newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

యుద్ధసన్నద్దతను పెంచుకోండి.. చైనా అధ్యక్షుడి పిలుపు.. వెనక్కు తగ్గనంటున్న భారత్

27-05-202027-05-2020 10:27:04 IST
Updated On 27-05-2020 10:44:46 ISTUpdated On 27-05-20202020-05-27T04:57:04.064Z27-05-2020 2020-05-27T04:57:01.832Z - 2020-05-27T05:14:46.478Z - 27-05-2020

యుద్ధసన్నద్దతను పెంచుకోండి.. చైనా అధ్యక్షుడి పిలుపు.. వెనక్కు తగ్గనంటున్న భారత్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పీపుల్స్ రిబరేషన్ ఆర్మీ తన యుద్ధ సన్నద్ధతను పెంచుకోవాలని, దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాలని సైన్యానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆదేశమిచ్చారు. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ), పీపుల్స్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌ ప్లీనరీ సమావేశానికి హాజరైన సందర్భంగా జిన్‌పింగ్‌ ఈ పిలుపునిచ్చారు. ‘‘అత్యంత ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శిక్షణ, సన్నద్ధతను పెంచుకోవాలి. సంక్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడం ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను, అభివృద్ధి ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి’’ అని కోరినట్టు అధికారిక జిన్హువా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. చైనా–భారత్‌ మధ్య సరిహద్దుల్లో సున్నిత పరిస్థితుల నేపథ్యంలో జిన్‌పింగ్‌ ఈ పిలుపునివ్వడం గమనార్హం.

మరోవైపున భారత్, చైనా సరిహద్దుల్లో 3,500 కిలో మీటర్ల ప్రాంతంలో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టుల్ని నిలిపివేసే ప్రసక్తే లేదని భారత్‌ తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టుల్ని ఆపేయాలంటూ చైనా చేసిన హెచ్చరికల్ని పట్టించుకోబోమని స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాల సైనికులు కొద్ది రోజులుగా ఆరు దఫాలుగా జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో వరస సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. లదాఖ్, సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ సరిహద్దుల్లో నిర్మిస్తున్న కీలకమైన ప్రాజెక్టులేవీ ఆపాల్సిన పని లేదని రాజ్‌నాథ్‌  సింగ్‌ ఆర్మీ ఉన్నతాధికారులతో స్పష్టం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రతరం కావడం, టిబెట్‌లో వైమానిక స్థావర విస్తరణ పనుల శాటిలైట్‌ చిత్రాలు బయటకి వచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిపారు. దీంతోపాటు లదాఖ్‌లో నెలకొన్న పరిస్థితులపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌  రావత్, త్రివిధ దళాధిపతులతోపాటు విదేశాంగ  కార్యదర్శి హర్ష వర్ధన్‌ ష్రింగ్లాతోనూ చర్చించారు.

డ్రాగన్‌ బుసలు కొడుతోంది భారత్‌ సరిహద్దుల్లో నిఘా పెంచుతోంది సైనిక బలగాల్ని పెంచి హెచ్చరికలు పంపిస్తోంది 2017 నాటి డోక్లామ్‌ తరహా వివాదాన్ని రాజేస్తోంది కరోనాతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్న సమయంలో చైనా ఎందుకీ రంకెలు వేస్తోంది? నేపథ్యాన్ని పరిశీలిస్తే తూర్పు లదాఖ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రతరమవుతున్నాయి. రెండు వారాల క్రితం ఈ ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ కొందరిని గాయాలపాలు చేసింది. లదాఖ్‌లోని గాల్వన్‌ లోయలో చైనా ఇటీవల 100 తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసింది. సిక్కిం, టిబెట్‌లను కలిపే నుకులా పాస్‌ మార్గంలోనూ ఉద్రిక్తతల్ని పెంచి పోషిస్తోంది. 

పైగా కరోనా వైరస్‌ని అడ్డం పెట్టుకొని భారత్‌లోని చైనీయుల్ని వెనక్కి రప్పిస్తోంది. భారత్‌కు కేవలం 3 కి.మీ. ఆవల పాంగాంగ్‌ సరస్సు సమీపంలోని 1,200 నుంచి 1,300 సైనికుల్ని మోహరించింది. మొత్తంగా భారత సరిహద్దుల్లో 5 వేలమంది వరకు సైనికుల్ని మోహరించింది. చైనా చర్యలతో భారత్‌ కూడా అప్రమత్తమైంది. వాస్తవాధీన రేఖ మీదుగా బలగాలను పటిష్టం చేసింది. భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణే తూర్పు లదాఖ్‌ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. పరిస్థితుల్ని లోతుగా విశ్లేషించడానికి భారత ఆర్మీ టాప్‌ కమాండర్లు బుధవారం నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు.

చైనా దూకుడుకు అసలు కారణాలు..

కరోనా వైరస్‌ చైనాలోని వూహాన్‌ ల్యాబ్‌ నుంచి వచ్చిందని పదే పదే ఆరోపిస్తున్న అమెరికా ప్రపంచంలో చైనాని ఏకాకిని చేయడానికి భారత్‌ వంటి దేశాల సహకారం తీసుకుంటోంది. వైరస్‌ పుట్టుక, ప్రపంచ దేశాలను హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ వైఫల్యం వంటి అంశాలపై విచారణ జరిపించే తీర్మానానికి భారత్, మరో 62 దేశాలు మద్దతు పలికాయి. అమెరికా, ఆస్ట్రేలియా వంటి  దేశాలతో చేతులు కలపొద్దని చెప్పడానికే లదాఖ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల్ని రాజేసి భారత్‌కు ఒక హెచ్చరికలా చైనా పంపుతోంది.

కరోనా వైరస్‌ వ్యాప్తి అంశంలో చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిదంటూ ప్రపంచవ్యాప్తంగా చెలరేగుతున్న విమర్శలు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పేరుప్రతిష్టల్ని దెబ్బ తీశాయి. అందుకే ఆ విషయం నుంచి దృష్టిని మరల్చడానికి దక్షిణాసియాలో పట్టు బిగించడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే గత కొన్ని వారాల్లో భారత్‌తో తగాదాలకు దిగుతోంది.

కశ్మీర్‌ అంశంలో ఎప్పుడూ పాకిస్తాన్‌కు కొమ్ముకాసే చైనా ఇప్పుడు లదాఖ్‌ సరిహద్దుల్లో ఎన్నడూ అడుగు పెట్టని గ్వాలన్‌ లోయలోకి కూడా సైనికుల్ని పంపిస్తోంది. లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ భూభాగాలను నేపాల్‌ తన మ్యాపుల్లో చూపించడం వెనుక చైనా ప్రమేయం ఉంది. హాంకాంగ్‌ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా కొత్త భద్రతా చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇలా ఆసియాలో ఏదో విధంగా ఉద్రిక్తతల్ని రాజేసే చర్యల్ని చేపడుతోంది.  

దేశ సరిహద్లుల్లో మౌలిక సదుపాయలు పెంచుకుంటూ, సైనికులకు మెరుగైన వసతులు కల్పించడంలో చైనా ఎప్పుడూ ముందుంటుంది. భారత్‌ కూడా అదే వ్యూహంతో సరిహద్దుల్లోని చాలా ప్రాంతాల్లో సైనిక శిబరాలు ఏర్పాటు చేసి బలగాల్ని పెంచుతోంది. మౌలిక సదుపాయాల్ని కల్పిస్తూ సాంకేతికంగా కొత్త పరికరాలను సైన్యానికి అందుబాటులోకి తెచ్చి డ్రాగన్‌ దేశానికి సవాల్‌ విసురుతోంది. గాల్వన్‌ వ్యాలీలో దర్బాక్‌–షోయక్‌ నుంచి తూర్పు లదాఖ్‌లో దౌలత్‌ బేగ్‌ను కలుపుతూ రోడ్డు నిర్మించింది. ఇవన్నీ చైనాకి కంటగింపుగా మారాయి.

 

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   an hour ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   4 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   4 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   5 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   05-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle