newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

రెట్టింపవుతున్న కరోనా కేసులు, మరణాలతో ఆందోళన

06-04-202006-04-2020 09:30:03 IST
Updated On 06-04-2020 09:58:39 ISTUpdated On 06-04-20202020-04-06T04:00:03.014Z06-04-2020 2020-04-06T03:57:07.382Z - 2020-04-06T04:28:39.441Z - 06-04-2020

రెట్టింపవుతున్న కరోనా కేసులు, మరణాలతో ఆందోళన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ రోజురోజుకీ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 4,289 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో 274 జిల్లాలలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఆదివారం ఒక్కరోజే 472 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. దేశం మొత్తం మీద 118 మంది కరోనా వలన చనిపోయారని వెల్లడించారు. ప్రతి నాలుగు రోజులకు ఒకసారి కేసులు రెట్టింపవ్వడం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా వలన మృతుల సంఖ్య పెరిగింది. మహారాష్ట్రలో 748 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 45 మంది మృతి చెందారు. ఇటు తమిళనాడులో 571 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. దేశరాజధాని ఢిల్లీలో 503 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 12.71 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 69 వేలు దాటిపోయింది. ఇప్పటివరకు 2.61 లక్షల మంది కరోనా బాధితులు కోలుకున్నారు. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3.36 లక్షలు దాటింది. అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో 9,602 మంది మృతి చెందారు.

ఇటు అమెరికాలో మృత్యు ఘంటికలు మోగుతూనే వున్నాయి. అమెరికాలో రాబోయే రోజులు భయంకరంగా ఉండబోతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. వచ్చే కొద్ది వారాల్లో కోవిడ్‌–19 మృతులు భయంకరంగా నమోదవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే దేశాన్ని లాక్‌డౌన్‌ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అమెరికాని లాక్‌డౌన్‌ చేయడం వల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతను అరికట్టవచ్చు, దేశాన్ని నాశనం చేయలేమన్నారు.  న్యూయార్క్‌లో రోగులకు చికిత్స అందించడానికి వైద్యుల కొరత ఏర్పడింది. వైద్యులను ఇతర ప్రాంతాలనుంచి రప్పించడం కుదరడం లేదంటున్నారు. పాక్‌లో కరోనా కేసుల సంఖ్య 3 వేలకు చేరువలో ఉంది.  అయితే తాము కరోనాను సమర్థంగా ఎదుర్కొంటున్నామని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. 

కరోనా వైరస్ సోకడంతో బ్రిటన్ ప్రధాపి బోరిస్ జాన్సన్ ఆస్పత్రిలో చేరారు. వారం రోజులుగా స్వీయ నిర్బంధంలోనే వున్నారు. చికిత్స జరుగుతున్నా వైరస్ లక్షణాలు మాత్రం తగ్గడం లేదు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఇటు భారత దేశంలో లాక్ డౌన్ ఈనెల 14న ముగియనుంది. దీంతో రాబోయే 9 రోజులు కీలకమని, వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటున్నారు వైద్య నిపుణులు. ఎవరూ బయటకు రావడం మంచిది కాదని, ఎవరిళ్ళలో వారే ఉండాలని సూచిస్తున్నారు. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   2 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   5 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle