newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం ...24మంది దుర్మరణం

16-05-202016-05-2020 07:49:23 IST
Updated On 16-05-2020 07:59:22 ISTUpdated On 16-05-20202020-05-16T02:19:23.880Z16-05-2020 2020-05-16T02:18:34.912Z - 2020-05-16T02:29:22.164Z - 16-05-2020

 యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం ...24మంది దుర్మరణం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా లాక్ డౌన్ కారణంగా పనుల్లేక వలస వెళ్లి తిరిగి ప్రాంతాలకు వెళ్ళి సొంతింటికి వెళుతున్న వారిని విధి వెంటాడింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరయ ప్రాంతంలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో 23 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు రాజస్థాన్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కువెళ్తున్న వలస కూలీలుగా గుర్తించారు. దీంతో వలస కార్మికుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

మే8న జరిగిన ఔరంగాబాద్ రైలు ప్రమాదం 

ఆత్మనిర్భర భారత్ పేరుతో  కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లక్ష కోట్ల ప్యాకేజీ ఏ మాత్రం ఆదుకోవడం లేదని పలు ఘటనలు చూపిస్తున్నాయి. ఉపాధి పోవడంతో..వారి వారి రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. కాలినడకన వెళుతూ..చనిపోయిన సందర్బాలున్నాయి. కానీ..రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది చనిపోతుండడం అందర్నీ కలిచి వేస్తోంది. ఘటనా ప్రదేశం వద్ద హృదయవిదాకరంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారిని కాన్పూర్ ఆసుపత్రికి తరలించారు. మే 14న మహారాష్ట్ర నుంచి కొంతమంది వలస కూలీలు సొంతూళ్లకు వెళుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ వద్ద కంటైనర్ ఢీకొనడంతో 8 మంది చనిపోయారు.

లాక్ డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో వున్న వలస కార్మికులు వివిధ మార్గాల్లో తమ స్వంతూళ్ళకు చేరుకుంటున్నారు.వారు వివిధ ప్రమాదాల బారిన పడుతున్నారు. అంతకుముందు ఈనెల 8వ తేదీన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. రైలు ఢీకొని 16 మంది వలస కూలీలు మృతిచెందారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు.

వీరంతా కర్మాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్నారు. రైళ్లు నడవడం లేదన్న ఆలోచనతో కావచ్చు అలసిన శరీరాలతో కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు ట్రాక్‌పై నిద్రకు ఉపక్రమించారు. కాగా జల్నా-ఔరంగాబాద్‌ మధ్య నడిచే గూడ్స్‌ రైలు వీరు నిద్రిస్తున్న ట్రాక్‌పై నుంచి పోవడంతో కూలీలంతా అక్కడికక్కడే చనిపోయారు. ట్రాక్ పై వారు నిద్రించి వున్న సంగతి ఆలస్యంగా గమనించిన గూడ్స్ లోకో పైలట్ రైలుని నియంత్రించేందుకు ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. వరుస ప్రమాదాల్లో వలస కార్మికులు మరణించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది. 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   4 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   15 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle