newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆరైళ్ళలో ఇక నో వెయిట్ లిస్ట్

31-12-201931-12-2019 08:39:42 IST
2019-12-31T03:09:42.468Z31-12-2019 2019-12-31T03:09:04.003Z - - 12-08-2020

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆరైళ్ళలో ఇక నో వెయిట్ లిస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రైలు ప్రయాణం సురక్షితమే కాదు, చౌక అయినది కూడా. అయితే, వివిధ రైళ్ళలో రిజర్వేషన్లు దొరకడం గగనం. 120 రోజుల ముందునుంచి రిజర్వేషన్లకు ప్రయత్నం చేసినా లాభం ఉండడంలేదు. వెయిటింగ్ లిస్ట్ లో తమ టికెట్ ఎప్పుడు కన్ ఫర్మ్ అవుతుందోనని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. తత్కాల్ రిజర్వేషన్లు వున్నా.. అవి క్షణాల్లో మళ్లీ వెయిట్ లిస్టులోకి వెళ్లిపోతాయి.

రాబోయే ఐదేళ్లలో ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–కోల్‌కతా మార్గాల్లో ప్రయాణించే రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు ఉండదని రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌ యాదవ్‌ శుభవార్త చెప్పారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు  2021 కల్లా పూర్తి కానున్నాయి. దీంతో రైళ్లలో రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. రూ.2.6 లక్షల కోట్లతో నిర్మించనున్న డీఎఫ్‌సీల నిర్మాణం పూర్తికానుండడంతో,  రైళ్ల వేగం పెంచడంతోపాటు ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు రైళ్లను నడిపే అవకాశం ఉందని రైల్వే బోర్డు చెబుతోంది. 

ఈకారణంగానే ప్రయాణికులకు వెయిటింగ్‌ లిస్టు బాధలు ఉండవంటున్నారు రైల్వే అధికారులు. ఈ ఏడాది రైల్వే ప్రమాదాలు తగ్గాయని, రైళ్లలో నేరాలను తగ్గించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రవేశపెడతామని రైల్వే వర్గాలు వెల్లడించాయి.

2022 మార్చి నాటికల్లా అన్ని రైల్వే స్టేషన్లు, బోగీల్లో సీసీటీవీలు ఏర్పాటు చేస్తారు. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనల కారణంగా రైల్వే శాఖకు వందకోట్ల వరకూ నష్టం వాటిల్లింది. రైల్వే చట్టం ప్రకారం.. ఈ నష్టాన్ని బాధ్యుల నుంచే వసూలు చేస్తారు. 

మరోవైపు ప్రైవేటు రైళ్ల  సంఖ్య కూడా బాగా పెరగనుంది. ఈ ఏడాది సూపర్ హిట్టైన తొలి ప్రైవేట్ రైలు తేజస్. ఈ రైలుకి మంచి లాభాలు రావడంతో మరో రూట్‌లో తేజస్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీయనుంది.

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-భారతీయ రైల్వే తొలి ప్రైవేట్ రైలు నడిపించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు రెండో ప్రైవేట్ రైలు కూడా పట్టాలు ఎక్కనుంది. 2020 జనవరి 19 నుంచి రెండో ప్రైవేట్ రైలు 'తేజస్ ఎక్స్‌ప్రెస్‌'ను నడిపించనుంది ఐఆర్‌సీటీసీ. 

ప్రైవేట్ రైలులో ప్రయాణం ఆలస్యం అయితే పరిహారం కూడా లభిస్తుంది. దీంతో ప్రయాణికులు ఈ రైలుకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అహ్మదాబాద్-ముంబై మధ్య జనవరి 17న మరో తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రెండు రోజులకు అంటే జనవరి 19 నుంచి తేజస్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీయనుంది.

ముంబై -అహ్మదాబాద్ మధ్య వారంలో ఆరు రోజులు తేజస్ ఎక్స్‌ప్రెస్ సేవలు లభిస్తాయి. ఈ రైలుకి 60 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.ఈ రైలులో అనేక ప్రత్యేకతలు వున్నాయి. రైలులో అత్యాధునికమైన సేవలు, టీ, కాఫీ, స్నాక్స్, భోజనం, ఇతర ప్రీమియం సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మొత్తం మీద రాబోయే ఏడాది నుంచి రైల్వే ప్రయాణికులకు మంచి రోజులు రానున్నాయి. 

 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   13 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   14 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle