newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

మోదీకి రాహుల్ హితవు.. ద్వేషాన్ని వీడండి

03-03-202003-03-2020 12:10:48 IST
2020-03-03T06:40:48.192Z03-03-2020 2020-03-03T06:40:45.153Z - - 03-08-2020

మోదీకి రాహుల్ హితవు.. ద్వేషాన్ని వీడండి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రధాని నరేంద్రమోదీకి సైతం స్మశాన (సోషల్)  వైరాగ్యం లాంటిది పట్టుకుందా? సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారంల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ సోమవారం రాత్రి ప్రకటించి సోషల్ మీడియా వేదికలనే కాదు.. కోట్లాది తన ఫాలోయర్లను కూడా షాక్‌కి గురి చేశారు. అయినా సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉండే ప్రధాని అనూహ్య నిర్ణయం ఆయన అనుకూల ప్రతికూల వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఎందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నదీ ప్రధాని వివరించకపోవడంతో నో చెప్పేవారు లక్షల్లో ఉండగా విద్వేషాన్ని వదలండి మోదీజీ.. సోషల్ మీడియాను కాదు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ నేతలు హితవు పలకటం విశేషం. 

అన్ని సామాజిక మాధ్యమ వేదికల నుంచి నిష్క్రమించాలనుకుంటున్నట్లు ట్వీట్‌చేసిన ప్రధాని నరేంద్రమోదీ ఉన్నట్లుండి సంచలనం రేపారు. ఈ ఆదివారం నుంచి ట్విట్టర్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌.. ఇలా అన్నింటి నుంచీ వైదొలగాలని ఆలోచిస్తున్నా. ఏ విషయమూ మీకు తెలియపరుస్తానని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మోదీ తాజా నిర్ణయం సంచలనాత్మకంగా మారింది. గంటలో 26వేల సార్లు రీట్వీట్‌ అయింది. క్షణక్షణానికో కామెంట్‌ వచ్చింది. ఢిల్లీలోని సంబంధింత వర్గాల సమాచారం ప్రకారం సోషల్ మీడియా నుంచి వైదొలుగుతున్న నరేంద్రమోదీ భవిష్యత్‌ ప్రణాళిక త్వరలో వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది.

సోమవారం రాత్రి నరేంద్రమోదీ ట్విట్టర్‌తో సహా అన్ని సోషల్ మీడియా వేదికలను వదిలేయబోతున్నట్లు చెప్పగానే వేలాదిమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పలు ఎమోజీలతో స్పందించసాగారు. నోసర్ అంటూ వేలాది అభ్యర్థనలు సోషల్ మీడియా కేంద్రంగా వెల్లువెత్తడంతో చివరకు నోసర్ అనేది ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్‌గా మారింది. ఒక నెటిజన్ అయితే.. ప్రపంచవ్యాప్తంగా మీ అభిమానులున్నారు. కావాలంటే చిన్న బ్రేక్‌ తీసుకోండి. కానీ పూర్తిగా వదిలేయవద్దని ప్రాధేయపడ్డారు. మరొక యూజర్ అయితే, నేను మోదీజీ అభిమానిని. ఆయన వదిలేస్తే.. సోషల్‌ మీడియాను నేనూ వదలేస్తానంటూ హెచ్చరించారు. మరోవైపు, మోదీ ట్వీట్‌పై మీమ్స్‌ కూడా ప్రారంభమయ్యాయి.

సోషల్ మీడియాను కాదు.. విద్వేషాన్ని వదిలిపెట్టండి:

ప్రధాని మోదీ అనూహ్య ప్రకటన పట్ల నెటిజన్లు, సగటు యూజర్ల స్పందన ఒకరకంగా ఉంటే, ప్రతిపక్షాలనుంచి వ్యంగ్యపూరిత వ్యాఖ్యానాలు బోలెడు వచ్చాయి. స్వయంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మోదీని ఉద్దేశించి ట్వీట్ చేస్తూ ద్వేషాన్ని విడనాడండి.. సోషల్‌ మీడియాను కాదు అంటూ వ్యాఖ్యానించారు. పైగా తన ట్వీట్‌ను ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారుకూడా. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జెవాలా కూడా మరో వ్యంగ్య ట్వీట్‌ చేశారు. మీరు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటం కాదు.. వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని సోషల్‌ మీడియాలో వేధింపులకు గురిచేసే, బెదిరించే, హెచ్చరించే మీ  ఆర్మీకి ఈ సలహా ఇవ్వండి– ఇట్లు భారత పౌరులు’ అని సూర్జీవాలా ట్వీటారు.

ఇక తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోరకంగా ఆలోచించారు. ప్రధాని మోదీ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురవలేదని భావిస్తున్నాను. లేక విసిగిపోయి నిజంగానే ఈ డిజిటల్‌ ప్లాట్‌ఫాంల నుంచి వైదొలుగుతానని సంకేతాలిస్తున్నారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. అయితే ఏ సోషల్ మీడియా వేదికను చూసుకున్నా కనీసం 3 కోట్లకు పైనే ఫాలోయర్లు ఉన్న ప్రధాని మోదీని ఒకరకంగా చూస్తే సోషల్ మీడియా హీరో అనే చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సైతం దక్కని ప్రజాదరణను మోదీ సోషల్ మీడియాలో సాధించారు. 

ట్విటర్‌లో మోదీకి 5.33 కోట్లమంది ఫాలోవర్లున్నారు. 5 కోట్లకు పైగా ట్విటర్‌ ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడు మోదీనే. ఫేస్‌బుక్‌లో 4.4 కోట్ల మంది, ఇన్‌స్ట్రాగామ్‌లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతుంటారు. ప్రధాని కార్యాలయ ట్వీటర్‌ అకౌంట్‌ను 3.2 కోట్ల మంది అనుసరిస్తున్నారు. సెప్టెంబర్‌ 2019లో ప్రపంచవ్యాప్తంగా ట్విటర్‌లో అత్యధికులు ఫాలో అవుతున్న మూడో నేత నరేంద్ర మోదీనే. తొలి రెండు స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, యూఎస్‌ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం సోషల్ మీడియాలో మోదీ పాపులారిటీనీ చాలాసార్లు ప్రస్తావించారు. 

సోషల్‌ మీడియాలో దేశంలో నెంబర్‌ వన్‌ అయిన మోదీ ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 5లో ఒకరు. మోదీ ఒక్క  పోస్ట్‌ పెడితే చాలు..  వేల సంఖ్యలో ప్రతిస్పందనలుంటాయి. అంత విస్తృతమైన నెట్‌వర్క్‌ ఉన్నవ్యక్తి ఎందుకు ఆకస్మికంగా వైదొలగాలనుకుంటున్నారన్నది అందర్నీ తొలిచేస్తున్న ప్రశ్న.  విచిత్రం ఏమిటంటే.. 2014లో అధికారంలోకొచ్చిన నాటినుంచీ మోదీ ఒక్క మీడియా సమావేశంలోనూ మాట్లాడలేదు. ప్రజలతో నేరుగా ఈ మాధ్యమాల ద్వారానే సంభాషించడం తనకు ఇష్టమని ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పారు. 

అనేకమార్లు మోదీ కొన్ని పోస్టులపై స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుని వేలల్లో లైకులొచ్చేవి. కానీ జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఆమోదించుకున్న తర్వాత ఆన్‌లైన్లో ప్రధాని పట్ల ద్వేషపూరిత వ్యాఖ్యలు, ట్రోల్స్‌ ఎక్కువయ్యాయి. ఇవన్నీ ఆయనను ప్రభావితం చేశాయా.. అన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరోవైపున సోషల్‌ మీడియాను వీడొద్దంటూ ఆయన అభిమానులు, బీజేపీ శ్రేణులు అభ్యర్థిస్తున్నారు.

కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ అయితే మరో కోణంలోకి వెళ్లిపోయారు. ఉన్నట్లుండి ప్రధాని సోషల్ మీడీయాకు దూరం అవుతున్నా అని ప్రకటించడం చూస్తుంటే దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేసే వైపుగా ఇది తొలి దిశ కానుందేమో అని థరూర్ వ్యాఖ్యానించారు.

బీజేపీ ప్రభుత్వం డిజిటల్ మీడియా గురించి ఇన్నాళ్లూ ఊదరగొట్టిన నేపథ్యంలో మోదీకి సోషల్ మీడియా అంటే అప్పుడే అంత వెగటు పుట్టుకొచ్చిందా అని గుజరాత్ రాజకీయనేత జిగ్నేష్ మెవానీ వ్యాఖ్యానించారు. ప్రధాని సోషల్ మీడియానుంచు తప్పుకొవడానికి బదులుగా దేశంలోని మహిళలను అగౌరవిస్తున్న విద్వేష భావజాల ప్రేరేపితుల అకౌంట్లను మొత్తంగా నిలిపివేయాలని జిగ్నేష్ సూచించారు.

ప్రధాని మోదీ తనకు ఖాతాలున్న అన్ని సోషల్ మీడియా విభాగాల్లోను తన అనూహ్య ప్రకటనను పోస్ట్ చేయడం మరింత సంచలనాలకు దారితీస్తోంది.

చదవండి : సోషల్ మీడియాపై మోడీ కీలక నిర్ఱయం.. రాహుల్ సెటైర్లు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   6 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   9 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   a day ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle