newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

యూపీలో వికాస్ దూబె కోసం గాలింపు.. సహాయకుడి ఎన్ కౌంటర్

08-07-202008-07-2020 09:35:53 IST
Updated On 08-07-2020 11:19:09 ISTUpdated On 08-07-20202020-07-08T04:05:53.597Z08-07-2020 2020-07-08T04:04:35.804Z - 2020-07-08T05:49:09.317Z - 08-07-2020

యూపీలో వికాస్ దూబె కోసం గాలింపు.. సహాయకుడి ఎన్ కౌంటర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యూపీలో రౌడీ షీటర్ వికాస్ దూబె వ్యవహారం పోలీసులకు సవాల్ గా మారింది. గ్యాంగ్‌ స్టర్‌ వికాస్‌ దూబేను పట్టుకోవడానికి నాలుగురోజుల నుంచి కష్టపడుతున్న ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కాస్త విజయం సాధించారు. వికాస్‌ దూబే ప్రధాన సహాయకుడు అమర్‌ దూబేని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో ఈ రోజు ఉదయం అమర్‌ దూబేను ప్రత్యేక పోలీసులు కాల్చి చంపినట్టు సమాచారం. అతని డెడ్ బాడీ కూడా బయటకు వచ్చింది.  కాన్పూర్‌ ఘటనలో ప్రధాన నిందితుల్లో ఒకరైన అమర్‌ దూబే బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని ఉత్తరప్రదేశ్‌ అదనపు డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. 

వికాస్ దూబె ఆచూకీ కోసం గాలిస్తున్నామని, అయితే హిమాచల్‌ప్రదేశ్‌ పోలీసులతో కలిసి యూపీ ప్రత్యేక పోలీసులు అతనికోసం గాలింపు చేపట్టాయని తెలిపారు. అమర్‌ దూబేపై రూ.50 వేల రివార్డు ఉందని తెలిపారు. కాన్పూర్‌లో గత గురువారం ఎనిమిది మంది పోలీసులను చంపిన వికాస్‌ దూబే ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు. పోలీసులను హతమార్చిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా వుంది. నిందితుల కోసం మధ్యప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 100కుపైగా స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు గాలిస్తున్నాయి. వికాస్ దూబె అనుచరులకు పోలీసుల దాడి సమాచారం ముందుగానే అందిందని అంటున్నారు. దీనికి బాధ్యులైన ఇంటిదొంగలను పట్టుకునే పనిలో వున్నారు పోలీసులు. 

ఫరీదాబాద్‌లో ఉన్న బద్కాల్‌ చౌక్‌లోని శ్రీరామ్‌ హోటల్‌లో వికాస్ ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో హర్యానా క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన పోలీసులు మంగళవారం రాత్రి ఆ హోటల్‌పై దాడి చేశారు. కానీ అతడు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యాడు. సీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా అతడు హోటల్‌ పరిసరాల్లో తిరిగినట్లు వుంది. వికాస్‌ దూబేను వెతకడానికి ఉత్తరప్రదేశ్‌ పోలీసులు సుమారు 100కు పైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వికాస్ దూబె ప్రధాన అనుచరుడు అమర్ దూబె ఎన్ కౌంటర్లో హతం కావడంతో కేసులో ముందడుగు పడిందంటున్నారు. 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   5 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   9 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle