newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మే 3 తర్వాత పరిస్థితి ఏంటి? లాక్ డౌన్ పొడిగింపేనా?

27-04-202027-04-2020 13:33:20 IST
Updated On 27-04-2020 15:29:19 ISTUpdated On 27-04-20202020-04-27T08:03:20.837Z27-04-2020 2020-04-27T08:02:27.174Z - 2020-04-27T09:59:19.931Z - 27-04-2020

మే 3 తర్వాత పరిస్థితి ఏంటి? లాక్ డౌన్ పొడిగింపేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశమంతా మరోసారి లాక్ డౌన్ గురించే చర్చిస్తోంది. రెండువిడతల లాక్ డౌన్ తర్వాత పరిస్థితి ఏంటి? రాష్ట్రాలు ఏమంటున్నాయి? అనే అంశంపై భారత ప్రధాని మోడీ వివిధ రాష్ట్రాల సీఎంలతో చర్చిస్తున్నారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ పాల్గొనలేదు. అయితే కేరళ ప్రభుత్వం తరఫున కేంద్రానికి రాతపూర్వకంగా సూచనలు అందజేశారని తెలుస్తోంది. సీఎం తరఫున కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టామ్‌ జోస్ మాత్రం ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారని తెలుస్తోంది.

అయితే ప్రధాని మోదీ సీఎంలతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో.. మే 3 తరువాత లాక్‌డౌన్‌ను కొనసాగించడమా? లేక దశలవారీగా ఎత్తివేయడమా? అనే విషయంపై చర్చించారు. మార్చి 20, ఏప్రిల్‌ 11 తేదీల్లోనూ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మరోవైపు కేరళలో ఇప్పటివరకు 468 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 342 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ముగ్గురు మృతిచెందారు. ప్రస్తుతం కేరళలో 123 కరోనా యాక్టివ్‌ కేసులు వున్న సంగతి తెలిసిందే. వైరస్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో మెజార్టీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని పట్టుపడుతున్నాయి. మే 3 తరువాత కూడా లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ఈ సందర్భంగా మోదీని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరారు.

లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగిస్తారా..? లేక కొన్ని సడలింపులతో లాక్ డౌన్ కొనసాగిస్తారా.? ప్రస్తుతం ఇదే ప్రశ్న దేశమంతటా వినిపిస్తోంది. పీయం మోదీ నుంచి ఈ వీకెండులో దీనికి సమాధానం దొరకవచ్చునని భావిస్తున్నారు. మోదీ ఈ వారంతంలో మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్సులో లాక్ డౌన్ పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొంటున్నారు. కరోనా కట్టడికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటోన్న చర్యలను ప్రధాని ఈ కాన్ఫరెన్సులో రివ్యూ చేస్తున్నారు. లాక్‌డౌన్ పొడిగింపుపై ఈ వీడియో కాన్ఫరెన్సులో మెజారిటీ సీఎంల నుంచి వచ్చే సూచనలను బట్టీ ప్రధాని తుది నిర్ణయం తీసుకుంటారు. 

భారత్‌లో ప్రస్తుతం రెండో దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. మొదటి దశ మార్చి 24న ప్రారంభమై ఏప్రిల్ 14న ముగిసింది. రెండోదశ లాక్‌డౌన్ మే 3న ముగుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ మే 7 వరకూ ముందే లాక్‌డౌన్ పొడిగించారు. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో రోజురోజుకూ కేసుల తీవ్రత పెరుగుతుండటంతో లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్ పొడిగిస్తే ఆర్ధిక వ్యవస్థ కోలుకోలేని విధంగా దెబ్బతినే ప్రమాదం ఉండటంతో కొన్ని సడలింపులు ఇస్తూ లాక్‌డౌన్ కొనసాగిస్తారని అందరూ భావిస్తున్నారు. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర ప్రామాణిక వ్యవస్థల హెచ్చరికల ప్రకారం కరోనా వైరస్ ప్రభావం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశముంది. కరోనా వైరస్ కు విరుగుడు వ్యాక్సిన్ కనిపెట్టేదాకా మామూలు పరిస్థితి రాబోదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జనాభా పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన ఇండియాలో.. అదికూడా ఆరోగ్య రక్షణ వ్యవస్థ పటిష్టంగా లేని దేశంలో  వైరస్ నియంత్రణలోకి రాకముందే లాక్ డౌన్ ఎత్తివే స్తే దుష్పరిణామాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఎకనమిస్టులు చెబుతున్నారు. మే 3 తర్వాత ప్రధాని మోదీ తీసుకోబోయే నిర్ణయంపైనే మన భవిష్యత్ ఆధారపడి ఉంది.  

 

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   2 hours ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   2 hours ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   12 hours ago


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   19 hours ago


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   20 hours ago


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   18 hours ago


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   a day ago


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి  బొంబాయి హైకోర్టు  హితవు

ఇంటింటి టీకాల్లో జాప్యం వద్దు ... ఇప్పటికే ఎందరి ప్రాణాలొ కోల్పోయాం: కేంద్రానికి బొంబాయి హైకోర్టు హితవు

   12-05-2021


కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

కరోనా కేసుల అప్డేట్స్.. కొత్త‌గా 3,48,421 మందికి కరోనా

   12-05-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle