facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
*పుల్వామా అమర జవాన్లకు చంద్రబాబు సాయం... ఒక్కో జవాను కుటుంబానికి 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా * పుల్వామా ఘటనపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం....తీవ్రవాదులపై చర్యలకు పూర్తి మద్దతు.. ఒక దేశం ఒకటే మాట * కోమటిరెడ్డి, సంపత్ కేసు.... న్యాయశాఖ కార్యదర్శి వి. నిరంజన్‌రావు, శాసనసభ కార్యదర్శి వి. నరసింహాచార్యులకు జ్యుడీషి‌యల్‌ కస్టడీ.. 10వేల పూచీకత్తుపై విడుదల *పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్.. ఉగ్రవాద చర్యలు ఆపాలని, వారి ఆశ్రయం ఇవ్వొద్దని హెచ్చరికలు* ఎమ్మెల్సీ పదవికి మంత్రి సోమిరెడ్డి రాజీనామా *టీటీడీ బోర్డు సభ్యుడిగా సండ్ర నియామకం రద్దు.. టీఆర్ఎస్‌లో చేరే అవకాశం * ఫిబ్రవరి 17 నుంచి తెలంగాణలో 33 జిల్లాలు.. అందుబాటులోకి నారాయణపేట, ములుగు జిల్లాలు * భారత మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’‌ సాంకేతిక అడ్డంకులు.. ప్రారంభించిన మరుసటి రోజే ఆగిపోయిన రైలు

మా పుట్టలో వేలుపెడితే కుట్టమా..?

10-02-201910-02-2019 09:07:17 IST
Updated On 10-02-2019 09:07:13 ISTUpdated On 10-02-20192019-02-10T03:37:17.695Z10-02-2019 2019-02-10T03:36:29.567Z - 2019-02-10T03:37:13.311Z - 10-02-2019

మా పుట్టలో వేలుపెడితే కుట్టమా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మమతా బెనర్జీ టిట్ ఫర్ టాట్ సూత్రం అనుసరిస్తున్నారా? సీబీఐకి ఆమె ఝలక్ ఇస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. మా బెంగాల్ పుట్లో వేలుపెడితే కుట్టకుండా ఊరుకుంటామా అన్నట్టుగా మమత సీబీఐ మాజీ అధికారి నాగేశ్వరరావుపై రివెంజ్ తీర్చుకుంటున్నారు. 

శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో విచారణ కోసం వచ్చిన సీబీఐ అధికారులను అడ్డుకుని అరెస్ట్ చేసి సంచలనం సృష్టించారు మమత బెనర్జీ. ఆమె ఇప్పుడు మరో సంచలనం కలిగిస్తున్నారు. సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు ఆస్తులపై కోల్‌కతా పోలీసులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఆస్తుల పరిశీలనకు మాత్రమే వచ్చామని  పోలీసులు అంటున్నా దీని వెనుక వేరే కారణం ఉందని తెలుస్తోంది.

ఒకపక్క సీబీఐ కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను విచారిస్తోంది. షిల్లాంగ్‌లోని సీబీఐ కార్యాలయంలో రాజీవ్ కుమార్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో  బెంగాల్  పోలీసుల చర్య ప్రతీకారంగానే భావిస్తున్నారు. మరోవైపు, నాగేశ్వరరావు ఆస్తుల విషయంలో సోదాలు నిర్వహించిన రెండు ప్రాంతాల్లోనూ పోలీసులు భారీగా మోహరించారు. ఈ సోదాల్లో నాగేశ్వరరావు భార్య, కుమార్తె ఆధ్వర్యంలో నడిచే కంపెనీతోపాటు స్టాల్‌లేక్‌లో నాగేశ్వరరావు భార్య సారథ్యంలో నడుస్తున్న ఓ కంపెనీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు శారదా కుంభకోణంతో సంబంధం ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కునాల్‌ ఘోష్‌ను కూడా ఆదివారం షిల్లాంగ్‌లో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఇటు సీబీఐ, అటు బెంగాల్ పోలీసుల చర్యలతో బెంగాల్ పాలిటిక్స్ హీటెక్కాయి. 

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle