newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

మే నెలకు ఇండియాలో పది లక్షల కరోనా కేసులు?

27-03-202027-03-2020 08:10:33 IST
Updated On 27-03-2020 08:52:47 ISTUpdated On 27-03-20202020-03-27T02:40:33.547Z27-03-2020 2020-03-27T02:40:24.715Z - 2020-03-27T03:22:47.436Z - 27-03-2020

మే నెలకు ఇండియాలో పది లక్షల కరోనా కేసులు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మనదేశంలో కరోనా భయపెడుతోందా?

లాక్ డౌన్ తో పూర్తి ప్రయోజనం అందుకోలేమా?

అంతర్జాతీయ పరిశోధనా బృందం నివేదిక ఏం చెబుతోంది? 

రిపోర్టు అవుతున్న కేసుల కంటే వాస్తవ సంఖ్య ఎక్కువేనా?

దేశంలో తక్కువ కరోనా టెస్టు కేంద్రాలతో ఇబ్బందులేనా?

కేసులు ఎక్కువైతే దేశ వైద్య ఆరోగ్య వ్యవస్థ కుదేలే

మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కుల బెడ్లు, వెంటిలేటర్లు

ప్రతి 10 వేల మందికి ఇండియాలో 7 బెడ్లు

 ఫ్రాన్సులో 65, దక్షిణ కొరియాలో 115, చైనాలో 42,

దీనికి తోడు ఇన్సురెన్సు లేని మెజారిటి ప్రజలు

కఠిన చర్యల ద్వారా వ్యాప్తి నిరోధమే మార్గం అంటున్న నిపుణులు

 కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ నివేదిక ఒకటి స్పష్టం చేసింది. ఇండియాలో వచ్చే మే నెల నాటికి 10 నుంచి 13 లక్షల మందికి కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉన్నదని అంతర్జాతీయ పరిశోధనా బృందం ఒకటి తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఈ వ్యాధి వ్యాపిస్తున్న విధానాన్ని పరిశీలించి, దాని ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు. కోవిండ్-19 (COVIND-19) అనే అధ్యయన బృందం ఈ నివేదికను రూపొందించింది.

వైరస్ తొలిదశ వ్యాప్తిలో అమెరికా, ఇటలీ వంటి దేశాలతో పోలిస్తే, భారతదేశం మెరుగ్గానే కరోనా కేసులని నియంత్రించగలిగిన మాట వాస్తవమే. అయితే, విస్తృతంగా నిర్థారణ పరీక్షలు చేయలేకోపోవడం ఇండియా ప్రధాన లోపంగా కనిపిస్తోందని ఈ పరిశోధకులు అంటున్నారు.  పరీక్షా కేంద్రాలు చాలా తక్కువగా ఉండటం, ఫలితాల ఖచ్చితత్వం, ఎంతమంది వైరస్ బారిన పడిన వారు పరీక్షలు చేయించుకోగలుగుతున్నారు వంటి అంశాలు కరోనా విస్తృతిని అర్థం చేసుకోడానికి ముఖ్య అంశాలని, ఇండియాలో ఈ సమాచారం సమగ్రంగా లేదని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న జాన్ హాప్ కిన్స్ యూనివర్శిటి శాస్త్రవేత్త దేబశ్రీ రాయ్ అన్నారు.

ఇప్పటిదాకా, ఇండియాలో టెస్టులు చేసిన వాళ్ల సంఖ్య చాలా తక్కువ. అందువల్ల, ఎంతమందికి వాస్తవంగా ఈ వైరస్ సోకిందో చెప్పలేని పరిస్థితి ఇండియాలో నెలకొని ఉందని ఈ శాస్త్రవేత్తలు అంటున్నారు. మన దేశంలో కరోనా కేసులు చాలా తక్కువగా రిపోర్టు అవుతున్నాయని, అందుచేత ప్రస్తుత లెక్కలని నమ్మలేమని అంటున్నారు.

మార్చి 16 వరకూ రిపోర్టయిన కేసుల ఆధారంగా వేసిన లెక్కల ప్రకారంగా మే నెల నాటికి కరోనా కేసుల సంఖ్య దేశంలో పది లక్షలు దాటొచ్చనేది అంచనా. అయితే, ప్రభుత్వం తీసుకునే కఠిన చర్యలను బట్టి ఈ సంఖ్య తగ్గొచ్చు అని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ పరిశోధనలో ఢిల్లీ స్కూలు ఆఫ్ ఎకనామిక్స్, అలాగే అమెరికాలోని జాన్ హాప్ కిన్స్ యూనివర్శిటికి చెందిన శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు.

సాధారణ పరిస్థితుల్లోనే పేషెంట్ల తాకిడిని తట్టుకోలేని వైద్యఆరోగ్య వ్యవస్థ భారతదేశంలో ఉన్నదని, అలాంటిది ఒక్కసారిగా ఒత్తిడి ఎక్కువైతే వైద్యరంగం కుప్పకూలే అవకాశం ఉందని రిపోర్టులో అన్నారు.ఇండియాలో పదివేల మందికి 7 బెడ్లు ఉన్నాయి. అదే ఫ్రాన్సులో 65, దక్షిణ కొరియాలో 115, చైనాలో 42, ఇటలీలో 34, అమెరికాలో 28 బెడ్లు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే, ముందుముందు పెరిగే కరోనా కేసులను ట్రీట్ చేయగల సామర్థ్యం మన ఆస్పత్రులకు లేదని అర్థం అవుతుంది.

ఇండియా లో మరో సమస్య ఏంటంటే, దేశంలో 110 కోట్ల మందికి, అంటే మెజారిటి ప్రజలకి ఎటువంటి ఇన్సూరెన్సు పాలసీ లేదు. దీనికి తోడు, దాదాపు 30 కోట్ల మందికి బిపి ఉంది. కరోనా వైరస్ సోకిన వాళ్లు చనిపోవడానికి దోహదం చేసే అంశాల్లో బిపి ప్రధానమైనది. కఠిన మైన చర్యలు తీసుకోకపోతే, ఇండియాలోని వైద్యఆరోగ్య వ్యవస్థ, ఇక్కడున్న ఆస్పత్రులు పెరగనున్న కరెోనా పేషెంట్ల సంఖ్యతో ఉక్కిరిబిక్కిరయ్యే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమేరకు సత్ఫలితాలిస్తాయో చూడాలి. 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   5 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle