newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

రామాలయ నిర్మాణ బాధ్యత ఏ ట్రస్టుది? కొత్త గొడవలు ప్రారంభం

12-11-201912-11-2019 17:39:03 IST
2019-11-12T12:09:03.919Z12-11-2019 2019-11-12T12:09:01.031Z - - 12-08-2020

రామాలయ నిర్మాణ బాధ్యత ఏ ట్రస్టుది? కొత్త గొడవలు ప్రారంభం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అయోధ్య రామమందిరం, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు నవంబర్ 9న ఇచ్చిన అంతిమ తీర్పు కొన్ని అభ్యంతరాలు మినహాయిస్తే సర్వత్రా ఆమోదం పొందిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదు తరపున పోరాడిన ముస్లిం సంస్థలు కూడా కాస్త అసమ్మతి వాణిని వినిపించినప్పటికీ సుప్రీం తీర్పుపై అప్పీలుకు వెళ్లరాదని ప్రకటించి తమ ఔదార్యాన్ని చాటుకున్నాయి కూడా. ఒక్క మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మాత్రమే తీర్పుపై కాస్త కరకు విమర్శలు చేశారు. ఇల్లు కూలగొట్టిన వాడే ఆ ఇంటిని సొంతం చేసుకోవడం ఏం న్యాయం అంటూ ఓవైసీ చేసిన ప్రకటన ఇప్పుడు న్యాయవివాదాల్లో చిక్కుకుంది. 

తాజాగా రామమందిరం నిర్మాణాన్ని ఒక ట్రస్టుకు అప్పగించాలని సుప్రీం కోర్టు చేసిన సూచన కొత్త వివాదానికి ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే హిందూ ట్రస్టులు మూడు దశాబ్దాలుగా అయోధ్య వివాదంపై న్యాయపోరాటం చేసి ఫలితం సాధించిన నేపథ్యంలో కొత్త ట్రస్టుకు మందిర నిర్మాణం అప్పగించాల్సిన పనేమిటి అనే అంశంపై ఇప్పటికే ఉన్న ట్రస్టుల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

అయిదుగురు జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య స్థలవివాదంపై ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో ఆలయ పూజాకర్తవ్యాలు, ఆస్తుల నిర్వహణ బాధ్యత తనదే అని చెబుతూ వచ్చిన  నిర్మోహి ఆఖారా సంస్థ వాదనను తోసిపుచ్చిన విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పర్చే ట్రస్టుకు మాత్రమే రామమందిర నిర్మాణ బాధ్యతలను బదలాయించాలని, ఆలయ స్థలాన్ని కేంద్రం ఏర్పర్చే ట్రస్టుకే అప్పగించాలని సుప్రీం కోర్టు చేసిన సూచనపై తీర్పు ఇచ్చిన రెండు రోజుల తర్వాత మాటల యుద్ధం మొదలైంది. 

1990ల నుంచి అయోధ్య ఆలయ ఉద్యమంలో కీలకపాత్ర వహిస్తున్న రామ్ జన్మ భూమి న్యాస్ ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ సుప్రీం తీర్పుపై అభ్యంతరం వెలిబుచ్చారు. ఆలయ నిర్మాణం కోసం కొత్తగా ట్రస్టును ఏర్పర్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ట్రస్టును కొత్తగా ఏర్పర్చాల్సిన అవసరం ఏమిటి, ఎవరు దాన్ని ఏర్పరుస్తారు, దాని సభ్యులెవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

రామాలయ నిర్మాణం కోసమే రామ్ జన్మ భూమి న్యాస్ ట్రస్టును గతంలో ఏర్పర్చామని, తమ అధ్వర్యంలోనే సాగే ఆలయ నిర్మాణ పనుల్లో నిర్మోహి అఖారా వంటి సంస్థలు కూడా చేరి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని గోపాల్ దాస్ తెలిపారు.

అయితే ఈ వాదనను నిర్మోహి అఖారాకు చెందిన మహంత్ ధీరేంద్ర దాస్ కొట్టిపడేశారు. రామ్ జన్మ భూమి న్యాస్ ట్రస్టుపై మేం ఇంతకాలం పోరాడుతూ వచ్చాం. అలాంటిది ఇప్పుడు వారి ట్రస్టులో మేం చేరగలమని ఎలా ఊహిస్తారు? వాళ్లే తమ ట్రస్టును మాకు స్వాధీనపర్చి మాలో భాగం కావచ్చు. మేం నిర్మోహిలం. వారిలో ఎన్నటికీ భాగం కాలేం.ప్రభుత్వమే దీనికి పరిష్కారం కనుగొని ప్రతి ఒక్కరినీ ఒకచోటికి చేర్చాల్సి ఉందని ధీరేంద్ర దాస్ పేర్కొన్నారు. 

తొలినుంచి పరమహంస రామచంద్ర దాస్ నేతృత్వంలో 1993 నుంచి ఆయోద్య ఆలయ స్థలవివాదంపై పోరాడుతున్న దిగంబర అఖారాకు చెందిన మహంత్ సురేష్ దాస్ సుప్రీం కోర్టు తీర్పును అద్భుతమైనదిగా కొనియాడారు. సోమనాథ్ ఆలయ ట్రస్టు లాగా  రామాలయ నిర్మాణంకోసం కొత్త ట్రస్టును ఏర్పర్చటం అవసరమే. ఆలయ నిర్మాణం ప్రభుత్వ బాధ్యత కాదు. అది ట్రస్టు బాధ్యత మాత్రమే. ఈ విషయమై మరోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి చర్చిస్తామని మహంత్ సురేష్ దాస్ వివరించారు.

అయోధ్య ఆలయ స్థలంపై హక్కు కోసం తొలినుంచి పోరాడిన మూడు ప్రధాన హిందూ సంస్థల మధ్య ఆలయ నిర్మాణ బాధ్యత విషయమై కొత్త తగువు ప్రారంభం కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త ట్రస్టును ఏర్పర్చాల్సిన  కేంద్రం ప్రభుత్వానికి కొత్త తలనొప్పి మొదలైనట్లే మరి.

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   14 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle