newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు.. దేశంలో మరో 73 మంది మృతి

01-05-202001-05-2020 11:01:05 IST
Updated On 01-05-2020 11:08:05 ISTUpdated On 01-05-20202020-05-01T05:31:05.405Z01-05-2020 2020-05-01T05:31:03.592Z - 2020-05-01T05:38:05.283Z - 01-05-2020

రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు.. దేశంలో మరో 73 మంది మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ ముగింపుకు ఇక సరిగ్గా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. మే నెల 3 తర్వాత మొత్తం పరిస్థితిపై కేంద్రం సమీక్షించి లాక్ డౌన్ కొనసాగింపు, సడలింపుపై కీలక నిర్ణయం తీసుకోనుంది. కానీ దేశంలో మాత్రం కరోనా మహమ్మారి తగ్గు ముఖం పట్టడం లేదు. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. 24 గంటల్లో 73 మంది కరోనా వల్ల మరణించినట్లు పేర్కొంది. ఇప్పటివరకూ భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35,043కు చేరినట్లు వెల్లడించింది. ఇప్పటివరకూ భారత్‌లో కరోనా బారిన పడి 1147 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతమున్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 25,007గా ప్రకటించింది. భారత్‌లో 8889 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

భారత్‌లో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం గమనార్హం. ఒక్క మహారాష్ట్రలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10వేలు దాటింది. మహారాష్ట్ర తర్వాత గుజరాత్‌లో అత్యధికంగా కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 10,498 కరోనా కేసులు నమోదు కాగా, 459 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్‌లో 4,395, ఢిల్లీలో 3,515, మధ్యప్రదేశ్‌లో 2,660, రాజస్తాన్‌లో 2,584, తమిళనాడులో 2,323, ఉత్తరప్రదేశ్‌లో 2,203 కరోనా కేసులు నమోదయ్యాయి. 

మహారాష్ట్రలో మరణాల సంఖ్య 432కు పెరిగింది. తర్వాత స్థానాల్లో గుజరాత్‌ (214), మధ్యప్రదేశ్‌ (130), ఢిల్లీ (56), రాజస్థాన్‌ (51), ఉత్తరప్రదేశ్‌ (40) ఉన్నాయి. కేసుల సంఖ్యలో కూడా మహారాష్ట్రే మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో కేసులు 10,498కి చేరాయి. ముంబైలోనే గురువారం కొత్తగా 583 కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 4,395 (కొత్త కేసులు 313), ఢిల్లీలో 3,439, మధ్యప్రదేశ్‌లో 2,660, రాజస్థాన్‌లో 2,438, ఉత్తరప్రదేశ్‌లో 2,221, తమిళనాడులో 2,323కు పెరిగాయి. తమిళనాడులో రికార్డుస్థాయిలో ఒకే రోజు 161 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో గురువారం 30 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ కేసుల సంఖ్య 565కి చేరింది. 

‘‘కరోనా కేసులు రెట్టింపు అయ్యేందుకు ఢిల్లీ, యూపీ, జమ్మూ కశ్మీర్‌, ఒడిశా, రాజస్థాన్‌, తమిళనాడు, పంజాబ్‌లో 11 నుంచి 20 రోజుల మధ్య  పడుతోంది. ఇదే కర్ణాటక, లద్దాఖ్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌, కేరళలో 20 నుంచి 40 రోజుల మధ్య పడుతోంది’’ అని  కేంద్ర ఆరోగ్య శాఖ  సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. రికవరీ రేటు 14 రోజుల్లో 13.06 శాతం నుంచి 25 శాతానికి మెరుగుపడిందని చెప్పారు. కరోనా వైర్‌సతో మరణించిన వారిలో 78 శాతం మందికి ఇతర వ్యాధులు ఉన్నాయని తెలిపారు. మృతుల్లో 65 శాతం మంది పురుషులు, 35 శాతం మహిళలని చెప్పారు. ‘‘వారిలో 14 శాతం 45 ఏళ్లలోపు, 34.8 శాతం 45-60 మధ్య, 51.2 శాతం 60 ఏళ్లు పైబడిన వారు’’ అని వివరించారు. 

కాగా, తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం కాస్త ఊరట కలిగించే విషయం. ఏపీలో మాత్రం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొత్తగా మరో  71 కేసులు నమోదయ్యాయి. దీంతో.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,403కు చేరింది. కర్నూలు జిల్లా 400 కేసులకు చేరువలో ఉంది.

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

   19 hours ago


దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

   21 hours ago


హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   25-07-2021


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   25-07-2021


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle