newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు తొలగించిన ఎస్‌బీఐ నిర్ణయంతో 45 కోట్లమందికి లాభం

12-03-202012-03-2020 11:50:32 IST
Updated On 12-03-2020 14:03:13 ISTUpdated On 12-03-20202020-03-12T06:20:32.273Z12-03-2020 2020-03-12T06:20:30.095Z - 2020-03-12T08:33:13.433Z - 12-03-2020

మినిమమ్ బ్యాలెన్స్ చార్జీలు తొలగించిన ఎస్‌బీఐ నిర్ణయంతో 45 కోట్లమందికి లాభం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకే ఒక్క నిర్ణయంతో భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 44.51 కోట్లమంది ఖాతాదారులకు లబ్ధి కలిగించింది. ఇకపై  మినిమం బ్యాలెన్స్‌ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం ఎస్‌బీఐ ఖాతాదారులు తమ పొదుపు ఖాతాలలో  కనీస నిల్వను (నెలవారీ) పాటించాల్సిన అవసరం లేదు. దీంతో ఖాతాదారులకు భారీ ఊరట లభించింది. అలాగే  పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును సంవత్సరానికి 3 శాతంగా నిర్ణయించింది. దేశంలో ఆర్థిక సమగ్రతా  ప్రోత్సాహ చర్యల్లో  భాగంగా మొత్తం 44.51 కోట్ల ఎస్‌బీఐ ఖాతాల్లో సగటున నెల వారీ నిల్వ చార్జీలను రద్దు చేస్టున్నట్టు తెలిపింది.

సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వ చార్జీలతో పాటు ఎస్ఎంఎస్ ఛార్జీలను కూడా ఎస్బీఐ మాఫీ చేసింది. ఇంతవరకు ఎస్‌బీఐ సేవింగ్స్ బ్యాంక్ వినియోగదారుల మెట్రో, సెమీ అర్బన్,  గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా  రూ. 3వేలు,  రూ. 2 వేలు,  వెయ్యి రూపాయల నెలవారీ కనీస నిల్వను ఉంచాల్సి వచ్చేది. లేదంటే పన్నులతో పాటు 5 నుంచి 15 రూపాయల వరకు జరిమానా కూడా బ్యాంకు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ నిర్ణయం.. 44. 51 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం కలగనుంది. 

ప్రభుత్వరంగంలోని అతిపెద్ద బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) బుధవారం నాడు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా వివిధ కాలపరిమితులు కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేటు, నిధుల వ్యయ ఆధారిత వడ్డీ రేట్ల (ఎంసీఎల్‌ఆర్‌)ను తగ్గించింది. సేవింగ్స్‌ ఖాతా డిపాజిట్లపైనా వడ్డీ రేటులో కోత విధించింది. సేవింగ్స్‌ ఖాతాల్లో ఉంచాల్సిన కనీస నిల్వ నిబంధనను ఎత్తివేయడమేకాకుండా, ఎస్‌ఎంఎస్‌లపై త్రైమాసిక చార్జీలను తొలగించింది. ఎంసీఎల్‌ఆర్‌ను తగ్గించడం వల్ల గృహ, వాహన, ఆటో తదితర రుణాలు మరింత చవకగా లభించనున్నాయి. 

పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ అవసరాన్ని తొలగించడం వల్ల మధ్యతరగతి, పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. వారి జీవనం మరింత సులభతరం అవుతుంది. ఎస్‌బీ ఖాతాల్లో కనీస నిల్వ కలిగి ఉండాలన్న నిబంధనను ఎస్‌బీఐ ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయం సమ్మిళిత బ్యాంకింగ్‌ అవకాశాలను ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా పేదవారికి ప్రయోజనం కలుగుతుంది. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ అన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదాన్ని ఎంతో బలోపేతం చేస్తుంది అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు.

‘కస్టమర్‌ ఫస్ట్‌’ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది.  ఎస్‌బీఐ 2017 ఏప్రిల్‌ నుంచి కనీస నిల్వ చార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌ కనీస నిల్వ పెనాల్టీగా కస్టమర్ల నుంచి రూ.2,400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఎస్‌బీఐ వివిధ రకాల విభాగాల్లో వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో ఇతర బ్యాంకులు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఎస్‌బీ ఖాతాలపై వడ్డీ రేటును తగ్గించడంతోపాటు కనీస నిల్వ నిబంధనను ఎత్తివేయవచ్చని అంటున్నారు. 

వివిధ కాలపరిమితులు కలిగిన రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్ల (రూ.2 కోట్లకన్నా తక్కువ) వడ్డీ రేటును 0.10 శాతం నుంచి 0.50 శాతం వరకు వడ్డీ రేటును ఎస్‌బీఐ తగ్గించింది. నెల రోజుల్లోనే వడ్డీ రేట్లు రెండోసారి తగ్గాయి. 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 4.50 శాతం నుంచి 4 శాతానికి తగ్గించారు. ఏడాది అంతకు మించిన మెచ్యూరిటీ కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 0.10 శాతం తగ్గించారు. దీంతో ఏడాది నుంచి రెండేళ్లకన్నా తక్కువ కాలం ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 6 శాతం నుంచి 5.90 శాతానికి తగ్గింది. ఇదేకాలానికి సీనియర్‌ సిటిజన్లకు వడ్డీ రేటు 6.50 శాతం నుంచి 6.40 శాతానికి తగ్గింది. 

సేవింగ్స్‌ ఖాతాల్లో కనీస నిల్వను ఉంచనందుకుగాను ఖాతాదారులు గత మూడేళ్లలో జరిమానాల రూపంలో బ్యాంకులకు దాదాపు రూ.10,000 కోట్లు చెల్లించారు. ఇందులో ప్రభుత్వరంగంలోని 18 బ్యాంకులు రూ.6,155 కోట్లు, నాలుగు ప్రధాన ప్రైవేటు బ్యాంకులు రూ.3,567 కోట్లు వసూలు చేశాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రాజ్యసభలో వెల్లడించారు. బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ అకౌంట్స్‌ (బీఎ్‌సబీడీ), ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజనా (పీఎంజేడీవై) ఖాతాల్లో నిల్వ లేనందుకు మాత్రం బ్యాంకులు చార్జీలు వసూలు చేయడం లేదు. ఇతర ఖాతాలకు మాత్రం బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తున్నాయి.

పొరపాటున కనీస నిల్వను ఖాతాలో ఉంచకపోయినా, అత్యవసరాల పేరిట కనీన నగదును కూడా ఖాతాదారులు తీసివేసినా బ్యాంకులు తక్షణం జరిమానా విధించి వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్పీఐ మళ్లీ ఖాతాదారులపై దయ తల్చినట్లే అని చెప్పాలి.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   2 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   3 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   5 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   14 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle