newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

రోజుకు లక్ష కేసులు.. ప్రమాదంలో ప్రపంచం. డబ్ల్యూహెచ్ఓ తీవ్ర హెచ్చరిక

11-06-202011-06-2020 07:10:03 IST
2020-06-11T01:40:03.168Z11-06-2020 2020-06-11T01:40:01.312Z - - 12-08-2020

రోజుకు లక్ష కేసులు.. ప్రమాదంలో ప్రపంచం. డబ్ల్యూహెచ్ఓ తీవ్ర హెచ్చరిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి మరింత దిగజారుతోందని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు70 లక్షలను మించడంతో ఆందోళన వ్యక్తం చేసిన సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. ఐరోపాలో పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతరం అవుతోందని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ హెచ్చరించారు.

అమెరికా, దక్షిణ ఆసియాలోని 10 దేశాలనుంచి 75శాతం కేసులు నమోదయ్యాయంటూ విలేకరుల సమావేశంలో టెడ్రోస్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 రోజులలో తొమ్మిది రోజుల కాలంలో రోజుకు లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రధానంగా ఆదివారం అత్యధిక సంఖ్యలో 1,36,000 కేసులు నమోదయ్యాయన్నారు. ఆఫ్రికాలో చాలా దేశాలలో 1,000 కంటే తక్కువ కేసులు ఉన్నప్పటికీ, చాలా దేశాల్లో కొత్త ప్రాంతాల్లో విస్తరణ సహా కేసుల పెరుగుదల నమోదవుతోందని టెడ్రోస్ చెప్పారు. 

అదే సమయంలో ప్రపంచంలోని అనేక దేశాల్లో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయని టెడ్రోస్ చెప్పారు. అయితే ఈ దేశాలలో అతిపెద్ద ముప్పు నిర్లక్ష్యమేనని  టెడ్రోస్ పేర్కొన్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతూనే వుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 71,93,476 మంది ఈ వైరస్‌ బారినపడగా  4,08,614 మందికి పైగా బాధితులు మరణించారు.

ఒకే రోజు లక్షా 36 వేల కేసులు 

ప్రపంచ దేశాల్లో రోజురోజుకీ కోవిడ్‌ విజృంభిస్తోందని, ఈ వైరస్‌పై నిర్లక్ష్యం వద్దని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. అమెరికా, దక్షిణాసియా దేశాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రాస్‌ అద్నామ్‌ ఘెబ్రెయాసస్‌ చెప్పారు. ఆదివారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా 1,36,000 పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ‘కరోనా వైరస్‌ బట్టబయలై ఆరు నెలలైంది. ఇప్పటివరకు ఈ స్థాయిలో భారీగా కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. ఏ దేశం కూడా ఈ వైరస్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వెయ్యకూడదు’ అని అన్నారు. 

ఈ కేసుల్లో 75శాతం అమెరికా, బ్రెజిల్, దక్షిణాసియా దేశాలకు చెందినవేనని వెల్లడించారు. యూరప్‌లో కేసులు తగ్గుముఖం పడితే ఆఫ్రికా దేశాల్లో వైరస్‌ విస్తరిస్తోందన్నారు. అదే సమయంలో చాలా దేశాలు వైరస్‌పై విజయం సాధించడం ఊరట కలిగించే అంశమని అన్నారు. అయితే నిర్లక్ష్యంతో ఉంటే మళ్లీ వైరస్‌ విజృంభించే అవకాశాలున్నాయని టెడ్రాస్‌ హెచ్చరించారు.

ఆఫ్రికా అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ టెడ్రాస్‌ అన్నారు. జాతివివక్షకు వ్యతిరేకంగా జరిగే ప్రపంచవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమానికి తాము ఎప్పుడూ మద్దతుగా ఉంటామని, అయితే ఈ ప్రదర్శనలన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ప్రతీ నిరసనకారుడు ఒక మీటర్‌ దూరాన్ని పాటించాలని, దగ్గినప్పుడు చెయ్యి అడ్డుపెట్టుకోవడం వంటివి చేయాలని అన్నారు.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle