newssting
BITING NEWS :
*ఇవాళ గురుపూర్ణిమ.. చంద్రగ్రహణం **దేశంలో కరోనా వీరవిహారం.. పాజిటివ్ కేసులు 6,72,695, మరణాలు 19,279 *దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా గురుపూర్ణిమ వేడుకలు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం ఇస్తున్న సాయినాధుడి ఆలయాలు *ఈనెల 7,8 తేదీల్లో ఇడుపులపాయలో సీఎం జగన్ పర్యటన. జులై 8 న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్న జగన్ *నెల్లూరు జిల్లాలో దారుణం..ఏడేళ్ళ బాలిక పై పీజీ‌ విద్యార్థి మనోజ్ అత్యాచారయత్నం..తప్పించుకుని తల్లిని తీసుకురాగా తల్లి పై దాడి చేసిన నిందితుడు *విద్యుత్ డిస్కంలు PFC, REC నుంచి 12,600 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *క‌రోనా ఎఫెక్ట్‌: ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు కోల్‌క‌తాకు విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు*జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కటింగ్ యంత్రంతో గొంతు కోసుకుని వృద్ధుడి ఆత్మహత్య*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,850 పాజిటివ్ కేసులు న‌మోదు, ఐదుగురు మృతి, జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 1,572 కొత్త క‌రోనా కేసులు..10,487 యాక్టివ్ కేసులు..11,537 డిశ్చార్జ్ అయిన కేసులు*మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. శనిగాపురం శివారు తుమ్మల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి *ఢిల్లీ: కరోనావైరస్‌నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీల‌క నిర్ణ‌యం.. ఈవీఎం బటన్‌ నొక్కేందుకు చేతి వేళ్లకు బదులుగా కర్ర చెక్కలను ఉపయోగించాలని నిర్ణయం*ఏపీలో ఇవాళ 7 65 కొత్త కేసులు నమోదు. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి. ఏపీలో 17,699కి చేరిన కరోనా కేసులు. ఇందులో 9473 యాక్టివ్ కేసులు ఉండగా, 8008 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం 218కి చేరిన కరోనా మరణాలు

లక్షమంది చస్తారు.. దేశాన్ని వదిలేస్తామా.. ట్రంప్ మరో పంచ్

06-05-202006-05-2020 09:08:43 IST
Updated On 06-05-2020 10:08:39 ISTUpdated On 06-05-20202020-05-06T03:38:43.821Z06-05-2020 2020-05-06T03:38:37.013Z - 2020-05-06T04:38:39.839Z - 06-05-2020

లక్షమంది చస్తారు.. దేశాన్ని వదిలేస్తామా..  ట్రంప్ మరో పంచ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌ చికిత్సకు ఇప్పటివరకూ ఎలాంటి మందు లేకపోవడంతో రోగులకు ఉపశమనంగా పలు మందులను చికిత్సలో ఉపయోగిస్తున్నారు. మహమ్మారి చికిత్సలో మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ సమర్ధవంతంగా పనిచేస్తుందని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరిశోధకులు ఆ మందులో పస లేదని తేల్చడంతో మిరాకిల్‌ డ్రగ్‌ కోసం వారానికో మందును చెప్పుకొస్తున్నారు. 

హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ పరమౌషధమని చెప్పిన ట్రంప్‌ ఆ తర్వాత అతినీలలోహిత కిరణాలు కోవిడ్‌-19 చికిత్సకు ఉపకరిస్తాయని చెప్పారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వైద్యుల తరహాలో ట్రంప్‌ సైతం కరోనా చికిత్సకు అద్భుత ఔషధం వేటలో పడినట్టు పలు ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా ట్రంప్‌ నోటివెంట కోవిడ్‌-19కు మరో మందు ముందుకొచ్చింది. రెమిడిసివిర్‌ మందు కోవిడ్‌-19 చికిత్సకు ప్రభావవంతంగా పనిచేస్తుందని ట్రంప్‌ చెబుతున్నారు. 

ఆస్పత్రిలో చికిత్స పొందే వైరస్‌ రోగులకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ సరైన ఔషధమని, మీడియా సహా పరిశోధక నివేదికలు సైతం ఇదే విషయం వెల్లడిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఎబోలా వైరస్‌ ఇన్ఫెక్షన్స్‌లో చికిత్సకు ఉపయోగించేలా అభివృద్ధి చేసిన రెమిడిసివిర్‌ 2002లో సార్స్‌ వ్యాప్తిచెందిన సమయంలో సమర్ధంగా పనిచేసింది. మెర్స్‌ వ్యాప్తినీ ఈ మందు ప్రభావవంతంగా అడ్డుకుంది.

దీంతో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఈ మందు పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలించగా మెరుగైన ఫలితాలు వచ్చాయి. రెమిడెసివిర్‌ను ఇచ్చిన రోగుల్లో రికవరీ రేటు 30 శాతం పెరిగిందని, మరణాల రేటు నాలుగు శాతం తగ్గిందని వెల్లడైంది. అయితే రెమిడిసివిర్‌ కోవిడ్‌-19కు అద్భుత ఔషధమని ఈ క్లినికల్‌ ట్రయల్స్‌లో పరిశోధకులు సూచించకపోవడం గమనార్హం. కోవిడ్‌-19 చికిత్సలో రెమిడిసివర్‌ను అనుమతించే ముందు మరింత పరిశోధన అవసరమని వైద్యారోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) సోకి దాదాపు లక్ష మంది అమెరికన్లు మరణించే అవకాశం ఉందని తాను విశ్వసిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అయితే మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ పురుద్ధరణ, వ్యాక్సిన్‌ తయారీ తదితర అంశాల గురించి ట్రంప్‌ ఫాక్స్‌ న్యూస్‌తో మాట్లాడారు. ప్రాణాంతక వైరస్‌ పుట్టుకకు కారణమైన చైనా వల్లే ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లిందని ఈ సందర్భంగా ఆయన మరోసారి మండిపడ్డారు.

ఇక అమెరికాలోని పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు పాక్షికంగా ఎత్తివేస్తున్న తరుణంలో.. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఇతర రాష్ట్రాలకు సూచించారు. ‘‘దేశాన్ని ఇలాగే వదిలేయలేం కదా. ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాల్సి ఉంది’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘‘కరోనా ధాటికి 75 లేదా 80 వేల నుంచి లక్ష మంది ప్రజలను మనం పోగొట్టుకోబోతున్నాం. ఇది చాలా భయంకరమైన విషయం’’ అని పేర్కొన్నారు. 

కాగా కరోనా కారణంగా అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు 68 వేల మంది మరణించగా.. 11 లక్షల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు. ఇక గతవారం ఇదే విషయం గురించి మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 70 వేలకు మించదని పేర్కొన్న విషయం తెలిసిందే. 

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం

అరుణాచల్, లద్దాఖ్, కార్గిల్‌లలో భూకంపం

   an hour ago


భారత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. చైనా కంపెనీల తాజా రాగం

భారత్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. చైనా కంపెనీల తాజా రాగం

   3 hours ago


ఒక్క రోజులో 60 వేల కేసులు.. అల్లాడుతున్న అమెరికా

ఒక్క రోజులో 60 వేల కేసులు.. అల్లాడుతున్న అమెరికా

   3 hours ago


ఈసీ కీలక నిర్ణయాలు... కరోనా ఎఫెక్టే కారణమా?

ఈసీ కీలక నిర్ణయాలు... కరోనా ఎఫెక్టే కారణమా?

   9 hours ago


భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి

భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక్కరోజులో 23వేలు, 442 మంది మృతి

   10 hours ago


భారత్‌పై దుందుడుకు వైఖరి..  చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత

భారత్‌పై దుందుడుకు వైఖరి.. చైనా నిజ స్వరూపం ఇదే.. ట్రంప్‌ స్పష్టత

   10 hours ago


భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

భారత్‌లో కరోనా బీభత్సం.. 30 రోజుల్లో 4 లక్షల కేసులు.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

   04-07-2020


భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన

భారత్ వివాదాలను పెంచుకోదలుస్తోందా.. మోదీ వ్యాఖ్యకు చైనా ఖండన

   04-07-2020


రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

   04-07-2020


చైనా, పాక్‌ల నడ్డివిరిచిన భారత్.. విద్యుత్ పరికరాల దిగుమతిపై నిషేధం

చైనా, పాక్‌ల నడ్డివిరిచిన భారత్.. విద్యుత్ పరికరాల దిగుమతిపై నిషేధం

   04-07-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle