newssting
BITING NEWS :
* శనివారం మధ్యాహ్నమే కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్ని రేపటికి ప్రీ పోన్ చేసిన ఏపీ సర్కార్ *కాకినాడలో దారుణం..రేచర్లపేటలో నాలుగేళ్ల చిన్నారి మీద అత్యాచారం..చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు మైనర్లు *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం*ఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్*ఆస్తుల కేసులో హాజరుకాలేనని సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్... విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఈ రోజు హాజరుపై సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు*అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *అమరావతిలో 31వ రోజుకు చేరిన ఆందోళన.. లోకేష్ బైక్ ర్యాలీ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు * టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

యువత ఉసురు తీస్తున్న నిరుద్యోగం, ఆర్థికమాంద్యమే కారణమా?

13-01-202013-01-2020 09:32:36 IST
2020-01-13T04:02:36.470Z13-01-2020 2020-01-13T04:02:16.505Z - - 17-01-2020

యువత ఉసురు తీస్తున్న నిరుద్యోగం, ఆర్థికమాంద్యమే కారణమా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, ఉద్యోగాల కోత, నిరుద్యోగం యువత ఉసురు తీస్తోంది. తాజాగా విడుదలైన నివేదిక కలవరపరుస్తోంది. హోంమంత్రిత్వ శాఖ  విడుదలచేసిన ఎన్‌ఆర్‌సీబీ నివేదిక ప్రకారం 2018లో 12,936 మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించింది. దేశంలో రైతుల కంటే నిరుద్యోగుల బలవన్మరణాలే అధికం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

2018, 2017 రైతుల ఆత్మహత్యలతో పోలిస్తే నిరుద్యోగులే ఎక్కువగా ప్రాణాలు వదిలారు. 2018లో ప్రతి గంటకూ ఒక నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 2018లో జరిగిన 1,34,516 ఆత్మహత్యల్లో 9.6 శాతం నిరుద్యోగులవే కావడం ఆందోళన కలిగిస్తోంది.

దేశంలో 10,349 మంది రైతు ఆత్మహత్యలు కాగా ఇవి మొత్తం మరణాల్లో 7.7 శాతం మాత్రమే. ఆత్మహత్యకు ప్రేరేపించే అంశాలు పురుషులపైనే ఎక్కువగా వున్నాయి. 10,687 మంది పురుషులు ఆత్మహత్యలు చేసుకోగా, అందులో 2249 మంది స్త్రీలు మాత్రమే. 

మరో ఆందోళనకరమయిన అంశం ఏమిటంటే అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన కేరళ ఆత్మహత్యల్లోనూ ముందుంది. నిరుద్యోగుల ఆత్మహత్యల్లో 12.3 శాతంతో కేరళ ముందుంది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీలు తర్వాతి స్ధానాల్లో వున్నాయి. ఆర్థిక వృద్ధిరేటు కూడా ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే.

భారత జీడీపీ వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్ఠ స్థాయి 5 శాతానికి పరిమితం కానుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. 2008-09లో 3.1 శాతంగా వృద్ధి రేటు ఉంది. ఆతర్వాత ఇదే కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. ఈసారి వృద్ధి క్షీణతకు వస్తు తయారీ రంగం పడకేయడమే ప్రధాన కారణం అంటున్నారు ఆర్థిక నిపుణులు.  2019-20లో వస్తు తయారీ రంగ వృద్ధి కేవలం 2 శాతం వుంటుందని అంచనా వేసింది.

దేశవ్యాప్తంగా ఆటో, మాన్యుఫ్యాక్చరింగ్, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఆర్థిక మందగమనం కనిపిస్తున్న తరుణంలో తాజా గణాంకాలు వెలువడటం ఆందోళన కలిగించే పరిణామంగా చెబుతున్నారు.

కార్పోరేట్లకు మాత్రమే లాభదాయకమైన విధానాలు, రోజు రోజుకు నిరుద్యోగం పెర‌గడం, చిన్నపరిశ్రమల మూత , ప్రజల కొనుగోలు శక్తి తగ్గి వస్తు వినియోగం మీద ఆప్రభావం పడటం ఇలాంటి అనేక కారణాలు భారత ఆర్థిక వ్యవస్థను రోజు రోజుకు దిగజారుస్తున్నాయి. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడడం, విసిగిపోవడం వల్లే ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. 

నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

   6 hours ago


ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

   11 hours ago


కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

   12 hours ago


గాంధీకి బదులు లక్ష్మీదేవి.. స్వామి సలహాను మోడీ పాటిస్తారా?

గాంధీకి బదులు లక్ష్మీదేవి.. స్వామి సలహాను మోడీ పాటిస్తారా?

   16-01-2020


డాక్టర్లకు యువతుల ఎర.. మోడీ ఆగ్రహం!

డాక్టర్లకు యువతుల ఎర.. మోడీ ఆగ్రహం!

   15-01-2020


బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక మలుపు.. నలుగురి ఉరికి లైన్ క్లియర్

బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక మలుపు.. నలుగురి ఉరికి లైన్ క్లియర్

   14-01-2020


సీఏఏ‌పై సత్య నాదెళ్ళ.. చట్టం బాధాకరం అంటూ కామెంట్స్

సీఏఏ‌పై సత్య నాదెళ్ళ.. చట్టం బాధాకరం అంటూ కామెంట్స్

   14-01-2020


ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

   14-01-2020


భారత వృద్ధిరేటు 5 శాతమేనా.. నివ్వెరపరుస్తున్న నిప్పులాంటి నిజాలు

భారత వృద్ధిరేటు 5 శాతమేనా.. నివ్వెరపరుస్తున్న నిప్పులాంటి నిజాలు

   13-01-2020


ఢిల్లీలో ఉగ్రకలకలం.. ముగ్గురు అరెస్ట్

ఢిల్లీలో ఉగ్రకలకలం.. ముగ్గురు అరెస్ట్

   09-01-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle