facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

రాహుల్ పంచ్... మహిళల ఓట్లకు గాలం

13-03-201913-03-2019 17:37:08 IST
Updated On 13-03-2019 17:37:50 ISTUpdated On 13-03-20192019-03-13T12:07:08.337Z13-03-2019 2019-03-13T12:07:05.721Z - 2019-03-13T12:07:50.437Z - 13-03-2019

రాహుల్ పంచ్... మహిళల ఓట్లకు గాలం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నైలో సంచలన హామీ ఇచ్చారు. ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ రాహుల్ ఇచ్చిన హామీ హాట్ టాపిక్ అవుతోంది. మహిళల ఓట్లే లక్ష్యంగా బీజేపీకి పంచ్ విసిరారు రాహుల్ గాంధీ. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాహుల్ కీలక హామీలు ఇచ్చారు. పార్లమెంటులో పెండింగులో వున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకి చట్టరూపం కల్పిస్తామన్నారు. 

తాము అధికారంలోకి వస్తే పార్లమెంట్, అసెంబ్లీల్లో స్త్రీలకు 33శాతం రిజర్వేషన్ కల్పిస్తామని స్పష్టంచేశారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించి సంచలనం రేపారు. చెన్నైలోని ఓ మహిళా కాలేజీలో విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ పార్టీలు సైతం మహిళా ఓటర్లపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. టీఎంసీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో 40 శాతం మంది మహిళలకు టికెట్లు కట్టబెట్టారు మమతా బెనర్జీ. అటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైతం 33శాతం లోక్‌సభ సీట్లను మహిళలకే కేటాయించారు. తాజాగా రాహుల్ గాంధీ ప్రకటన రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. 

ఓ కాలేజీ విద్యార్థినులతో భేటీ సందర్భంగా రాహుల్ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పలువురు యువతులు అడిగిన ప్రశ్నలకు ఆయన చాలా ఓపికగా  సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో ఓ యువతి ఆయన్ను ఉద్దేశించి 'రాహుల్ సర్' అంటూ ఏదో అడగబోతుంటే వెంటనే రాహుల్ కలగజేసుకున్నారు. ‘సర్‌ కాదు.. రాహుల్‌ అని పిలవండి’ అని సదరు విద్యార్థినికి సూచించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

2014 ఎన్నికలతో  పోలిస్తే రాహుల్ గాంధీలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగానూ ఎన్నికలు ఎదుర్కోబోతున్న రాహుల్‌ గాంధీలో రాజకీయంగా పరిణతి కనిపిస్తోంది. సోషల్‌మీడియాలో గతంలో పప్పుగా అందరినోళ్లల్లోనూ నానేవారు రాహుల్. ఇప్పుడా పరిస్థితి లేనేలేదు.

రాజకీయంగా వివిధ అంశాలను లేవనెత్తే విషయంతోపాటు పదునైన విమర్శలు సంధించడంలోనూ చురుకుగా ఉన్నాడని పరిశీలకులే చెబుతున్నారు. కాపలాదారుడినన్న మోదీ వ్యాఖ్యను కాపలాదారుడే దొంగ ...చౌకీదార్‌ చోర్‌ హై.. అని తిప్పి కొట్టడం.. జీఎస్‌టీని గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌గా అభివర్ణించడం.. రఫెల్ వివాదం, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ అంశాల్లో రాహుల్ ప్రశ్నలు, పదునైన విమర్శలు రాహుల్ పొలిటికల్ గ్రాఫ్‌ని పెంచుతున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle