newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

మోడీపై కామెంట్స్... రాహుల్‌కి సుప్రీం నోటీసులు

15-04-201915-04-2019 15:46:41 IST
Updated On 15-04-2019 17:31:15 ISTUpdated On 15-04-20192019-04-15T10:16:41.144Z15-04-2019 2019-04-15T10:02:07.610Z - 2019-04-15T12:01:15.215Z - 15-04-2019

మోడీపై కామెంట్స్... రాహుల్‌కి సుప్రీం నోటీసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాహుల్‌ గాంధీ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ మూడురోజుల క్రితం బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. చౌకీదార్ దొంగ అన్న వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది.  బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం వచ్చే సోమవారం లోగా వివరణ ఇవ్వాలని రాహుల్‌ని ఆదేశించింది.

రఫేల్‌ వివాదంపై ఇటీవల కోర్టు తీర్పునకు రాహుల్‌ తన సొంత ఆరోపణలను ఆపాదించారని ఆమె పేర్కొన్నారు. కాపలాదారే దొంగ అని మేము ఎప్పుడూ అనలేదని సుప్రీం కోర్టు తెలిపింది. ఆ వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించవద్దని రాహుల్ గాంధీకి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుకు ఆపాదిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఏప్రిల్ 22 కల్లా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

రాహుల్ తన వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈ మేరకు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి.. లేఖీ తరఫున కోర్టులో వాదనలు వినిపించారు. ‘‘సుప్రీం కోర్టు కూడా చౌకీదార్‌ ఛోర్‌ హై అని తేల్చింది’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించినట్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఎన్నికల వేళ రాహుల్ గాంధీకి సుప్రీం నోటీసులు కాంగ్రెస్ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

రఫెల్‌పై దూకుడుగా వున్న కాంగ్రెస్ నేతలకు ఇది మింగుడుపడడం లేదు. ఎన్నికల సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి..చౌకీదార్‌ చోర్ అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని రాహుల్‌ వ్యాఖ్యానించారు. అనిల్ అంబానికి రూ.40 వేల కోట్లు రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో లబ్ధి జరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లుగా ఎన్నికల సభలో రాహుల్‌ పేర్కొన్నారు. సత్యాన్ని ఎవరూ మార్చలేరని, ప్రతి ఒక్కరూ కాపలాదారే దొంగ అంటున్నారని మోదీని ఉద్దేశించి రాహుల్‌ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle