newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

మోడీ సర్కార్ కి రిలీఫ్... సీఏఏపై సుప్రీం డెసిషన్

23-01-202023-01-2020 09:34:53 IST
Updated On 23-01-2020 09:37:58 ISTUpdated On 23-01-20202020-01-23T04:04:53.623Z23-01-2020 2020-01-23T04:04:21.708Z - 2020-01-23T04:07:58.454Z - 23-01-2020

మోడీ సర్కార్ కి రిలీఫ్... సీఏఏపై సుప్రీం డెసిషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు సీఏఏ చట్టంపై ఆందోళనలు జరుగుతున్న వేళ.. సుప్రీంకోర్టులో ఈచట్టంపై వందలాది పిటిషన్లు వేశారు. ఏం జరుగుతుందో అనే వేళ మోడీ సర్కార్ కి రిలీఫ్ అందించింది సుప్రీంకోర్టు. దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ బద్దతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ మొదలుపెట్టింది. ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నాలుగు వారాల్లోగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 

అంతేకాదు కేంద్రం వాదనను వినకుండా సీఏఏపై స్టే ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో కేంద్రం ఊపిరి పీల్చుకుంది.  సీఏఏను వ్యతిరేకిస్తూ దాఖలైన 140 పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని బెంచ్‌ విచారణకు స్వీకరించింది. మరోవైపు ఈ చట్టాన్ని అమలు చేసి తీరతామని హోంమంత్రి అమిత్ షా చెబుతూనే వున్నారు.

ఇదిలా వుంటే సీఏఏ, ఎన్ఆర్‌సీ కి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ లో ఆందోళనలు జరుగుతూనే వున్నాయి. సీఎం మమతా బెనర్జీ డార్జిలింగ్ లో ర్యాలీ నిర్వహించారు. 'నో ఎన్‌ఆర్‌సీ' అనే ప్లకార్డులు,కొందరు జాతీయ జెండాలు పట్టుకుని ఈ ర్యాలీలో పాల్గొనడం విశేషం. 

Image result for caa

2020 డిసెంబ‌ర్‌లో ఎన్‌ఆర్‌సీని పార్లమెంటు ఆమోదించగా సీఎం మమతా బెనర్జీ ఆ చట్టానికి వ్యతిరేకంగా త‌న గొంతు వినిపిస్తూనే వున్నారు. పశ్చిమబెంగాల్ కి తోడు కేరళ కూడా శృతి కలిపింది. దీంతో కేరళ, ప‌శ్చిమ‌బెంగాల్ లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతూనే వున్నాయి. తాజాగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీకి సంబంధించి రాష్ట్ర‌ ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, బెంగాల్ ప్రజలపై వీటి ప్రభావం పడనీయనని మమత భరోసా ఇవ్వడంపై కేంద్రం గుర్రుగా వుంది. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle