newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

ర్యాలీలు, ధర్నాలు, బలప్రదర్శనలు.. కేరాఫ్ బెంగాల్

15-05-201915-05-2019 12:21:54 IST
2019-05-15T06:51:54.442Z15-05-2019 2019-05-15T06:51:51.738Z - - 21-08-2019

ర్యాలీలు, ధర్నాలు, బలప్రదర్శనలు.. కేరాఫ్ బెంగాల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్‌కు ముందు పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో బీజేపీ బలప్రదర్శనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. అమిత్‌ షా బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కోల్‌కతాలో రోడ్‌ షో నిర్వహించారు. సెంట్రల్‌ కోల్‌కతా నుంచి ప్రారంభమైన ర్యాలీ నగరానికి దక్షిణభాగంలో ఉన్న స్వామి వివేకానంద నివాసం వరకు సాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు బీజేపీ జిందాబాద్‌, మోదీ జిందాబాద్‌, అమిత్‌ షా జిందాబాద్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

రోడ్‌ షో దక్షిణ కోల్‌కతాలోని కలకత్తా విశ్వవిద్యాలయ ప్రాంగణం వద్దకు రాగానే సీపీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగాల విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. వారంతా నిరసనకు దిగారు. అమిత్‌ షా గో బ్యాక్‌ అని రాసిన నల్లజెండాలు చేతబట్టి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరో విడత పోలింగ్‌ సందర్భంగా చెలరేగిన హింస మరచిపోకుండానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లురువ్వడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దీంతో బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారును భర్తరఫ్‌ చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. చివరి విడత ఎన్నికల ప్రచారంలో మమతను పాల్గొననకుండా ఆమెపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు అమిత్‌ షాపై రెండు కేసులు నమోదు చేశారు. ఎన్నికల ర్యాలీ సందర్భంగా హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

బీజేవైఎం కార్యకర్త ప్రియాంక శర్మ అరెస్ట్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మమత సర్కారుపై తీవ్ర ఆగ్రహం చేసిన విషయం తెలిసిందే. ఏకపక్షంగా ఆమెను అరెస్ట్‌ చేశారని.. వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  బెంగాల్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై బుధవారం ఎన్నికల సంఘం అత్యవసరంగా భేటీ అయింది. మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగాల్‌ వ్యాప్తంగా బీజేపీ, వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. 

ప్రభుత్వాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. టీఎంసీ కార్యకర్తలు రౌడీయిజం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలో కోసం మమత హింసను ప్రేరేపిస్తున్నారని అమిత్ షా ధ్వజమెత్తారు. నిన్నటి హింసాత్మక ఘటనపై కేం‍ద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీజేపీ ఎదుగుదలను చూడలేక దాడులకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. మొత్తం మీద బెంగాల్ రాజకీయం అట్టుడుకుతోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle