newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

మా తిండి తింటావు.. మా భాష మాట్లాడవా: డాక్టర్‌పై దాడి

30-11-201930-11-2019 16:23:26 IST
2019-11-30T10:53:26.372Z30-11-2019 2019-11-30T10:53:24.073Z - - 06-12-2019

మా తిండి తింటావు.. మా భాష మాట్లాడవా: డాక్టర్‌పై దాడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తోటి స్నేహితులతో పర భాషలో మాట్లాడుతున్న ఒక డాక్టర్‌ను బెంగళూరులో కన్నడిగులు చితక బాదిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోగికి సరైన చికిత్స అందించలేదనో.. నిర్లక్ష్యం వహించారోనో... పట్టించుకోలేదనో రోగుల బంధువులు వైద్యులను దూషించడం, కొట్టడం పరిపాటిగా మారిన కాలంలో స్థానిక భాషలో మాట్లాడటం లేదనే కారణంతో ఒక కన్నడ భాషాభిమాని డాక్టరుపై దాడి చేయడం వింతగొలుపుతోంది.

సహజంగానే బెంగళూరు నగరం విభిన్న సంస్కృతులకు, భాషలకు పేరెన్నిక గన్నది. వివిధ భాషల ప్రజలు ఇక్కడ స్వేచ్చగా భావ వ్యక్తీకరణ చేసుకుంటుంటారు. కానీ బహుళ సంస్కృతికి మారుపేరుగా నిలిచిన బెంగళూరులో భాషాపరమైన క్రియాశీలత కూడా మోతాదుకు మించే ఉంటోందని రుజువవుతోంది. నవంబర్ 22 న నగరంలో జరిగిన ఈ సంఘటన అక్కడ పనిచేస్తున్న డాక్టర్లందరిలో భయాందోళన కల్గించింది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులో పనిచేస్తున్న స్థానికేతర డాక్టర్ వివేక్ నవంబర్ 22న తన స్నేహితుడితో కలిసి నగరంలోని ఒక పెట్రోలు బంక్ వద్ద స్నాక్స్ తింటూ ముచ్చటించుకుంటున్నారు. ఆ సమయంలో వారిని సమీపించిన ముగ్గురు వ్యక్తులు వారితో మాట్లాడటం ప్రారంభించిన కాస్సేపటికే వాదులాట మొదలైంది. దీంతో ఆ వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆగ్రహంతో కంపించిపోతూ ఆ వైద్యుడికి కన్నడ భాష రాదనే నెపం పెట్టి చితకబాదారు.

ఏరా.. మా రాష్ట్రంలోకి వచ్చి మా తిండి తింటావు. కానీ కన్నడ మాత్రం మాట్లాడవు అంటూ ఆ అపరిచిత వ్యక్తులు డాక్టరును దూషించడం మొదలెట్టారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి డాక్టర్ వివేక్‌ని కాలర్ పట్టి లాగి ఆనక బాదడం మొదలెట్టాడు. డాక్టర్ స్నేహితుడు ఈ తతంగాన్ని మొబైల్లో రికార్డు చేస్తుండగా మరో వ్యక్తి అతనిపైనా దాడిచేసి ఈ వీడియో రికార్డును తొలగించేశాడు,

ఇదంతా గమనిస్తున్నవారు వెంటనే పోలీసులకు కాల్ చేశారు. కానీ పోలీసులు ఆ ప్రాంతానికి  చేరుకునే లోగానే ఆ వ్యక్తులు అక్కడినుంచి జారుకున్నారు. తర్వాత వివేక్ కెంగేరి పోలీసు స్టేషన్‌ వెళ్లి తనపై దాడిగురించి ఫిర్యాదు చేశారు.

ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆ ముగ్గురు వ్యక్తులను త్వరలోనే పట్టుకున్నారు కానీ ఒకరోజు లోపే వారిని విడుదల చేశారు. అయితే ఈ ఘటనలో దెబ్బలు తిన్నది డాక్టర్ అని తెలుసుకున్న నగరంలోని వైద్య కమ్యూనిటీ పెద్ద ఎత్తున నిరసన తెలిపింది. విక్టోరియా ఆసుపత్రి వద్ద గుమికూడిన వందలాది మంది నగర వైద్యులు బెంగళూరులో శాంతిభద్రతలు క్షీణిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నగరంలోని మింటో ఐ హాస్పిటల్‌కి చెందిన ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనను వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కన్నడ భాషలో మాట్లాడలేకపోవడమే ఆమె చేసిన నేరం.

ఈ సందర్భంగా విక్టోరియా ఆసుపత్రి పీజీ రెసిడెంట్ డాక్టర్ దయానందన్ సాగర్ మాట్లాడుతూ భాష రానికారణంగా నగరంలో వైద్యులపై దాడి జరగడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ రంగ సంస్థల్లో పనిచేసేవారిపై భాష ప్రాతిపదికన దాడులు జరగడం బెంగళూరులో కొత్తేమీ కాదు. గతంలో బ్యాంకు ఉద్యోగులపై కూడా దాడి చేశారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా కన్నడ తెలియని, కన్నడ మాట్లాడలేని వైద్యులపై దాడి చేయడం నమోదు అవుతూ వస్తోంది. వైద్యులు భాషకు అతీతంగా సేవ చేస్తారు. మింటో ఘటనలో ఆ మహిళా డాక్టర్ కన్నడలో ధారాళంగా మాట్లాడటం తెలిసినప్పటికీ భాష ముసుగులో ఆమెపై అకారణంగా దాడి చేశారు దయానందన్ తెలిపారు.

డాక్టర్‌కు స్థానిక భాష తెలిసివుంటే రోగితో మరింత వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని పెంచుకుని చికిత్స అందించగలరన్నది నిజమే కావచ్చు. కానీ ఈ కాలంలో స్థానిక భాషతో పరిచయం తప్పనిసరి అవసరం ఏమీ కాదు. మాకు ఇతర కమ్యూనికేషన్ మార్గాలు కూడా తెలుసు. రోగిని సౌకర్యవంతంగా ఉంచడానికి మేం అనువాదకుల సహాయం కూడా తీసుకుంటుంటాం. అప్పుడు డాక్టర్ ఏం మాట్లాడుతున్నాడు అనేది రోగికి సులువుగా బోధపడుతుంది. అంతేకాని భాషను అడ్డం పెట్టుకుని వైద్యులపై దాడికి దిగడం హేయమైన పని అని  విక్టారియా ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ చెప్పారు.

తెలుగు భాష మాధ్యమంగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమాలు లేవదీస్తున్న వారు భాషాభిమానం దురభిమానం అయితే, హద్దులు మీరి వ్యవహరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికైనా బెంగళూరు ఘటన గురించి తెలుసుకోవాలేమో...

 

సూడాన్‌‌లో భారీ పేలుడు.. 18మంది భారతీయుల సజీవదహనం

సూడాన్‌‌లో భారీ పేలుడు.. 18మంది భారతీయుల సజీవదహనం

   a day ago


లారీడు ఉల్లి మాయం... పొలంలో ఉల్లిపంట మాయం... ఉల్లి నేరాలు షురూ

లారీడు ఉల్లి మాయం... పొలంలో ఉల్లిపంట మాయం... ఉల్లి నేరాలు షురూ

   05-12-2019


రాత్రిపూట స్త్రీలకు ఉచిత ప్రయాణం.. పంజాబ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

రాత్రిపూట స్త్రీలకు ఉచిత ప్రయాణం.. పంజాబ్ ప్రభుత్వ కీలక నిర్ణయం

   05-12-2019


డబ్బులేదు-అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేయను: కమలా హ్యారిస్

డబ్బులేదు-అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేయను: కమలా హ్యారిస్

   04-12-2019


ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమానాల దారి మళ్ళింపు

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమానాల దారి మళ్ళింపు

   04-12-2019


రాజ్ భవన్‌కు బెదిరింపులేఖ.. యూపీలో కలకలం

రాజ్ భవన్‌కు బెదిరింపులేఖ.. యూపీలో కలకలం

   04-12-2019


బెంగళూరు మెట్రో కీలక నిర్ణయం.. పెప్పర్ స్ప్రేలకు అనుమతి

బెంగళూరు మెట్రో కీలక నిర్ణయం.. పెప్పర్ స్ప్రేలకు అనుమతి

   04-12-2019


స్వామి నిత్యానంద ఎక్కడున్నాడో తెలుసా?

స్వామి నిత్యానంద ఎక్కడున్నాడో తెలుసా?

   03-12-2019


నేరాలు చేసే వారి వయసును పరిగణించాలా: వెంకయ్యనాయుడు ప్రశ్న

నేరాలు చేసే వారి వయసును పరిగణించాలా: వెంకయ్యనాయుడు ప్రశ్న

   03-12-2019


ఎటు చూసినా శిథిలాలే.. మెట్టుపాళ్యంలో అడుగడుగునా కన్నీళ్ళే

ఎటు చూసినా శిథిలాలే.. మెట్టుపాళ్యంలో అడుగడుగునా కన్నీళ్ళే

   03-12-2019


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle