newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

మోడీ మన్ కీబాత్ : కరోనాపై ప్రజా పోరాటం... ప్రతిపౌరుడూ సైనికుడే!

26-04-202026-04-2020 13:34:25 IST
Updated On 26-04-2020 13:47:32 ISTUpdated On 26-04-20202020-04-26T08:04:25.420Z26-04-2020 2020-04-26T08:04:09.380Z - 2020-04-26T08:17:32.037Z - 26-04-2020

మోడీ మన్ కీబాత్ : కరోనాపై ప్రజా పోరాటం... ప్రతిపౌరుడూ సైనికుడే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా కలిసి చేస్తున్న పోరాటాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. క‌రోనా వైర‌స్‌పై భార‌త్‌లో ప్రజా పోరాటం దిగ్విజయంగా జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌ రేడియో కార్యక్రమంలో జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాపై పోరాటం సరైన దిశలోనే సాగుతుందన్నారు. దేశ ప్రజలంతా ఒకరికొకరు అండగా నిలబడ్డారని, ఈ పోరాటానికి ప్రజలే నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. 

ఈ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ప్రతీ పౌరుడు ఒక సైనికుడిలా అలుపెరుగని యుద్ధం చేస్తున్నార‌న్నారు. క‌రోనా సంక్షోభ వేళ రైతులు నిర్విరామంగా ప‌నిచేస్తున్నార‌న్నారు. ఎవ‌రూ కూడా ఆక‌లితో అల‌మ‌టించ‌కుండా ఉండేందుకు వారు తమ శాయశక్తులా శ్రమిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజానీకంలో క్రమశిక్షణ పెరిగిందన్నారు. ముఖానికి మాస్క్‌లు ధ‌రించ‌డం అలవాటయిందన్నారు. అయితే, అవి ధ‌రించని వారిని రోగులుగా చూడ‌కూడ‌ద‌ని, నాగ‌రిక స‌మాజానికి మాస్క్‌లు చిహ్నంగా మారాయ‌న్నారు. మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవాల‌న్నా లేక ఇత‌రుల్ని వ్యాధి నుంచి కాపాడాల‌న్నా.. మాస్క్‌లు ధ‌రించ‌డం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.

లాక్‌డౌన్ సమయంలోనూ రైల్వే ఉద్యోగులు ఎంతో పని చేస్తున్నారని వారికి తన కృతజ్ఞతలు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే క‌లిగే అన‌ర్ధాల ప‌ట్ల ప్రజల్లో అవ‌గాహ‌న పెరిగింద‌ని మోదీ అన్నారు. ఇలాంటి అల‌వాటును ఆపాలన్నారు. కరోనా నివారణను అరిక‌ట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న చొరవ అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. ప్రతి పౌరుడూ కరోనా నియంత్రణకు స్వీయనిర్బంధం పాటించాలన్నారు. దేశంలో కరోనా వైరస్ ప్రారంభం అయినప్పటినుంచీ మోడీ జనానికి సందేశం ఇస్తూనే వున్నారు. ఆదివారం మన్ కీబాత్ లో మోడీ అనేక అంశాలను ప్రస్తావించారు. 

కోవిడ్ వారియర్స్ కు సహకరిద్దాం అన్నారు మోడీ. వారిపై దాడులను తీవ్రంగా పరిగణిస్తాం. కరోనా అంతం తరువాత కొత్త ఇండియాను చూస్తాం.  కోవిడ్ వారియర్స్ పై దాడి చేస్తే సహించేది లేదు.  డాక్టర్లు, పోలీసులపై దాడులు చేస్తే కఠిన చర్యలు.  దాడి చేసిన వాళ్లపై ప్రత్యేక చట్టం కింద శిక్షిస్తాం.  శానిటేషన్ వర్కర్లు, పోలీసులకు దేశం సెల్యూట్ చేస్తుంది.  రైతులు నిరంతరం ప్రజల కోసం పరితపిస్తున్నారు. రైతులకు మనమంతా రుణపడి వుంటాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరు లాక్ డౌన్ పాటిస్తున్నారన్నారు మోడీ. 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   10 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   21 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle