newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

మోదీ ఒక‌లా.. మ‌న ముఖ్య‌మంత్రులు మ‌రోలా..!

22-04-202022-04-2020 07:16:19 IST
2020-04-22T01:46:19.624Z22-04-2020 2020-04-22T01:46:16.436Z - - 11-08-2020

మోదీ ఒక‌లా.. మ‌న ముఖ్య‌మంత్రులు మ‌రోలా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విప‌త్తులు మ‌న దేశానికి కొత్త కాదు. కానీ, క‌రోనా వంటి ప్ర‌మాద‌క‌ర మ‌హ‌మ్మారి క‌లిగిస్తున్న విప‌త్తు మాత్రం క‌నీవినీ ఎరుగ‌నిది. దేశాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న క‌రోనా వైర‌స్‌ను అదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వాలు అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్నాయి. అయితే రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఇటువంటి క‌నిపించ‌ని శ‌త్రువుగా ఎదుర్కుంటున్న స‌మ‌యంలో రాజ‌కీయాలు ప‌క్క‌న పెట్టి అంతా ఐక్యంగా నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ అవ‌స‌రాన్ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గుర్తించారు కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మాత్రం పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి మొద‌లు కాగానే కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటూ వ‌స్తోంది. ఈ విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. ప్ర‌తిప‌క్షాల సూచ‌న‌లు, స‌ల‌హాలు వింటున్నారు. ముఖ్య‌మంత్రులు, వివిధ పార్టీల అధినేత‌ల‌తో త‌ర‌చూ మాట్లాడుతున్నారు. వివిధ రంగాల్లోని ప్ర‌ముఖుల‌తోనూ మాట్లాడి వారి సల‌హాల‌నూ స్వీక‌రిస్తున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌కు మ‌రింత ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్‌తో ఐదారుసార్లు ఫోన్ మాట్లాడారు.

క‌రోనాపై పోరులో కాంగ్రెస్ స‌ల‌హాల‌ను మోదీ తీసుకుంటున్నారు. ఇక లాక్‌డౌన్ కార‌ణంగా దేశం ఆర్థికంగా ప‌డే ఇబ్బందులు, తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై మ‌న్మోహ‌న్ సింగ్ లాంటి అనుభ‌వ‌జ్ఞులు, ఆర్థిక వేత్త స‌ల‌హాలు అవ‌స‌ర‌మ‌ని మోడీ భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా క‌రోనా విష‌యంలో ఎటువంటి రాజ‌కీయం చేయ‌డం లేదు. క‌రోనా విష‌యంలో ప్ర‌భుత్వంపై ఇష్టారీతిన విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు. కాంగ్రెస్ కూడా ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు సూచ‌న‌లు ఇవ్వ‌డానికి ఓ ప్ర‌త్యేక క‌మిటీ వేసింది.

ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని ఎదుర్కోవ‌డానికి మోదీ ప్ర‌తిప‌క్షాల‌ను కూడా క‌లుపుకొని వెళుతుంటే తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మాత్రం ఆ ప‌ని చేయ‌డం లేదు. క‌రోనా మ‌హమ్మారి బారిన ప‌డి, విజ‌య‌వంతంగా వైర‌స్‌ను కంట్రోల్ చేసిన కేర‌ళ ముఖ్య‌మంత్రి విజ‌యన్ కూడా అన్ని పార్టీల‌ను క‌లుపుకొని వెళ్లారు.

ప్ర‌తిప‌క్ష నేత‌తో క‌లిసి ప్రెస్ మీట్ కూడా పెట్టి ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఒక సానుకూల సందేశాన్ని పంపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకూ విజృంభిస్తుంటే ముఖ్య‌మంత్రులు మాత్రం ఒక్క‌సారి కూడా ప్ర‌తిప‌క్ష పార్టీల స‌ల‌హాలు తీసుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.

ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు క‌రోనా క‌ట్ట‌డికి ప‌టిష్ఠ చ‌ర్య‌లే తీసుకుంటుండ‌వ‌చ్చు. కానీ ఇత‌ర పార్టీల‌తోనూ మాట్లాడితే వారి నుంచి కూడా ఏమైనా విలువైన‌, ప్ర‌జ‌ల ఇబ్బందులు తీర్చే స‌ల‌హాలు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌వ‌చ్చు. ప్ర‌త్యేకించి అన్ని పార్టీలూ క‌లిస్తే ప్ర‌జ‌ల‌కు కూడా ఒక మంచి భావ‌న ఏర్ప‌డుతుంది. గ‌తంలో ముఖ్య‌మంత్రులు కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే ముందు, విప‌త్తులు త‌లెత్తిన‌ప్పుడు అఖిల‌ప‌క్ష స‌మావేశాలు నిర్వ‌హించేవారు. ఇప్పుడు ఆ సంప్ర‌దాయం తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు వ‌దిలేశారు.

తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంది. ప్ర‌తిప‌క్ష పార్టీలు సందు దొరికితే చాలు రాజ‌కీయ విమ‌ర్శ‌లు మొద‌లుపెడుతున్నాయి. అస‌లు క‌రోనా కేసుల లెక్క‌లే త‌ప్పు అని అంటున్నాయి.

టెస్టింగ్ కిట్ల కొనుగోలులో అవినీతి జ‌రిగింద‌ని, వైర‌స్ వ్యాప్తికి వైసీపీ ఎమ్మెల్యేలే కార‌ణ‌మ‌ని రోజుకొక ఆరోప‌ణ చేస్తున్నాయి. ఇటువంటి స‌మ‌యంలో అఖిల‌ప‌క్షం నిర్వ‌హించి క‌రోనాపై ప్ర‌భుత్వం ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో వివ‌రించ‌డం ప్ర‌భుత్వానికే మంచిది. ఇటువంటి ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు, అవి త‌ప్ప‌ని నిరూపించుకోక‌పోతే ప్ర‌భుత్వానికి న‌ష్టం జ‌రుగుతుంది.

మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు అఖిల‌ప‌క్షం నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా, 11 ఏళ్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా ప‌ని చేసిన అనుభ‌వం ఆయ‌న స్వంతం. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఏడాది మాత్ర‌మే పాల‌నా అనుభ‌వం ఉంది. ఈ స‌మ‌యంలో అనుభ‌వం ఉన్న వారి స‌ల‌హాలు ఎంతో కొంత ప్ర‌భుత్వానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. రెండేళ్లుగా ఉన్న రాజ‌కీయ విభేదాల‌ను ప‌క్క‌న‌పెట్టి మ‌రీ ప్ర‌ధాని మోదీ స్వ‌యంగా చంద్ర‌బాబుకు ఫోన్ చేశారు.

మ‌రి, కొన్ని రోజులు రాజ‌కీయం ప‌క్క‌న‌పెట్టి అఖిల‌ప‌క్షం నిర్వ‌హిస్తే ప్ర‌భుత్వానికి పోయేదేముంది. తెలంగాణ‌లోనూ ఏపీతో పోల్చితే ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తున్నాయి. కాబ‌ట్టి, ఒక్క స‌మావేశం ఏర్పాటు చేసి వారి సూచ‌న‌లూ తీసుకుంటే ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి దోహ‌ద‌ప‌డే అవ‌కాశం ఉంది.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   4 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   15 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle