటేనే రోగ నిరోధక శక్తిపై విటమిన్ల ప్రభావం ఉంటుందని, కొన్ని లక్షల కోట్ల వైరస్‌లను, బ్యాక్టీరియాలను ఎదుర్కోవాలంటే శారీరక దృఢత్వం అవసరమని వైద్యులంతా సూచిస్తున్నారు. 

రోగనిరోధక శక్తి పెరగాలంటే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. శరీరం ఫిట్‌గా ఉండాలంటే పోషకాహారాన్ని తీసుకోవడం ఒక ఎత్తయితే దానికి మించి వ్యాయామం చేయడం చాలా అవసరం అని తాజా అధ్యయనం చెబుతోంది. ఆరోగ్యకరమైన తిండి, దృఢమైన శరీరం, మంచి వ్యాయామం, సిగరెట్లు, మందు ముట్టకపోవడం ఇవన్నీ పరస్పర పూరకాలుగా శరీరంపై పనిచేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయని, అదిమాత్రమే సమస్త వైరస్‌లనుంచి శరీరానికి శ్రీరామరక్షగా నిలుస్తుందని చెబుతున్నారు. 

మరి వీటన్నింటినీ పాటిద్దామా.. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle