newssting
BITING NEWS :
*ప్రధాని మోదీని కలిసిన వైఎస్ఆర్సీఎల్పీ నేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సమస్యలపై చర్చ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం * వాల్డ్ కప్ వార్మప్ మ్యచ్ లో టీమిండియా పేలవ ప్రదర్శన, న్యూజీల్యాండ్ చేతిలోఓటమి * నరేంద్ర మోదీని పీఎం ఎలక్ట్ గా నియమించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ * రాష్ట్రపతి కోవింద్ కు కొత్త ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ * ఎవరెస్ట్ పర్వతంపై ఈ వారం మరణించిన పర్వతారోహకుల సంఖ్య 10కి చేరిక * తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా సమర్పించిన సీఈఓ జీకే ద్వివేది

రండి..రండి....తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ!

16-05-201916-05-2019 15:00:04 IST
2019-05-16T09:30:04.543Z16-05-2019 2019-05-16T09:27:38.354Z - - 26-05-2019

రండి..రండి....తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మే 23 వ తేదీ.. అన్ని పార్టీలకు అది అగ్ని పరీక్షా కాలం. విద్యార్ధులు పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టుగా ప్రధాన పార్టీల తమ తలరాతను మార్చే ఫలితాలపై కన్నేశాయి. ఇదిలా ఉంటే జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు రంగంలో దిగారు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ. కేంద్రంలో ఎన్డీఏకు చెక్ పెట్టేందుకు అన్ని పార్టీలను కలుపునికి వెళ్లేందుకు ముందడుగు వేసారు.

ఈ మేరకు అన్ని పార్టీలకు సోనియా లేఖ రాసారు. ఈ లేఖ కీలకంగా మారింది. తాము ప్రధానమంత్రి బరిలో లేమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మే 23వ తేదీన మీటింగ్ పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మోడీని గద్దె ఎక్కకుండా ఉంచేందుకు, భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవడానికి మే 23వ తేదీన నిర్వహిస్తున్న సమావేశానికి సోనియా ఆ పార్టీల నేతలను ఆహ్వానిస్తూ లేఖలు రాశారు. మే 23వ తేదీ తర్వాత యూపీఏ భాగస్వామ్య పక్షాలు, ఏన్డీయేతర పక్షాలు ఏకతాటిపై ఉండాలనే ఉద్దేశంతో ఆమె ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో తీర్పు ఏన్డీఏకు అనుకూలంగా లేకపోతే భవిష్యత్తు కార్యాచరణకు తమ సమావేశం రోడ్ మ్యాప్ వేసే దిశగా ఉండాలనేది సోనియా ఆలోచనగా తెలుస్తోంది. 

ఎన్డీదఎలో గానీ యూపీఏలో గానీ భాగస్వాములు కాకుండా తటస్థంగా ఉన్న పార్టీలను కూడా సోనియా గాంధీ 23వ తేదీ సమావేశానికి ఆహ్వానించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకే కాకుండా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కి కూడా సోనియా ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. మధ్య ప్రదేశ్ సీఎం కమల్ నాథ్ , ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో స్వయంగా మాట్లాడి 23వ తేదీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle