newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

మూడులక్షల కేసులు దాటేశాం.. వాట్ నెక్స్ట్

13-06-202013-06-2020 11:03:29 IST
2020-06-13T05:33:29.807Z13-06-2020 2020-06-13T05:33:12.662Z - - 12-08-2020

మూడులక్షల కేసులు దాటేశాం.. వాట్ నెక్స్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా పాజిటివ్ కేసుల విషయంలో జెట్ వేగంగా కన్నా స్పీడ్ గా వుంది భారతదేశం. గడచిన 24 గంటల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా 11458 మందికి వైరస్‌ సంక్రమించింది. దీంతో వైరస్‌ సోకిన వారి సంఖ్య దేశంలో మూడు లక్షలు దాటింది. మొత్తం వైరస్‌ కేసుల సంఖ్య 308993కి చేరుకున్నది.  ఇక గత 24 గంటల్లో మరణించిన వారి సంఖ్య 386గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  దేశంలో మొత్తం 145779 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 154330 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.  దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 8884గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.  శుక్రవారానికే ప్రపంచంలో నాలుగవ స్థానంలోకి దూసుకువచ్చింది మనదేశం.

కోవిడ్ కేసులు పెరుగుతున్నా రికవరీ రేటు పెరగడం, డిశ్చార్జి అయ్యేవారి సంఖ్యలో వృద్ధి కాస్త ఊరటనిస్తోందనే చెప్పాలి. బీహార్‌, చత్తీస్‌ఘడ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, జార్ఖండ్‌, కర్నాటక, మేఘాలయా, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో .. వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఢిల్లీలో శుక్రవారం రోజున కొత్తగా 2137 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.దీంతో ఢిల్లీలో కేసుల సంఖ్య 36 వేలు దాటేసింది. 

దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు 

మహారాష్ట్ర 1,01,141,       మరణాలు 3,717 

తమిళనాడు 40,698         మరణాలు 367 

ఢిల్లీ 36,824                  మరణాలు1,214 

గుజరాత్ 22,537            మరణాలు 1,416 

ఉత్తర ప్రదేశ్ 12,616      మరణాలు 365

రాజస్థాన్ 12,068           మరణాలు272

మధ్యప్రదేశ్ 10,443       మరణాలు 440 

పశ్చిమబెంగాల్ 10,244  మరణాలు451 

కర్నాటక 6516             మరణాలు 79

హర్యానా 6334             మరణాలు 70 

బీహార్ 6103                మరణాలు35

జమ్మూ కాశ్మీర్ 4730      మరణాలు 53 

అసోంలో 3,694          మరణాలు8

ఒడిశాలో 3,498 , 13    మరణాలు

పంజాబ్‌లో 2,986        మరణాలు 63

కేరళలో 2,323 ,         మరణాలు 20 

మహారాష్ట్ర, ఢిల్లీలో వైరస్‌ వ్యాప్తి మరింత పెరుగుతోంది. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన అనంతరం కోవిడ్‌ విజృంభణ ఉధృతంగా మారిందని డాక్టర్లు చెబుతున్నారు. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపయ్యే వ్యవధి వారం క్రితం 15.4 రోజులు కాగా, ప్రస్తుతం అది 17.4 రోజులుగా నమోదయిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని తెలిపింది.  కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటిదాకా 53,63,445 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వివరించింది.

ఇందులో 1,50,305 శాంపిళ్లను గత 24 గంటల్లో పరీక్షించినట్లు తెలిపింది.  మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనుంజయ ముండేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తెలంగాణలో జనగామ ఎమ్మెల్యే ముతిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది.  మహారాష్ట్రలో కరోనా బారినపడిన మంత్రుల్లో మూడో వ్యక్తి ధనుంజయ ముండే. జితేంద్ర అహ్వాద్, అశోక్‌ చవాన్‌ అనే మంత్రులకు ఇంతకుముందే కరోనా సోకింది. 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle