newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి

04-07-202004-07-2020 07:23:47 IST
2020-07-04T01:53:47.133Z04-07-2020 2020-07-04T01:53:44.473Z - - 03-08-2020

రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24 గంటల్లో 20,903 కొత్త కేసులు.. 379 మంది మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో మహమ్మారి కరోనా వైరస్‌ ఉదృతి రోజురోజుకు పెరుగుతోంది. కొన్ని రోజులుగా నిత్యం 19వేలకు పైగా కొత్త పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 20,903 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది. దేశంలో కోవిడ్‌ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో పాజిటివ్‌ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. కొత్త పాజిటివ్‌ కేసులతో కలుపుకొని దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,25,439కు చేరింది. 

అంతేకాకుండా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఈ మహమ్మారి కారణంగా 379 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 18,213కు చేరింది. ఇక దేశంలో ఇప్పటివరకు 3,79,892 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ కాగా 2,27,439 మంది వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కూడా కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 54 వేల కొత్త పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు ఏ దేశంలో కూడా నమోదు కాలేదని రాయిటర్స్‌ సంస్థ పేర్కొంది. 

మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో ఒక్క రోజే 6,330 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు బయటపడటం ఇదే తొలిసారి. ఒక్క ముంబైలోనే కొత్తగా 1554 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ముంబైలో మొత్తం బాధితుల సంఖ్య 80,262కు చేరగా, రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 1.86 లక్షలకు చేరింది. ఇప్పటిదాకా మహమ్మారి వల్ల ఎనిమిది వేల మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 124 మంది ప్రాణాలు వదలగా, 8,018 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో ప్రస్తుతం కోవిడ్–19 రికవరీ రేటు 54.21 శాతంగానూ, మరణాలు రేటు 4.38 శాతంగానూ ఉంది.

గురువారం బృహన్ ముంబై కార్పొరేషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఇప్పటిదాకా ముంబైలో 4,686 మంది కోవిడ్​కు బలయ్యారు. కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో మహారాష్ట్ర రాష్ట్రవ్యాప్త లాక్​డౌన్​ను జులై 31 వరకూ పెంచిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీల్లో భారీగా కరోనా కేసులు బయటపడుతుండటంతో ఇండియాలో కేసుల సంఖ్య ఆరు లక్షల మార్కును దాటేసింది. కరోనా బాధిత దేశాల్లో అమెరికా, బ్రెజిల్​, రష్యా, ఇండియా కంటే ముందు ఉన్నాయి.

కోవిడ్‌-19 : 60.73 శాతానికి చేరిన రికవరీ రేటు

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నా మహమ్మారి బారినపడి కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగడం ఊరట ఇస్తోంది. కోవిడ్‌-19 రోగుల రికవరీ రేటు శుక్రవారం 60.73 శాతానికి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్‌ నుంచి 20,033 మంది కోలుకోగా యాక్టివ్‌ కేసుల కంటే కోలుకున్న వారిసంఖ్య 1,50,000 అధికంగా ఉంది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 3,79,891 మంది కరోనా నుంచి కోలుకోగా 2,27,439 యాక్టివ్‌ కేసులున్నాయి.

మరోవైపు కోవిడ్‌-19 శాంపిల్స్‌ పరీక్షల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,41,576 శాంపిల్స్‌ను పరీక్షించగా ఇప్పటివరకూ మొత్తం 92,97,749 శాంపిల్స్‌ను పరీక్షించారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో రికార్డు స్ధాయిలో 20,903 తాజా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,25,439కు చేరింది. ఇక కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేబినెట్‌ కార్యదర్శి అధ్యక్షతన అత్యున్నత సమీక్షా సమావేశం నిర్వహించారు.

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle