newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

మైకేల్ జాక్సన్ మాస్క్ వెనుక రహస్యం వెల్లడి

27-03-202027-03-2020 15:49:12 IST
2020-03-27T10:19:12.833Z27-03-2020 2020-03-27T10:19:09.224Z - - 03-08-2020

మైకేల్ జాక్సన్ మాస్క్ వెనుక రహస్యం వెల్లడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకటిన్నర దశాబ్దం తర్వాత పాప్ కింగ్‌గా జగత్ప్రసిద్ధి పొందిన మైకేల్ జాక్సన్‌కి సంబందించిన అతి రహస్యం ఒకటి కరోనా వైరస్ పుణ్యమా అని బయటపడింది. సాంస్కృతిక ప్రదర్శనలకోసం ప్రపంచ పర్యటనలకు వెళ్లినప్పుడు,  నిత్యం మాస్క్ ధరిస్తూ వచ్చిన జాక్సన్ రహస్యాన్ని దశాబ్ది కాలంపాటు ఆయన బాడీగార్డుగా పనిచేసిన మ్యాట్ ఫిడ్డెస్ ఇన్నేళ్ల తర్వాత బట్టబయలు చేశారు. కరోనా వైరస్‌లాంటి మహమ్మారి ప్రపంచాన్ని నాశనం చేయబోతోందని కింగ్‌ ఆఫ్‌ పాప్‌ మైకేల్‌ జాక్సన్‌ ముందే ఊహించినట్లు తన బాడీగార్డ్ వెల్లడించారు.  

పాప్ సంగీతంతో పాతికేళ్ల పైగా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన కింగ్ ఆఫ్ పాప్ తాను బ్రతికున్నంత కాలం వైరస్‌ల బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్త పడ్డారని ఆలస్యంగా తెలిసింది. ఇది నిజమే అంటున్నాడు ఆయన దగ్గర దశాబ్దకాలం పనిచేసిన బాడీగార్డ్‌ మ్యాట్‌ ఫిడ్డెస్‌. కరోనా కారణంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై స్పందించిన మ్యాట్‌ ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో.. ‘ కరోనాలాంటి మహమ్మారి ప్రమాదం ఉందని మైకేల్‌ జాక్సన్‌ ముందుగానే భావించారు. ఏదో ఒకరోజు ప్రమాదకర సూక్ష్మ జీవుల బారిన పడి ప్రపంచం తుడిచిపెట్టుకుపోతుందని చెప్పేవారు. అందుకే ఎల్లప్పుడు ఫేస్‌మాస్క్‌, గ్లౌజులు ధరించేవారు. 

‘మ్యాట్‌ నేను అనారోగ్యానికి గురికాను. నా అభిమానులను నిరాశపర్చను. నాకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఓ కారణంమీదే నేను ఈ భూమిపై జన్మించాను. నేను నా గొంతును పాడుచేసుకోదల్చుకోలేదు. ప్రతినిత్యం ఎలాంటి వారు ఎదురుపడతారో.. ఎలాంటివాటిని నేను దాటుకెళుతానో తెలియద’ని జాక్సన్ చెప్పేవారు. ఆయన బ్రతికుంటే ఏం చెప్పేవారో అదే నేను చెబుతున్నాను. ఇలాంటి మాటలు చెప్పినపుడు ఆయన చుట్టూ ఉండేవారు పెద్ద సీరియస్‌గా తీసుకునేవారు కాదు.. ఎగతాళి చేసేవార’ని జాక్సన్ బాడీగార్డ్‌ మ్యాట్‌ ఫిడ్డెస్‌ చెప్పారు.

కరోనా వైరస్ సాంక్రమిక వ్యాధి విస్తరించిన దేశాల్లో కోట్లాదిమంది ప్రజలు స్వచ్చందంగా స్వీయ నిర్బంధాన్ని పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాణాంతక వైరస్ గురించి అనేక కుట్ర సిద్ధాంతాలను అల్లుతూ వస్తున్నారు. వీటిలో బాగా ప్రాచుర్యం పొందిన కథనం చైనాయే సార్స్-కోవిడ్-2 వైరస్‌ని తయారు చేసి ప్రపంచంమీదకు వదిలిందన్నదే. భారత్, అమెరికన్, యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలను విధ్వంసం చేయడానికే చైనా ఇంత కుట్రకు పాల్పడిందని పాశ్చాత్య మీడియా రకరకాల కథనాలతో భయాందోళనలను ప్రేరేపిస్తోంది. కరోనావైరస్ పుడుతుందని తమకు ఎప్పుడో తెలుసని చాలామంది ఇప్పుడు జోస్యాలు చెబుతున్నారు. కరోనా విస్తరణతో ప్రపంచమే అంతమైపోయేటట్లుందని కొందరు పుకార్లు లేపుతున్నారు.

కానీ కరోనా వైరస్ లాంటిది ఒకటి పుడుతుందనే వార్త అనుకోని కోణం నుంచి బయటపడింది. అదే మైకేల్ జాన్సన్ మాస్క్ రహస్యం. జాక్సన్ కెరీర్ ఉచ్ఛ దశలో ఉన్నప్పుడు విపరీతంగా ప్రపంచ పర్యటనలు చేసేవారు. అనేక దేశాలను చుట్టబెడుతూ, అనేక విమానాలు ఎక్కుతూ దిగుతూ, ఎన్నో దేశాల ప్రజలను కలిసేవారు. ప్రపంచం మొత్తాన్ని తుడిచిపెట్టే క్రిమి ఒకటి ఎప్పుడైనా పుట్టుకొస్తుందని, దాని బారిన తాను పడకుండా, ఇతరులకు తనద్వారా సోకనీయకుండా జాగ్రత్తపడటానికే ప్రయాణాల సమయంలో మాస్కును ధరిస్తున్నానని జాక్సన్ తన బాడీ గార్డుతో చెప్పిన మాటలు ఇన్నేళ్ల తర్వాత బయటపడటం సంచలనం గొల్పుతోంది.

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle