newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

రాహుల్ వ్యాఖ్యలపై మహిళా ఎంపీల గరం గరం

13-12-201913-12-2019 15:17:34 IST
Updated On 13-12-2019 15:44:00 ISTUpdated On 13-12-20192019-12-13T09:47:34.203Z13-12-2019 2019-12-13T09:47:26.789Z - 2019-12-13T10:14:00.310Z - 13-12-2019

రాహుల్ వ్యాఖ్యలపై మహిళా ఎంపీల గరం గరం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జార్ఖండ్ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రచ్చరేపుతున్నాయి. దేశవ్యాప్తంగా అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. దిశ, ఉన్నావ్ హత్యాచార ఘటనలను ఉదహరిస్తూ.. భారత్ రేప్‌లకు రాజధానిగా మారుతోందంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరోసభలో మేక్ ఇన్ ఇండియా కాస్త.. రేప్ ఇన్ ఇండియాగా మారుతుందంటూ వివాదాస్పదంగా మాట్లాడారు. శుక్రవారం లోక్‌సభ అట్టుడికిపోయింది. ఇటీవల జరిగిన వరుస హత్యాచార ఘటనలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ఎంపీలు మండిపడుతున్నారు. శుక్రవారం పార్లమెంట్‌లో రాహుల్ వ్యాఖ్యల అంశాన్ని పలువురు బీజేపీ మహిళా ఎంపీలు లేవనెత్తారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలంటూ మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు.‘మేకిన్‌ ఇండియా’ ప్రోగ్రాంను అత్యాచారాలతో పోల్చడంపై స్మృతీ ఇరానీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ అసలు దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

రాహుల్ వ్యాఖ్యలు భారతమాతకు అవమానకరం అన్నారు బీజేపీ ఎంపీలు. రాహుల్ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీగా ఉండి దేశాన్ని కించపరిచేలా మాట్లాడడం రాహుల్ గాంధీకి తగదని, రాహుల్ ని శిక్షించాలని స్మృతీ ఇరానీ డిమాండ్ చేశారు. ఇక రాజ్యసభలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వడంతో.. ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు స్పందించారు. సభలో లేని వ్యక్తి పేరును చెప్పడం సరికాదంటూ ఎంపీలకు సూచించారు.

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   2 hours ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   9 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   9 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   04-08-2020


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle