newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం.. ఇండియాపై పాకిస్తాన్‌ ప్రశంసలు

05-04-202005-04-2020 16:48:02 IST
Updated On 05-04-2020 16:50:24 ISTUpdated On 05-04-20202020-04-05T11:18:02.254Z05-04-2020 2020-04-05T11:17:58.154Z - 2020-04-05T11:20:24.011Z - 05-04-2020

మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం.. ఇండియాపై పాకిస్తాన్‌ ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సంక్షోభ కాలాల్లో భారతీయులను ఆదుకోవడంలో ఎయిర్ ఇండియా ప్రదర్శించి సాహస కృత్యాలను ఇప్పటికే ప్రపంచం చాలా సందర్భాల్లో తెలుసుకుంది. ఇరాక్, కువైట్ దేశాల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్నప్పుడు ఆ రెండు దేశాల్లో చిక్కుకుపోయిన లక్షమందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో అనితరసాధ్యమైన ప్రయత్నం చేసి యావత్ ప్రపంచం ప్రశంశలందుకుంది ఎయిర్ ఇండియా. ఒకే ఒక ఘటనలో లక్షమందికి పైగా ప్రయాణీకులను గగన మార్గంలో రోజుల తరబడి తీసుకొచ్చి చిన్న ప్రమాదం కూడా లేకుండా భద్రతా ప్రమాణాలను పాటించిన ఎయిర్ ఇండియా ఆనాటి నుంచి అనేక సందర్భాల్లో అలాంటి సాహస కృత్యాలను ఎన్నింటినో చేస్తూ వచ్చింది. 

తాజాగా ప్రపంచ దేశాలను చాపచుట్టేస్తూ భీభత్సం సృష్టిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో భారత్‌లో చిక్కుకుపోయిన జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఐర్లండ్ దేశాల పౌరులను వారి స్వస్థలాలకు తరలించేందుకు భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పలు విమాన సర్వీసులను ప్రారంభించింది. ఈ క్రమంలో మన దాయాది దేశం పాకిస్తాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ఎయిర్ ఇండియాపై అనూహ్యంగా ప్రశంసల వర్షం కురిపించడం ఎయిరిండియా సిబ్బందిని సంభ్రమాశ్చర్యాలకు  గురిచేసింది. వివరాల్లోకి పోతే,..

కరోనా కష్టకాలంలో జర్మనీకి విమానాలు నడిపిన ఎయిర్‌ ఇండియాపై పాకిస్తాన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) అధికారులు ప్రశంసలు కురిపించారు. మన దేశంలో చిక్కుపోయిన జర్మనీ, కెనడా, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌ పౌరులను తరలించేందుకు, ఆయా దేశాల నుంచి కరోనా రిలీఫ్‌ మెటీరియల్స్‌ను తీసుకొచ్చేందుకు ఎయిర్‌ ఇండియా పలు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

అయితే, ఏప్రిల్‌ 2న రెండు ఎయిర్‌ ఇండియా విమానాలు పాకిస్తాన్‌ గగనతలం మీదుగా వెళ్తుండగా.. వాటికి అనుమతినివ్వడంతో పాటు.. ‘ఆస్‌ సలాం ఆలేకూం (మీకు శాంతి కలుగుతుంది). ఇది కరాచీ కంట్రోల్‌ రూమ్‌. ఎయిర్‌ ఇండియా రిలీఫ్‌ ఫ్లైట్లకు స్వాగతం’అని చెప్పడం ఆనందం, ఆశ్చర్యం కలిగించిందని ఎయిర్‌ ఇండియా పైలట్‌ పాక్‌ ఏటీసీ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. 

తొలుత పాకిస్తాన్‌ ఏటీసీ సిబ్బందిని సంప్రదిస్తే.. స్పందన రాలేదని, అనంతరం వారు తమను సంప్రదించి గొప్పగా రిసీవ్‌ చేసుకున్నారని పైలట్‌ చెప్పుకొచ్చారు. ‘మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో మీ సేవలపట్ల గర్వంగా ఉంది. గుడ్‌ లక్‌’ అని పాక్‌ ఏటీసీ అధికారులు పేర్కొన్నారు. 

‘పాకిస్తాన్‌ అనుమతితో కరాచీ గుండా వెళ్లిన ఎయిర్‌ ఇండియా విమానాలకు 15 నిముషాల సమయం కలిసి వచ్చింది. అది మాత్రమే కాకుండా.. ఇరాన్‌ గగనతలంలోకి వెళ్లే ముందు.. ఆ దేశ వైమానిక సిబ్బందిని సంప్రదించడంలో ఇబ్బందులు తలెత్తితే పాకిస్తాన్‌ ఏటీసీ సాయం చేసింది. దాంతో ఇరాన్‌ కూడా మా గమ్యం త్వరగా చేరుకునే దిశగా మార్గం చూపించింది’ అని ఎయిర్‌ ఇండియా పైలట్‌ తెలిపారు. ఇక ఎయిర్‌ ఇండియా సేవలపై టర్కీ, జర్మనీ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ కూడా ప్రశంసలు కురిపించారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అనేక దేశాలకు పలు పునరావాస, ప్రయాణీకుల తరలింపు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టిన భారత జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పలు దేశాలనుంచి ప్రశంసాత్మక సందేశాలను అందుకుంటున్న విషయం తెలిసిందే. కానీ ఎన్నడూ ఆశించని కోణంలో దాయాది దేశమైన పాకిస్తాన్ కూడా ఎయిర్ ఇండియాను ప్రశంసించే బాటలో నడవటం ఆశ్చర్యకరం, సంతోషకరం కూడా..

లాక్ డౌన్ నేపథ్యంలో జర్మన్, ఫ్రెంచ్, ఐరిష్, కెనడియన్ జాతీయులను ఆయా దేశాల రాయబార కార్యాలయాలు చేసిన అభ్యర్థన మేరకు ఎయిర్ ఇండియా 18 చార్టర్ విమానాలను నడపనుంది. ఏప్రిల్ 9 వరకు ఎయిర్ ఇండియా ఈ సేవలలో భాగం పంచుకోనుంది. భారతదేశానికి అవసరమైన క్లిష్టమైన వైద్య పరికరాలను తీసుకురావడం కోసం కూడా ఎయిర్ ఇండియా ఢిల్లీనుంచి షాంఘై మధ్య సరకుల రవాణా విమానాలను నడిపిన విషయం తెలిసిందే.

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   2 hours ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   9 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   9 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   04-08-2020


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle