newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

రెండు లక్షలకు చేరువలో కరోనా కేసులు.. 230 మంది మృతి.. 8,392 కొత్త కేసులు

02-06-202002-06-2020 11:21:00 IST
Updated On 02-06-2020 11:32:19 ISTUpdated On 02-06-20202020-06-02T05:51:00.337Z02-06-2020 2020-06-02T05:50:58.393Z - 2020-06-02T06:02:19.216Z - 02-06-2020

రెండు లక్షలకు చేరువలో కరోనా కేసులు.. 230 మంది మృతి.. 8,392 కొత్త కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కోవిడ్‌–19 మహమ్మారితో ఇప్పటివరకు 5,394 మంది మృతి చెందగా కేసుల సంఖ్య 1,90,535కు చేరుకుంది. రికార్డు స్థాయిలో ఒక్క రోజు వ్యవధిలోనే కోవిడ్‌–19 సాంక్రమిక వ్యాధికి 230 మంది బలికాగా, 8,392 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. 91,818 మంది వైరస్‌ బాధితులు కోలుకుని డిశ్చార్జి కావడంతో రికవరీ రేటు 48.19 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెయిన్‌ ఇటలీల తర్వాత ఏడో స్థానంలోకి భారత్‌ చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గణాంకాలు చెబుతున్నాయి. 

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది. ఆదివారం ఉదయానికి 8,380 కేసులు నమోదు కాగా. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఆదివారం కంటే ఎక్కువగా 8,392 కొత్త కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి 230 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,90,535కు చేరింది. ఈ మేరకు సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. 

ఇప్పటివరకు 91,819మంది కరోనానుంచి కోలుకుని డిశ్చార్జవ్వగా.. దాదాపు 93వేల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,394గా ఉంది. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 36వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌ ఉన్నాయి. కాగా, 1లక్ష 90వేల కరోనా కేసులతో భారత్‌ ప్రపంచవ్యాప్తంగా ఏడో స్థానంలో ఉంది.

దేశంలో కోవిడ్‌–19 వ్యాధి తీవ్రమైన సామాజిక వ్యాప్తి దశకు చేరిందని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వైద్య నిపుణులు, ఐసీఎంఆర్‌ కోవిడ్‌ –19 అధ్యయన బృందం సభ్యులు వెల్లడించారు. దేశంలో 1.90 లక్షల మందికి కోవిడ్‌ సోకి, 5వేల మంది మరణించినప్పటికీ దేశంలో ఇంకా సామాజిక వ్యాప్తి జరగలేదనడంలో అర్థం లేదని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే తీవ్రంగా కోవిడ్‌ బారిన పడిన దేశాల్లో భారత్‌ ఏడవ స్థానాన్ని ఆక్రమించింది. ఇంత విస్తృతంగా కోవిడ్‌–19 సామాజిక వ్యాప్తి జరిగిన దశలో, వైరస్‌ను అరికడతామని చెప్పడం అవాస్తవమైన విషయమని ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ అసోసియేషన్‌ (ఐపీహెచ్‌ఏ), ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌ (ఐఏపీఎస్‌ఎం), ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఎపిడమాలజిస్ట్స్‌ సభ్యులు ప్రధాని మోదీకి సమర్పించిన నివేదికలో వెల్లడించారు.

ఢిల్లీ సరిహద్దులు మూసివేత

ఐదో విడత లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ రాజధానిలో భారీగా సడలింపులు ఇస్తూ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌-5కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు వెల్లడించిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సెలూన్లు తిరిగి తెరుచుకోవచ్చని, అయితే స్పాలు తెరుచుకోడానికి మాత్రం అనుమతి తెలిపారు. అన్‌లాక్‌ 1.0 లో భాగంగా కేంద్రం అనుమతించిన అన్ని సడలింపులను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో వారం రోజుల పాటు రాష్ట్ర ఢిల్లీ సరిహద్దుల మూసివేత కొనసాగుతుందన్నారు. కేవలం అత్యవసర సరుకుల వాహనాల రాకపోకలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. 

సరిహద్దులను తెరిచే విషయంలో ప్రజల నుంచి సూచనలు స్వీకరించిన తరువాత ఒక వారంలో మళ్లీ నిర్ణయం తీసుకుంటామన్నారు. సరిహద్దుల విషయంలో ప్రభుత్వానికి సలహాలు అందిచాల్సిన ఢిల్లీ ప్రజలు 8800007722 నెంబర్‌కు శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు వాట్సాప్‌ లేదా మెయిల్‌ చేయాలని కోరారు. అలాగే ఉత్తర ప్రదేశ్, హర్యానాతో సరిహద్దులను తెరవడంపై ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సలహాలు కోరింది. రాష్ట్రంలోని అన్ని రకాల దుకాణాలను తెరుచుకోడానికి అనుమతిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. 

లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన రంగాలను దశలవారీగా తిరిగి ప్రారంభించడానికి కేంద్రం ఇటీవల వివరణాత్మక మార్గదర్శకాలను వెల్లడించిన విషయం తెలిసిందే. నిర్దిష్ట కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో మినహా అన్ని ప్రాంతాల్లో భారీ సడలింపులు కూడా ప్రకటించింది. కాగా భారత్‌లో కరోనా కేసులు రెండు లక్షలకు చేరువలో ఉండగా, 5,300 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఇక ఢిల్లీలో కేసుల సంఖ్య 10,893కు చేరింది. కరోనాతో 470 మంది మరణించారు.

తమిళనాడులో రోజుకు వెయ్యి కొత్త కేసులు

తమిళనాడులో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఈ సంఖ్య చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లోనే మరీ ఎక్కువగా ఉన్నాయి. ఈపరిస్థితుల్లో తిరువణ్ణామలైలో ఆదివారం ఒక్క రోజే 54 కేసులు నమోదయ్యాయి. ఇవి చెన్నై నుంచి అక్కడికి వెళ్లిన వారు కావడం గమనార్హం. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలోని 43, ప్రైవేటుపరంగా ఉన్న 29 అంటూ, మొత్తంగా 72 కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరిశోధనలు సాగుతున్నాయి. రోజుకు కనీసం 10 వేల మేరకు పరిశోధనలు జరుగుతున్నాయి. 

రోజూవారిగా పరిశోధన వివరాలు, పాజిటివ్‌ కేసుల సంఖ్యను ప్రతిరోజూ సాయంత్రం ఆరోగ్య శాఖ ప్రకటిస్తూ వస్తున్నది. ఈనెల 25 నుంచి కేసులు అమాంతంగా పెరిగాయి. 27వ తేదీ  817, 28వ తేదీన 827, 29వ తేదీ 874, 30వ తేదీ 938 కేసులు నమోదు కావడంతో ఆందోళన పెరిగింది. ఆదివారం రికార్డు స్థాయిలో 1,149 కేసులు నమోదయ్యాయి. రెండో సారిగా 13 మరణాలు ఒకే రోజు చోటు చేసుకోవడం కలవరం రేపుతోంది. అయితే, ఈ పరిశోధనలు మరి తక్కువగా ఉందని, మరింత తీవ్రతరం చేయాలని వైద్య నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ పరీక్షలు మరింత ముమ్మరం చేసిన పక్షంలో కేసులు అమాంతంగా పెరిగే అవకాశాలు ఎక్కువే

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   4 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   5 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   8 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   8 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   9 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle