newssting
BITING NEWS :
* జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం *మెట్రో రైలు సర్వీసులకు .. అంతర్జాతీయ విమానాలకు అనుమతి లేదు *సినిమా హాల్స్, జిమ్, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, బార్లు, రాజకీయ వేదికలకు అనుమతి లేదు* ఢిల్లీ ఎయిరిండియా విమానంలో కరోనా కలకలం *ఏపీలో కొత్తగా 70 కరోనా కేసులు.. 2944 కి చేరిన కేసులు .. ఏపీలో యాక్టివ్ కేసులు 792 *పంట కొనుగోలు కేంద్రాలను జూన్ 8వ తేదీ వరకు కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు..మొదట మే 31వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలు

మెట్టుపాళ్యంలో కూలిన భవనం.. 15 మంది దుర్మరణం

02-12-201902-12-2019 12:09:33 IST
2019-12-02T06:39:33.421Z02-12-2019 2019-12-02T06:39:31.774Z - - 30-05-2020

మెట్టుపాళ్యంలో కూలిన భవనం.. 15 మంది దుర్మరణం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారీవర్షాలు తమిళనాడు వాసులను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం సంభవించింది. భారీ వర్షాల కారణంగా నాలుగు భవనాలు కూలిపోయాయి. ఈ దుర్ఘటనలో కనీసం 15 మంది మృతి చెందినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాద సమయంలో వారంతా నిద్రలో ఉండడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 

స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనేది ఇంకా అధికారిక సమాచారం లేదు. రెండురోజుల నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇది చాలదన్నట్టు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండు రోజులు పాటు కొనసాగే అవకాశం ఉందని చెన్నైలోని వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

భారీ వర్షాల దృష్ట్యా పుదుచ్చేరితో పాటు ఐదు జిల్లాల్లోని విద్యాసంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సోమవారం సెలవు ప్రకటించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, కాంచీపురం, కడలూరు, మదురై, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. ఆదివారం కూడా కొనసాగింది.

జనం బయటకు రావడానికి కూడా అవకాశం లేకపోవడంతో నిత్యావసరాలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ నెల 15నుంచి మరోసారి వర్ష సూచన ఉందని చెన్నైలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

 లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే  ఫోకస్

లాక్ డౌన్ పై రాష్ట్రాలదే నిర్ణయం ..ఆ నగరాలపైనే ఫోకస్

   7 hours ago


ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

ఒక్కరోజే 7,466 కరోనా కేసులు.. కరోనా మరణాల్లో చైనాను దాటేసిన భారత్?

   13 hours ago


ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్‌.. తిప్పికొట్టిన సంస్థ సీఈఓ

   29-05-2020


కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

కరోనా ఆందోళన.. ప్రపంచంలో 9వ స్థానానికి ఇండియా

   29-05-2020


నేపాల్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్.. కొత్త మ్యాపులకు బ్రేక్

నేపాల్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్.. కొత్త మ్యాపులకు బ్రేక్

   29-05-2020


కాశ్మీర్లో ఐఈడీతో భారీ కుట్ర.. భగ్నం చేసిన భద్రతాదళాలు

కాశ్మీర్లో ఐఈడీతో భారీ కుట్ర.. భగ్నం చేసిన భద్రతాదళాలు

   28-05-2020


లాక్ డౌన్ 5.O.. మరో రెండువారాలు గ్యారంటీనా?

లాక్ డౌన్ 5.O.. మరో రెండువారాలు గ్యారంటీనా?

   28-05-2020


కరోనా వ్యాప్తిలోనే కాదు వేసవి తీవ్రతలోనూ మనమే టాప్

కరోనా వ్యాప్తిలోనే కాదు వేసవి తీవ్రతలోనూ మనమే టాప్

   27-05-2020


యుద్ధసన్నద్దతను పెంచుకోండి.. చైనా అధ్యక్షుడి పిలుపు.. వెనక్కు తగ్గనంటున్న భారత్

యుద్ధసన్నద్దతను పెంచుకోండి.. చైనా అధ్యక్షుడి పిలుపు.. వెనక్కు తగ్గనంటున్న భారత్

   27-05-2020


లాక్‌డౌన్ హిట్ అయితే మేలో 74 శాతం కేసులెలా పెరిగాయి?. విమర్శకుల విస్మయం

లాక్‌డౌన్ హిట్ అయితే మేలో 74 శాతం కేసులెలా పెరిగాయి?. విమర్శకుల విస్మయం

   27-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle