newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

మోడీకి ఎందుకంత భయం.. కాంగ్రెస్ మాటల దాడి

26-06-202026-06-2020 19:29:49 IST
2020-06-26T13:59:49.211Z26-06-2020 2020-06-26T13:59:23.187Z - - 12-08-2020

మోడీకి ఎందుకంత భయం.. కాంగ్రెస్ మాటల దాడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చైనా విషయంలో ప్రధాని మోడీ భయపడుతున్నారని కాంగ్రెస్ ఘాటుగా విమర్శించింది. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలు బీజేపీపై ముప్పేట దాడికి దిగారు. చైనా, భారత్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ వాతావరణంపై కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని మోదీ సర్కార్‌ను ప్రతిరోజూ విమర్శిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక ముగ్గురూ కేంద్రంపై ఒకేసారి విరుచుకుపడ్డారు. అసలు చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకుందో లేదో? చెప్పాలని డిమాండ్ చేశారు. గాల్వన్ లో భారత సైనికులు వీర మరణం పొందిన క్రమంలో వారికి సంఘీభావంగా కాంగ్రెస్ ‘స్పీక్ అప్ ఫర్ అవర్ జవాన్స్’ అంటూ కాంగ్రెస్ ఓ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. 

చైనాతో ఉన్న సరిహద్దులను కాపాడే విషయంలో కేంద్రం తప్పించుకోజాలదని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. లడఖ్‌లో నెలకొన్న పరిస్థితిపై దేశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. చైనా గనక భారత భూభాగాన్ని ఆక్రమించలేదన్న మాటే నిజమైతే.. 21 మంది భారత సైనికులు ఎందుకు అమరులయ్యారో చెప్పాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు. చైనా విషయంలో కేంద్రం వైఖరిని ఆమె తప్పుబట్టారు. 

చైనా దురాక్రమణ, నిరాయుధులైన సైనికులపై దాడి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు బీజేపీని టార్గెట్ చేశారు. ఉపగ్రహ చిత్రాలను చూసిన నిపుణులు మాత్రం చైనా దళాలు చొరబడినట్లు పేర్కొన్నారని, మోడీ చెబుతున్నది అసత్యంగా భావించాల్సి వస్తోందన్నారు సోనియాగాంధీ. లడఖ్ లో చైనా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని ఎప్పుడు, ఎలా తిరిగి తీసుకొస్తారో చెప్పాలని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇటు రాహుల్ గాంధీ సైతం మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. దేశం మొత్తం మోదీకి అండగా ఉంది. అందరూ కలిసి చైనాను విసిరి కొడదాం. ప్రధాన మంత్రి గారూ.. మాట్లాడండి. భయపడొద్దు. దేశానికి నిజం చెప్పండి. అవును... చైనా భూమిని ఆక్రమించింది. మేము వారికి వ్యతిరేకంగా చర్య తీసుకోబోతున్నామని చెప్పడానికి భయం వద్దు. దేశం మొత్తం మీతోనే ఉంది అన్నారు రాహుల్. 

ఇటు రాహుల్ గాంధీ సోదరి, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వధేరా కూడా ‘‘చైనా సైనికులను ఎదుర్కోడానికి నిరాయుధులైన సైనికులను మీరు ఎందుకు పంపించారో భారత ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. భారత జవాన్లు అమరులైన భూమి మన భూమి. ఆ భూమిని చైనాకు ఇవ్వడానికి ఎంత మాత్రమూ వీల్లేదు. ఈ ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాల్సిందే’’ అని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   9 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle