newssting
BITING NEWS :
* టీడీపీలో సంక్షోభం.. నలుగురు రాజ్యసభ ఎంపీల తిరుగుబాటు.. తమను బీజేపీలో విలీనం చేయాలని లేఖ *టీడీపీ రాజ్యసభ ఎంపీలకు స్వాగతం పలికిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా * పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ *కాకినాడలో కాపు నేతల రహస్య సమావేశం *టీటీడీ చైర్మన్‌ పదవికి పుట్టా సుధాకర్‌ రాజీనామా*లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా *కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

రెచ్చిపోయిన ఆజంఖాన్.. మహిళా కమిషన్ సీరియస్

15-04-201915-04-2019 08:38:25 IST
Updated On 15-04-2019 15:34:20 ISTUpdated On 15-04-20192019-04-15T03:08:25.141Z15-04-2019 2019-04-15T03:08:14.114Z - 2019-04-15T10:04:20.813Z - 15-04-2019

రెచ్చిపోయిన ఆజంఖాన్.. మహిళా కమిషన్ సీరియస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల ప్రచారాల్లో నేతల విమర్ళలు, ప్రత్యర్ధులపై చేసే ఆరోపణలు రచ్చరేపుతుంటాయి. స్థాయిని దిగజార్చేలా విమర్శలు చేయడం ద్వారా వారు వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా మహిళా నేతల పట్ల చేసే వ్యాఖ్యలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఆజంఖాన్ మళ్లీ రెచ్చిపోయాడు. మళ్ళీ జయప్రదను టార్గెట్ చేశారు.ఆజంఖాన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ నియోజకవర్గం నుంచి ఎస్పీ తరఫున పోటీ చేస్తున్న ఆజం ఖాన్, తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో పదేళ్లపాటు రాంపూర్‌కు జయప్రద ఎస్పీ తరఫున ప్రాతినిధ్యం వహించగా, ఇటీవలే ఆమె బీజేపీలో చేరి అదే స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.

ఎన్నికల సందర్భంగా ఆజం ఖాన్‌ మాట్లాడుతూ ‘జయప్రదను నేనే రాంపూర్‌కు తెచ్చాను. ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నాననేందుకు మీరే సాక్ష్యం. ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు మీకు 17 ఏళ్లు పట్టింది. కానీ ఆమె ఖాకీ నిక్కర్‌ వేసుకుంటుందనే విషయాన్ని నేను 17 రోజుల్లోనే తెలుసుకున్నాను’ అని ఖాన్‌ ఓ ఎన్నికల సభలో వ్యాఖ్యానించారు.

ఈ కామెంట్లపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆజంఖాన్‌ వ్యాఖ్యలు అభ్యంతకరంగా, కించపరిచేవిగా వున్నాయని... త్వరలోనే నోటీసులు పంపనున్నామని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ తెలిపారు. ఆయనను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కూడా తాము కోరతామన్నారు.

ఆజంఖాన్ వ్యాఖ్యలపై జయప్రద సీరియస్ అయ్యారు. నేను చనిపోతేనే నీకు సంతృప్తా అంటూ ...తనపై నీచంగా మాట్లాడుతున్న ఆజంఖాన్‌ను ప్రశ్నించారు జయప్రద.  ఆజంకు అసలు ఎన్నికల్లో పోటీ చేయనివ్వకూడదంటూ ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తి గెలిస్తే.. ప్రజాస్వామ్యం ఏమవుతుంది? అంటూ ప్రశ్నించారామె.అలాంటి వ్యక్తి గెలిస్తే మహిళలకు ఏమాత్రం రక్షణ ఉండదన్నారు. ఆజంఖాన్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను రెచ్చగొట్టేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle