newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

మా దేశంలోకి రావద్దు ప్లీజ్.. ఏప్రిల్‌ 15 దాకా భారత్ వీసాలు బంద్‌

12-03-202012-03-2020 09:28:42 IST
2020-03-12T03:58:42.592Z12-03-2020 2020-03-12T03:58:38.443Z - - 12-08-2020

మా దేశంలోకి రావద్దు ప్లీజ్.. ఏప్రిల్‌ 15 దాకా భారత్ వీసాలు బంద్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. భారత్‌లోకి ప్రవేశార్హత కల్పించే అన్ని వీసాలనూ తాత్కాలికంగా నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న రాయబార, అధికారిక, ఐక్యరాజ్యసమితి/ఇతర అంతర్జాతీయ సంస్థల, ఉద్యోగ, ప్రాజెక్టు వీసాలన్నింటినీ ఏప్రిల్‌ 15 దాకా సస్పెండ్‌ చేస్తున్నట్టు బుధవారం సాయంత్రం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఓవర్‌సీస్‌ సిటిజన్‌షిప్ ఆఫ్‌ ఇండియా కార్డు కలిగినవారికి కల్పించిన వీసారహిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా అప్పటిదాకా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

ప్రత్యేకించి చైనా, ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ దేశాల నుంచి వచ్చేవారికి, భారతీయులతో సహా అందరికీ 14రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది. అంతర్జాతీయ కాలమానం ప్రకారం.. మార్చి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటల నుంచి) ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. 

తప్పనిసరిగా భారత్‌కు రావాలనుకునే విదేశీయులు తమ దేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలను సంప్రదించాలని సూచించింది. అలాగే.. కరోనా విషయంలో అంటువ్యాధుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 2 లోని నిబంధనలను అమలు చేయాల్సిందిగా కేంద్రం అన్ని రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.

వైరస్‌ విస్తృతి ఎక్కువగా ఉన్న ఇటలీ, దక్షిణ కొరియా దేశాలకు గతకొద్దిరోజుల్లో వెళ్లిన చరిత్ర ఉన్నవారికి, ఆయా దేశాల నుంచి వచ్చేవారికి కరోనా నెగెటివ్‌ అని ధ్రువీకరించే పత్రాలు ఉంటేనే దేశంలోకి అనుమతిస్తామని కేంద్రం ప్రకటించింది. కేసులు తగ్గేవరకూ కొనసాగుతాయని తెలిపింది. 

ఇటలీ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చిన 83 మంది భారతీయులను మానేసర్‌లోని ఆర్మీ క్వారంటైన్‌లో ఉంచారు. వారిలో 16 మంది పిల్లలు. వారిని రెండువారాల పాటు అక్కడే ఉంచి చికిత్స చేస్తారు. ఆ తర్వాత పరీక్ష చేసి నెగెటివ్‌ వస్తేనే ఇంటికి పంపిస్తారు. కాగా.. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారు 14 రోజులపాటు ఇళ్లల్లోనే ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. 

మరోవైపున ఇటలీలో చిక్కుకుపోయిన 300 మంది భారతీయ విద్యార్థులు కరోనా బారిన పడిందీ లేనిదీ తెలుసుకోవడానికి వారి లాలాజల నమూనాలను సేకరించేందుకు భారతీయ వైద్యుల బృందం ఒకటి గురువారం రాత్రి ఇటలీకి వెళ్లనుంది. కాగా.. కరోనావైరస్‌ వ్యాప్తి, పాజిటివ్‌ కేసులకు సంబంధించిన సమాచారాన్ని రోజూ తెలపడం ప్రజల్లో భయాన్ని కలిగిస్తుందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. 

కరోనా విస్తృతి ఎక్కువగా ఉన్న దేశాలకు ఫిబ్రవరి 1 తర్వాత వెళ్లిన క్రూయిజ్‌ నౌకలకు భారత్‌లోకి ప్రవేశాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది. నెలాఖరు దాకా ఈ నిషేధం అమల్లో ఉంటుంది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నౌకాయాన శాఖ తెలిపింది. భారత్‌లోకి ప్రవేశానికి సంబంధించి జనవరి 1లోపు సమాచారం అందించిన నౌకలను అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. అలాగే.. థర్మల్‌ స్ర్కీనింగ్‌ సౌకర్యం ఉన్న రేవుల్లోకి మాత్రమే అంతర్జాతీయ నౌకలను అనుమతిస్తామని తెలిపారు. 

 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   4 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle