newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

రష్యా అధ్యక్షుడికి మోడీ ఫోన్....వ్యూహాత్మక అంశాలపై చర్చ

03-07-202003-07-2020 12:16:06 IST
Updated On 03-07-2020 12:28:19 ISTUpdated On 03-07-20202020-07-03T06:46:06.839Z03-07-2020 2020-07-03T06:45:40.857Z - 2020-07-03T06:58:19.520Z - 03-07-2020

రష్యా అధ్యక్షుడికి మోడీ ఫోన్....వ్యూహాత్మక అంశాలపై చర్చ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్ - రష్యా ఎప్పటినుంచో స్నేహసంబంధాలతో కొనసాగుతున్నాయి. తాజాగా మోడీ అధికారంలోకి వచ్చాక ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. తాజాగా రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ మరో 16 ఏండ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు తీసుకువచ్చిన రాజ్యాంగ సంస్కరణలకు రష్యా ప్రజలు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 

పుతిన్‌ రష్యా అధ్యక్షుడిగా 2036 వరకు కొనసాగేలా రాజ్యాంగ సంస్కరణలు చేశారు. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణకు వారం రోజులపాటు ఎన్నికలు నిర్వహించారు. ఇవి బుధవారంతో ముగిశాయి. ఇందులో 60 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజా సంస్కరణలకు అనుకూలంగా 76.9 శాతం మంది ఓటేశారు. 

పుతిన్‌ అధ్యక్ష పదవీకాలం 2024లో ముగియనుంది. కాగా, ఈ ఎన్నికలు ఏప్రిల్‌ 22నే జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ విజృంభణతో వాయిదావేశారు. ప్రస్తుతం 79 ఏండ్ల వయస్సులో ఉన్న పుతిన్‌, 2000 సంవత్సరం నుంచి రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా మోడీ ఫుతిన్ కి శుభాకాంక్షలు తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ప్రధాని మోదీ చర్చలు జరిపారు.ఇరు దేశాల అధ్యక్షులు ఫోన్‌ ద్వారా సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

తాజాగా భారత్- చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, చైనా సైనికుల దాడి , భారతసైనికులు మరణించిన ఉదంతాలను ప్రస్తావించారు. సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉన్న వేళ ఇరు దేశాల చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యాలో రాజ్యాంగ సవరణలపై విజయవంతంగా ఓటింగ్‌ను పూర్తి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని అభినందించారు. రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూన్24న మాస్కోలో విక్టరీ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత్ తరఫున రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ వేడుకల గురించి కూడా పుతిన్‌తో మోదీ ప్రస్తావించారు. 

ఈ ఏడాది చివర్లో భారత్‌లో ఇరుదేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక సదస్సు నిర్వహించే అంశంపై ఇరువురు నేతలు చర్చించారు. ద్వైపాక్షిక సదస్సుకు భారత్‌కు రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించగా... పుతిన్ అందుకు ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ 19 ప్రభావం తగ్గించేందుకు ఇరుదేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. 

 

 

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   6 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   9 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle