newssting
BITING NEWS :
*సమ్మెపై మధ్యవర్తిత్వానికి కెకె రెడీ.. స్వాగతించిన ఆర్టీసీ జేఏసీ *అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

మూకదాడులు మన సంస్కృతే కాదు.. ఆర్ఎస్ఎస్ స్పష్టీకరణ

09-10-201909-10-2019 14:59:01 IST
2019-10-09T09:29:01.557Z09-10-2019 2019-10-09T09:28:57.725Z - - 15-10-2019

మూకదాడులు మన సంస్కృతే కాదు.. ఆర్ఎస్ఎస్ స్పష్టీకరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మూకదాడులు భారత సంస్కృతి కాదు, పరాయి సంస్కృతి అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. మూకదాడులు వంటి కొన్ని సామాజిక హింసా ఘటనల వల్ల దేశానికి, హిందూ సమాజం ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది. కొన్ని మతాల మధ్య భయాందోళనలకు దారితీస్తుంది. మూకదాడులు భారత సంస్కృతి కాదు, పరాయి సంస్కృతి అని భగవత్ అన్నారు. 

దసరా సందర్భంగా మంగళవారం నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో భగవత్ పాల్గొని ఆయుధపూజ నిర్వహించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, భిన్నత్వం అనేది మన దేశానికి అంతర్గత శక్తి అని అన్నారు. మూకదాడులు సహా హింస ఏరూపంలో ఉన్నా అది గర్హనీయమని, మూకదాడుల పదం ఎంతమాత్రం భారత్‌కు పొసగదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. భారతదేశం భారతీయులందరిదీనని, ఇక్కడ అందరూ కలిసిమెలిసి సహజీవనం సాగిస్తుంటారని చెప్పారు. 

మూకదాడులు అనే పదం ఇటీవల తరచుగా వింటున్నామని, కాని భారత్‌లో ఇంతకుముందు ఎన్నడైనా ఇలాంటి ఘటనలు సంభవించాయా అని భగవత్ ప్రశ్నించారు. ఈ పదం ఎక్కడినుంచి వచ్చిందో మీరు విన్నారా, ఈ పదం మూలమేంటి, దీనికి సంబంధించి ఒక పాత ఖత ఉంది. భారత్ వెలుపల ఉన్న మతాల చరిత్రలోనే మూకదాడులకు చోటు చేసుకున్నాయని ఆ కథ చెబుతుంది అని ఆర్ఎస్ఎస్ అధినేత పేర్కొన్నారు. తనకు తెలిసినంతవరకు ఆర్ఎస్ఎస్ సభ్యులెవరూ ఇలాంటి మూక దాడుల్లో పాల్గొనలేదని, ఎక్కడైన జరుగుతుంటే వాటిని ఆపడానికే ప్రయత్నించారని భగవత్ స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మన దేశ సంప్రదాయంలో భాగం కాదు. కానీ ఇలాంటి ఘటనలు మాకదాడుల్లో భాగమే అంటూ ప్రచారం చేస్తున్నారని, కాని దేశానికి, హిందూ సమాజానికి హాని కలిగించే ప్రయత్నాల్లో భాగంగానే ఇలాంటి ప్రచారం జరుగుతోందని విమర్శించారు.

భిన్నాభిప్రాయాలు కావచ్చు, రెచ్చగొట్టే ప్రయత్నాలు కావచ్చు... ఎవరే చర్యకు పాల్పడినా అది రాజ్యాంగ పరిధిలోనే ఉండాలన్న విషయాన్ని సమాజం గుర్తెరగాలని ఆయన హితవు పలికారు. సమాజంలోని భిన్న వర్గాలు పరస్పర సౌహార్ద్రం, చర్చలు, సహకారం కోసం పాటుపడాలన్నారు. ఇవాల్టి సమాజానికి ఇవి అనివార్యమని సూచించారు.

భిన్నత్వం అనేది దేశానికి అంతర్గత శక్తి అని, కులం, మతం, భాష, ప్రాంతాల వైవిధ్యాన్ని స్వప్రయోజనాలకు వాడుకోవడం వల్ల విభేదాలకు తావిస్తుందని అన్నారు. అలాంటి స్వార్థ శక్తుల కుట్రలను గుర్తించి అప్రమతం కావాలని, వాటిని తిప్పికొట్టాలని అన్నారు.  పరస్పర సహకారం, కలిసి చర్చించుకునే వాతావరణాన్ని పాదుకొలిపేందుకు సంఘ్ స్వయంసేవక్‌లు కృషిచేయాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.

దేశంలో ఏదో ఒక మూల అడపా దడపా దాడులు జరుగుతున్న ఘటనలకు మూక దాడులు అని పేరు పెట్టడం తదగని, భారత చరిత్రలో, సంప్రదాయంలో మూక దాడులు భాగం కాదని భగవత్ పేర్కొన్నారు.

 

కాశ్మీర్ లో ఆంక్షల ఎత్తివేత-రాజకీయ విమర్శకుల నోటికి తాళం!

కాశ్మీర్ లో ఆంక్షల ఎత్తివేత-రాజకీయ విమర్శకుల నోటికి తాళం!

   13 hours ago


సంక్షోభం ప్రపంచానికి.. వికాసం భారత్‌కు.. మోదీ

సంక్షోభం ప్రపంచానికి.. వికాసం భారత్‌కు.. మోదీ

   16 hours ago


పీఎస్‌యూ బ్యాంకు సీఈవోలతో ఇవాళ ఆర్థికమంత్రి భేటీ

పీఎస్‌యూ బ్యాంకు సీఈవోలతో ఇవాళ ఆర్థికమంత్రి భేటీ

   20 hours ago


 అయోధ్యలో టెన్షన్.. టెన్షన్

అయోధ్యలో టెన్షన్.. టెన్షన్

   21 hours ago


వేదాలపై సెమినార్.. కమ్యూనిస్టుల సరికొత్త జ్ఞానోదయం

వేదాలపై సెమినార్.. కమ్యూనిస్టుల సరికొత్త జ్ఞానోదయం

   13-10-2019


 మామల్లపురం బీచ్‌లో చెత్త ఏరిన ప్రధాని..

మామల్లపురం బీచ్‌లో చెత్త ఏరిన ప్రధాని..

   13-10-2019


జిన్ పింగ్ భారత పర్యటనలో ప్రస్తావనకు రాని కాశ్మీర్- మోడీ విజయమే!

జిన్ పింగ్ భారత పర్యటనలో ప్రస్తావనకు రాని కాశ్మీర్- మోడీ విజయమే!

   13-10-2019


 హాగిబిస్‌ తుపాన్‌ దెబ్బకు జపాన్ విలవిల

హాగిబిస్‌ తుపాన్‌ దెబ్బకు జపాన్ విలవిల

   13-10-2019


 దేశంలో నిరుద్యోగం అబద్దం... సినిమాలు బాగానే పోతున్నాయి కదా..

దేశంలో నిరుద్యోగం అబద్దం... సినిమాలు బాగానే పోతున్నాయి కదా..

   13-10-2019


బడానేతలు వస్తేనే శుభ్రత గుర్తొస్తుందా? మద్రాస్ హైకోర్టు..

బడానేతలు వస్తేనే శుభ్రత గుర్తొస్తుందా? మద్రాస్ హైకోర్టు..

   12-10-2019


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle