newssting
BITING NEWS :
*మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో భారీ చోరీ*పాకిస్తాన్‌లో హైదరాబాద్‌ వాసి అరెస్ట్‌...అరెస్ట్‌ అయిన వ్యక్తి ప్రశాంత్‌ గా గుర్తింపు* రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు*ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం.. జడ్జిమెంట్‌ కాపీ చూశాక తుది నిర్ణయం.. సమ్మె యథాతథంగా కొనసాగుతుంది.. సడక్‌బంద్, రాస్తారోకోలు మాత్రం వాయిదా-అశ్వత్థామరెడ్డి*దీక్ష విరమించినా ఆర్టీసీ జేఏసీ ఆందోళన కొనసాగుతుంది-కోదండరాం*ఆర్టీసీ సమ్మెపై విచారణ ముగించిన హైకోర్టు *హైకోర్టుకు కొన్ని పరిమితులుంటాయి.. పరిధిదాటి ముందుకు వెళ్లలేం.. కార్మికశాఖ చూసుకుంటుంది.. 2 వారాల్లో సమస్య పరిష్కరించాలని సూచిస్తాం-హైకోర్టు

మోడీ షాకింగ్ డెసిషన్.. త్వరలో 2వేల నోటు రద్దు?

08-11-201908-11-2019 16:42:10 IST
Updated On 08-11-2019 16:42:07 ISTUpdated On 08-11-20192019-11-08T11:12:10.872Z08-11-2019 2019-11-08T11:05:07.035Z - 2019-11-08T11:12:07.567Z - 08-11-2019

మోడీ షాకింగ్ డెసిషన్.. త్వరలో 2వేల నోటు రద్దు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక ఎన్నో కీలక, షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యమయినది పెద్ద నోట్లరద్దు.నవంబర్‌ 8, 2016 న ఈనిర్ణయం వెలువడింది. ఈకారణంగా తమ దగ్గర వున్న పాతనోట్లను మార్చుకోవడానికి కొంతమంది ప్రాణాలు ఫణంగా పెట్టారు.  దేశంలో 86 శాతం కరెన్సీ ఐదువందలు, వెయ్యి రూపా యల నోట్ల రూపంలోనే ఉందని మోడీ వాటిని రద్దు చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు.

బ్యాంకుల దగ్గర క్యూలైన్లలో నిలబడి మరీ తమ దగ్గరున్న పాతనోట్లను మార్పిడి చేసుకున్నారు. అలాంటి పరిస్థితులు మళ్ళీ వస్తున్నాయా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా మూడేళ్ళ క్రితం పెద్ద నోట్లు రద్దు జరిగింది. ఈ నోట్ల రద్దుతో దేశంలో ఆర్ధిక వ్యవస్థ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. నల్లధనాన్ని బ్యాం కులకు రప్పించాలన్న సర్కారు లక్ష్యం నెర వేరలేదు. కానీ, తప్పుడు మార్గాల్లో అక్రమార్కులు కోట్లలో పాత పెద్దనోట్లను ఈజీగా మార్చేసుకున్నారు. బ్యాంకులకు వెళ్లలేదు.

క్యూలైన్లలో నిలబడకుండా కేవలం కొద్దిపాటి సమయంలోనే తమ దగ్గరున్న కోట్లాది రూపాయల బ్లాక్‌ మనీని వైట్‌గా మార్చేశారు. నల్లధనం పేరుకుపోవడంతో ప్రైవేట్‌ కంపెనీల యాజ మాన్యాలు సైతం అడ్వాన్స్‌ జీతాలు కూడా ఇచ్చేసిన సందర్భాలున్నాయి. నోట్ల రద్దు ద్వారా దాదాపు రూ. 3-4 లక్షల కోట్ల నల్లధనం బ్యాంకులకు చేరడం ఖాయం అని భావించారు. కానీ అలా జరగలేదు. 

పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే ప్రభుత్వం వంద, ఐదు వందలు, రెండువేల రూపాయల నోట్లను విడుదల చేసింది.  2000 నోటు బాగా విపణిలోకి వచ్చింది.  ప్రస్తుతం ఈ నోటు ముద్రణను రిజర్వ్ బ్యాంకు నిలిపివేసింది. ఈ నేపథ్యంలోనే చాలామందికి డౌట్ వచ్చింది. పాత నోట్ల రద్దు లాగే 2వేల నోటుకి కూడా అదే గతి పడుతుందని భావించారు.

అందుకే బడబాబులు, నల్లధనం బాగా వెనకేసే వారు 2వేల నోట్లను భారీగా సేకరించి దాచేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వుబ్యాంకు 2000 రూపాయల నోట్లను ఎక్కువ మొత్తంలో విపణిలోకి వదిలినా వాటిలో సగం నోట్లు కనిపించడంలేదని తెలుస్తోంది. ఇవన్నీ మళ్లీ నల్లధనంగా మారాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

తాజా పరిస్థితుల్లో 2వేల రూపాయల నోటును రద్దు చేస్తే అన్ని నోట్లు బయటకు రాగలవని ఆర్థికశాఖ అధికారులు అంటున్నారు. రెండువేల రూపాయల నోటును రద్దు చేసి వాటిని బ్యాంకులకు ఇవ్వాలని, వాటి స్థానంలో కొత్త నగదు కాకుండా డిజిటల్ రూపంలో నగదు బదిలీ చేయాలనీ ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సలహా ఇస్తున్నారు. 

 

సియాచిన్‌లో మంచు తుపాను బీభత్సం..ఆరుగురు సైనికులు మృతి

సియాచిన్‌లో మంచు తుపాను బీభత్సం..ఆరుగురు సైనికులు మృతి

   8 hours ago


 పరిశ్రమల్లో భయం.. పౌరుల్లో అవిశ్వాసమే కారణం: మన్మోహన్ సింగ్

పరిశ్రమల్లో భయం.. పౌరుల్లో అవిశ్వాసమే కారణం: మన్మోహన్ సింగ్

   8 hours ago


సుప్రీంకోర్టు 47వ చీఫ్ జస్టిస్‌గా అరవింద్ బాబ్డే ప్రమాణం

సుప్రీంకోర్టు 47వ చీఫ్ జస్టిస్‌గా అరవింద్ బాబ్డే ప్రమాణం

   18-11-2019


ఢిల్లీ  జేఎన్‌యూ దగ్గర ఉద్రిక్తత.. 144 సెక్షన్ అమలు

ఢిల్లీ జేఎన్‌యూ దగ్గర ఉద్రిక్తత.. 144 సెక్షన్ అమలు

   18-11-2019


ఎయిర్ ఇండియాను అమ్మేస్తాం.. టెలికాంని ఉద్ధరిస్తాం : నిర్మలా సీతారామన్

ఎయిర్ ఇండియాను అమ్మేస్తాం.. టెలికాంని ఉద్ధరిస్తాం : నిర్మలా సీతారామన్

   18-11-2019


శ్రీలంక అధ్యక్షుడిగా.. ఎల్టీటీఈని నిర్మూలించిన గోటబయ రాజపక్స

శ్రీలంక అధ్యక్షుడిగా.. ఎల్టీటీఈని నిర్మూలించిన గోటబయ రాజపక్స

   18-11-2019


వాడివేడిగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

వాడివేడిగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

   18-11-2019


అయోధ్య తీర్పుపై రివ్యూ... ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం

అయోధ్య తీర్పుపై రివ్యూ... ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం

   18-11-2019


 21 రాష్ట్రాల రాజధానుల్లో కుళాయి నీళ్లు కల్తీ: కేంద్రం షాకింగ్ రిపోర్ట్

21 రాష్ట్రాల రాజధానుల్లో కుళాయి నీళ్లు కల్తీ: కేంద్రం షాకింగ్ రిపోర్ట్

   17-11-2019


దంతాలు పాడైతే గగన్‌యాన్‌కు అనర్హులే..

దంతాలు పాడైతే గగన్‌యాన్‌కు అనర్హులే..

   16-11-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle