newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

మిలటరీని దింపుతున్నా.. ట్రంప్ బెదిరింపు.. నోరు మూసుకోమన్న పోలీస్ చీఫ్

03-06-202003-06-2020 15:37:47 IST
Updated On 03-06-2020 15:49:45 ISTUpdated On 03-06-20202020-06-03T10:07:47.754Z03-06-2020 2020-06-03T10:07:45.139Z - 2020-06-03T10:19:45.261Z - 03-06-2020

మిలటరీని దింపుతున్నా.. ట్రంప్ బెదిరింపు.. నోరు మూసుకోమన్న పోలీస్ చీఫ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మన దేశంలో ఒక సాధారణ పోలీసు అధికారి కానీ, పోలీసు చీఫ్ కానీ ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా చిన్న వ్యాఖ్య చేయడం అంటే కల్లో మాటగానే ఉంటుంది. ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతను నిందించకూడదని, విమర్శించకూడదని ప్రభుత్వోద్యోగుల నియమ నిబంధనల్లో పేర్కొనడంతో మన దేశంలో ఉద్యోగులు నోరు అదుపులో పెట్టుకోవలిసిందే. కానీ అమెరికాలో అలా కాదు. సాక్షాత్తూ దేశాధ్యక్షుడే అదుపు తప్పి మాట్లాడితే, ప్రజలను సవాలు చేస్తే కాస్త నోరు అదుపులో పెట్టుకోండి అధ్యక్షులవారూ అంటూ పోలీసు చీఫ్ మందలించడం ఆ దేశానికే చెల్లు. నల్లజాతికి చెందిన జార్జి ఫ్లాయిడ్ హత్య నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా చెలరేగిన అల్లర్లను అదుపులో పెట్టకపోతే సైన్యాన్ని దింపుతామని, తుపాకుల తన పని ప్రారంభిస్తాయని దేశాధ్యక్షుడు ట్రంప్ పరుష వ్యాఖ్యలు చేయడమే అమెరికా చరిత్రలో తొలిసారిగా వైట్ హౌస్‌పై వేలాదిమంది ఆందోళనకారులు దాడికి దిగటానికి కారణమైంది. కాగా టెక్సాస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌ నగర పోలీస్‌ చీఫ్‌ కూడా ట్రంప్‌ని షట్ యువర్ మౌత్ అంటూ తీవ్రంగా మందలించారు.

ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణంతో రగిలిన అశాంతి, దావానలంలా రగులుతోంది. అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌‌వద్ద భారీ స్థాయిలో నిరసన చెలరేగడంతో భారీ ఎత్తున సైన్యాన్ని రంగంలోకి దించుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. రాజధాని నగరంలో హింసాత్మక నిరసనలను అరికట్టడానికి అదనపు బలగాలను పంపుతున్నామన్నారు. జార్జ్ ఫ్లాయిడ్ మృతితో దేశవ్యాప్తంగా నిరసన పేరుతో నగరంలో చాలా అమర్యాదకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయని, అవి శాంతియుత నిరసనలు కావంటూ మండిపడ్డారు. ఈ అల్లర్లను దేశీయ ఉగ్రవాద చర్యలుగా ఆయన పేర్కొన్నారు. వాషింగ్టన్‌లో అల్లర్లు, దోపిడీలు, దాడులు, ఆస్తి విధ్వంసాలను ఆపడానికి వేలాది మంది సాయుధ సైనికులు, ఇతర పొలీసు అధికారులను పంపిస్తున్నానని ప్రకటించారు. 

పైగా శాంతిభద్రతల అధ్యక్షుడిగా తనని తాను ప్రకటించుకున్న అమెరికా అధ్యక్షుడు ఆస్తులను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, హింసను నియంత్రించడానికి వీలైనంత ఎక్కువ నేషనల్ గార్డ్ దళాలను ఉపయోగించాలని గవర్నర్లను ట్రంప్ కోరారు. అలాగే అలర్లకు పరోక్షంగా ఆయా రాష్ట్రాల గవర్నర్లే కారణమని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది గవర్నర్లు శక్తిహీనులుగా మారారని మండిపడ్డారు. అల్లర్లు జరిగిన చారిత్రాత్మక సెయింట్ జాన్ చర్చిని, రెండో ప్రపంచ యుద్ధం స్మారక కట్టడాన్ని ట్రంప్‌ సందర్శించారు.

ట్రంప్‌ నోరు అదుపులో పెట్టుకో‌.. హ్యూస్టన్ పోలీసు చీఫ్

నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ పోలీసుల చేతిలో మృతిచెందడాన్ని నిరసిస్తూ అగ్రరాజ్యం అమెరికాలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మినియాపొలిస్‌లో ప్రారంభమైన నిరసన జ్వాలలు అమెరికాలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు అంటుకున్నాయి. ఆందోళనకారులను కించపరుస్తూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు నిరసనలకు ఆజ్యం పోసినట్లు అ‍య్యింది. లూటింగ్‌ మొదలైతే.. షూటింగ్‌ తప్పదని హెచ్చరిస్తూ ట్రంప్‌ గత వారం సోషల్‌ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌ ప్రకంపనలు రేపుతోంది. 

దీనిపై టెక్సాస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌ నగర పోలీస్‌ చీఫ్‌ ఆర్ట్‌ అసేవెడో డొనాల్ట్‌ ట్రంప్‌కు గట్టిగానే బదులిచ్చారు. ట్రంప్‌ నోరు మూసుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల నిరసనకారుల ఆగ్రహం ఇంకా పెరుగుతుందని, ఇలా వ్యాఖ్యలు చేయడం వారిని రెచ్చగొట్టడమే అవుతుందన్నారు. నిరసనకారులను రెచ్చగొట్టకుండా ట్రంప్‌ నోరు మూసుకోవడం సరైనదని సూచించారు. ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటానికి బదులుగా సమస్య పరిష్కారానికి చొరవ చూపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 

ఇదిలావుండగా జార్జ్‌ మృతిపై ఆందోళన ఉధృతమవుతున్న తరుణంలో.. అతని మెడపై బలమైన ఒత్తిడి వలనే చనిపోయాడని వైద్యులు పోస్ట్‌మార్టం నివేదికను బహిర్గతం చేశారు. దీంతో ఆందోళనకారుల ఆగ్రహం మరింత పెరిగింది. ఏకంగా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను తాకింది. ఈ క్రమంలో ట్రంప్‌ బంకర్‌లో తల దాచుకున్నట్లు వార్తలు వెలుపడ్డాయి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle