newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రూపం మార్చుకుని ప్రతాపం చూపుతున్న కరోనా వైరస్

29-04-202029-04-2020 09:55:53 IST
Updated On 29-04-2020 10:16:36 ISTUpdated On 29-04-20202020-04-29T04:25:53.566Z29-04-2020 2020-04-29T04:25:31.919Z - 2020-04-29T04:46:36.497Z - 29-04-2020

రూపం మార్చుకుని ప్రతాపం చూపుతున్న కరోనా వైరస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ ప్రపంచం అంతా వ్యాపించింది. న్యూజిలాండ్ లో తగ్గిన కరోనా మహమ్మారి.. రష్యాలో వేగంగా వ్యాపిస్తోంది. రష్యా ప్రభుత్వం మొదట్లో తీసుకున్న కఠిన చర్యల కారణంగా కరోనా ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించింది. ఇప్పుడు మాత్రం రష్యాలో కరోనా వేగంగా ప్రబలుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,411 కరోనా కేసులు నిర్థారణ కాగా, మొత్తం కేసుల సంఖ్య 93,558కి చేరుకుంది. ఇదే రీతిలో కరోనా కేసులు నమోదైతే ఒకటి రెండు రోజుల్లో లక్ష కేసులు నమోదు అవుతాయని అధికారులు చెబుతున్నారు. వారం క్రితం కేసుల నమోదు తక్కువగానే ఉన్నా.. ఇప్పడు రోజుకు వందల సంఖ్యలో పాజిటీవ్‌లు నిర్థారణ అవుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

ఇటు కరోనా వైరస్ ఊసరవెల్లిలా తన రూపం మార్చుకుంటోందని శాస్త్రవేత్తలు నిర్దారించారు. ఈ కరోనా వైరస్‌ చిన్నగా ఉంటుంది. ఓ నీటి చుక్కలో.. లక్షకు పైగా ఉంటాయి. అంత చిన్నగా ఉంటుంది కాబట్టే.. వైరస్‌లో వాతావరణానికి తగ్గట్టుగా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. దీన్నే మ్యూటేషన్ అంటారు. ఇక్కడ రూపం మారడం అంటే.. మొత్తం స్వరూపం మారిపోవడం కానేకాదు. వైరస్‌ లోపల చిన్న చిన్న మార్పులు వస్తాయి.

అంటే.. కరోనా వైరస్‌ బంతిలా ఉంటూ.. చుట్టూ ముళ్ల లాంటి కొవ్వు పదార్థం ఉంది కదా. ఈ వైరస్‌ ఎప్పటికీ బంతిలాగే ఉంటుంది. ఆ ముళ్లు కూడా అలాంటే ఉంటాయి. కాకపోతే.. ఆ ముళ్ల ఆకారంలో మార్పులు రావొచ్చు. దాని కలర్‌ మారొచ్చు. దాని పొట్టలో మార్పులు రావొచ్చు. ఇవన్నీ రూపాంతరాలు కిందకు వస్తాయి. ఓవరాల్‌గా వైరస్‌ ఆకారం మాత్రం అలాగే ఉంటుంది. 

2019 డిసెంబర్‌లో చైనాలో పుట్టిన కరోనా వైరస్‌.. ఇప్పటి వరకు 10 రకాలుగా రూపాంతరం చెందింది. వాటిలో ఏ2ఏ అనే రకం ప్రపంచంలో ఎక్కువగా పాకుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మిగిలిన రూపాల్లోని కరోనా వైరస్‌లను పక్కకు పెట్టి.. ఈ ఏ2ఏ అనేదే అంతటా ఎక్కువగా వ్యాపిస్తోంది. అన్ని దేశాల్లో అదే విస్తరిస్తోంది. బెంగాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయో మెడికల్‌ జెనోమిక్స్‌లో.. నిధాన్‌ బిస్వాస్‌, పార్థ మజుందార్‌.. ఈ అధ్యయనం చేశారు. దీని వివరాల్ని త్వరలో ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో ప్రచురించబోతున్నారు. ఈ జర్నల్‌ను ఐసీఎంఆర్‌ పబ్లిస్‌ చేస్తోంది.

మనషుల ఊపిరితిత్తుల్లోకి ఎక్కువగా వెళ్తున్నది ఈ ఏ2ఏ రకం వైరసే అంటున్నారు. పదేళ్ల కిందట ఇదే జాతికి చెందిన సార్స్‌ వైరస్‌ కూడా ఇలాగే ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది. కానీ కరోనా వైరస్‌ చాలా దూకుడుగా వెళ్తోంది. ఆ సార్స్‌ వైరస్‌ నుంచే ఈ కరోనా వైరస్‌ పుట్టిందనే వాదన కూడా ఉంది.

 

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

   17 hours ago


దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

   19 hours ago


హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   25-07-2021


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   25-07-2021


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle