newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

యంత్రాలకు స్వస్తి.. ఉపాధి హామీ కూలీలకు ఊరట

08-11-201908-11-2019 10:52:16 IST
Updated On 08-11-2019 12:12:53 ISTUpdated On 08-11-20192019-11-08T05:22:16.612Z08-11-2019 2019-11-08T05:21:53.946Z - 2019-11-08T06:42:53.001Z - 08-11-2019

 యంత్రాలకు స్వస్తి.. ఉపాధి హామీ కూలీలకు ఊరట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా యంత్రాలను ఉపయోగించడానికి అనుమతిస్తున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్రప్రభుత్వం స్పష్టతనిచ్చింది. గ్రామీణులకు పెద్ద ఎత్తున ఉపాధి కలిగించే ఈ పథకం అమలులో యంత్రాలను ససేమిరా ఉపయోగించబోనని కేంద్రం తేల్చి చెప్పింది. ఉపాధి హామీ పథకంలో యంత్రాలను ఉపయోగించడానికి కేంద్రం అంగీకారం తెలుపబోతోందని వస్తున్న వార్తలపై ఆంద్రప్రదేశ్, కర్నాటక ప్రభుత్వాధికారులు కలవరపాటుకు గురయ్యారు. 

మూడు రాష్ట్రాలు జాతీయ ఉపాధి పథకంలో యంత్రాలను ఉపయోగించడాన్ని అనుమతించాలని అక్టోబర్ నెలలో  కేంద్రాన్ని కోరినట్లు కొన్ని వార్తలువచ్చాయి. కానీ యంత్రాలను అనుమతిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకంపై ఆధారపడిన లక్షలాది మంది జీవితాలు కుప్పగూలిపోతాయని ఏపీ ప్రభుత్వాధికారులు స్పష్టం చేశారు.

అయితే వార్తలు తెలుపుతున్నట్లుగా తాము యంత్రాల వినియోగంపై కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు చేసి పంపలేదని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల పంచాయితీ రాజ్ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రతిపాదనా రాలేదని కేంద్రప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. 

ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మూడూ ఉపాధి హామీ పథకం అమలవుతున్న కఠినతరమైన భూభాగాల్లో యంత్రాలు వాడటానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరినట్లు జాతీయ మీడియాలో గత నెల 30న వచ్చిన వార్త దిగ్భ్రాంతి కలిగించింది. కఠినతరమైన భూభాగాలు ఉన్న చోట పరిమితంగానే యంత్రాలను ఉపయోగిస్తే ఉపాధి హామీ పథకం తన లక్ష్యాలను సులువుగా సాధించడంలో తోడ్పడుతుందని పేరు తెలపడానికి ఇష్టపడని ఒక అధికారి తెలిపారంటూ జాతీయ మీడియా ప్రచారంలో పెట్టింది.

నవంబర్ 7న కూడా ఇదేరకమైన వార్తలు వచ్చాయి పైన చెప్పిన మూడు రాష్ట్రాల్లో ఉపాధి హామీ ఫథకం అమలులో పరిమితంగా యంత్రాలు ఉపయోగించే విషయాన్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని తాజా వార్తా కథనాలు తెలుపడంతో కేంద్రం ఈ విషయంపై వివరణ ఇచ్చింది. అలాంటి సిఫార్సులు ఏవీ తనవద్దకు రాలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వివరణ ఇచ్చింది.

అయితే ఆంద్రప్రదేశ్ పంచాయితీ రాజ్ విభాగం అదనపు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఈ విషయంపై మాట్లాడుతూ కేంద్రానికి అలాంటి ప్రతిపాదన తమ వైపునుంచి పంపలేదని, ఈ వార్తా కథన తప్పు అని చెప్పారు. ఈ ప్రతిష్టాత్మకపథకంలో యంత్రాలను వాడాలనుకుంటే కూడా జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని చెప్పారు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అమర్జీత్ సిన్హా కూడా కేంద్రానికి ఏ రాష్ట్రం కూడా ఉపాధి హామీ పథకంలో యంత్రాలను వాడటానికి అనుమతించాలని తమకు అభ్యర్థన పంపలేదని స్పష్టం చేశారు. అలా యంత్రాలను అనుమతిస్తే లక్షలాది నిరుపేదల జీవనానికి భంగం వాటిల్లుతుందని  చెప్పారు. 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   13 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   14 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle