newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

యూపీలో రెచ్చిపోయిన రౌడీమూకలు.. కాల్పుల్లో 8మంది పోలీసుల మృతి

03-07-202003-07-2020 08:18:56 IST
Updated On 03-07-2020 08:19:46 ISTUpdated On 03-07-20202020-07-03T02:48:56.480Z03-07-2020 2020-07-03T02:48:52.690Z - 2020-07-03T02:49:46.430Z - 03-07-2020

యూపీలో రెచ్చిపోయిన రౌడీమూకలు.. కాల్పుల్లో  8మంది పోలీసుల మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రౌడీలు రెచ్చిపోతున్నారు. గ్యాంగ్ వార్ లతో ప్రజలకు సవాల్ విసురుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రౌడీ మూకలు పోలీసులపై కాల్పులు జరిపి కలకలం రేపారు. ఈ ఘటనలో 8 మంది పోలీసులు మృతి చెందారు. వీరిలో ఓ డిప్యూటీ ఎస్పీ సైతం ఉన్నారు. కరుడుగట్టిన రౌడీ షీటర్ వికాస్ దూబేను పట్టుకోవడానికి బికారు గ్రామానికి పోలీసుల బృందం అక్కడకు చేరుకుంది. దీంతో పోలీసులపైకి అతడి అనుచరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో డిప్యూటీ ఎస్పీ సహా ఎనిమిది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ సత్వరం దర్యాప్తునకు ఆదేశాలు జారీచేశారు. క్రిమినల్స్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాల్పలు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ హెచ్‌సీ అవస్థీని ఆదేశించారు. దీనిపై వెంటనే నివేదికను అందజేయాలని సూచించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీచేశారు. 

అసలేం జరిగిందంటే... 

యూపీలో పలు నేరాలకు పాల్పడ్డాడు వికాస్ దూబె.  నేరస్థుడు వికాస్ దూబే కోసం డిప్యూటీ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ దేవెందర్ మిశ్రా ఆధర్వంలోని పోలీసుల బృందం బికారు గ్రామానికి శుక్రవారం తెల్లవారుజాము చేరుకుని సోదాలు నిర్వహిస్తుండగా.. దుండగులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. పోలీసులపై విచక్షారహితంగా కాల్పులు జరిపారు. తప్పించుకునే అవకాశం లేకపోవడంతో  పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడినవారిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. మరికొందరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 60 కేసుల్లో నిందితుడిగా ఉన్న వికాస్ దూబేను అరెస్ట్ చేయడానికి గురువారం రాత్రి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అతడి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, అతని అనుచరులు కాల్పులు జరపడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. 

 

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle