newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

మాస్కులు వాడటం ఇప్పుడు నాగరికత.. దయచేసి ఉమ్మి ఊయొద్దు.. మోదీ

27-04-202027-04-2020 11:10:10 IST
Updated On 27-04-2020 11:13:51 ISTUpdated On 27-04-20202020-04-27T05:40:10.588Z27-04-2020 2020-04-27T05:40:07.877Z - 2020-04-27T05:43:51.302Z - 27-04-2020

మాస్కులు వాడటం ఇప్పుడు నాగరికత.. దయచేసి ఉమ్మి ఊయొద్దు.. మోదీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముఖానికి మాస్క్‌లు ధ‌రించ‌డం మ‌న జీవితాల్లో ఒక భాగంగా మారిపోయిందని తెలిపారు. మాస్క్‌లు ధ‌రించిన వారిని రోగులుగా చూడ‌కూడ‌ద‌ని, నాగ‌రిక స‌మాజానికి మాస్క్‌లు చిహ్నంగా మారాయ‌న్నారు. మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవాల‌న్నా లేక ఇత‌రుల్ని వ్యాధి నుంచి కాపాడాల‌న్నా.. మాస్క్‌లు ధ‌రించ‌డం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం తప్పు అని తెలిసినా చాలామంది మానుకోలేకున్నారని, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ దురలవాటును అందరూ మానాల్సిన అవసరం వచ్చిందని మోదీ హితవు చెప్పారు.

బ‌హిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే క‌లిగే అన‌ర్ధాల ప‌ట్ల ప్రజల్లో అవ‌గాహ‌న పెరిగింద‌ని ప్రధాని మోదీ అన్నారు. ఇలాంటి అల‌వాటును ఆపాల్సిన సంద‌ర్భం వ‌చ్చింద‌న్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయొద్దని ‘స్వచ్ఛభారత్‌’లో పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మాటల్ని దేశ ప్రజానీకం పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులు, పాన్‌ మసాలా నమిలి ఎక్కడపడితే అక్కడ ఉమ్మడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. ఆదివారం మన్‌ కీ బాత్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ ఈ దురలవాటుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం కరోనా‌ వ్యాప్తిని ఎక్కువ చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

మహమ్మారి కరోనా కట్టడికి ఈ ‘అలవాటు’ను మానుకోవాలని ప్రధాని మోదీ మరోసారి పిలుపునిచ్చారు. ‘బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం సరైన పద్ధతి కాదని మనందరికీ తెలుసు. చాలా చోట్ల ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. దానిని నిర్మూలించేందుకు ఈ వైరస్‌ క్లిష్ట సమయమే సరైన సమయం’ అని మోదీ పేర్కొన్నారు. ఆ దురలవాటును దూరం చేసుకుంటే పరిశుభ్రతను పెంచడంతోపాటు, కోవిడ్‌తో పోరుకు బలం సమకూరుతుందని అన్నారు. లేకపోతే ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసినట్టేనని ఆయన హెచ్చరించారు. కోవిడ్‌ పోరులో ప్రజలు సహకారం బాగుందని ప్రధాని ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.

కాగా, కోవిడ్‌ బాధితులు దగ్గినపుడు, తుమ్మినపుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి జరగుతుందనే విషయం తెలిసిందే. ఇక బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఉమ్మివేయకుండా.. నిషేదం విధించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దాంతోపాటు పాన్‌ గుట్కా అమ్మకాలను నిషేధించింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) కూడా బహిరంగంగా ఉమ్మే అలవాటును మానుకోవాలని సూచించింది. ఇక ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు, ముంబై నగర పాలక సంస్థ బహిరంగంగా ఉమ్మితే నేరంగా పరిగణిస్తామని ఆదేశాలు జారీ చేశాయి.

క‌రోనా వైర‌స్‌పై భార‌త్‌లో ప్రజా పోరాటం జరుగుతుందని ప్రధాని పేర్కొన్నారు. మన్‌ కీ బాత్‌ రేడియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాపై పోరాటం సరైన దిశలోనే సాగుతుందన్నారు. దేశ ప్రజలంతా ఒకరికొకరు అండగా నిలబడ్డారని, ఈ పోరాటానికి ప్రజలే నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. ప్రతీ పౌరుడు ఒక సైనికుడిలా కరోనా వైర‌స్‌ ఫై యుద్ధం చేస్తున్నార‌న్నారు. క‌రోనా సంక్షోభ వేళ రైతులునిర్విరామంగా ప‌నిచేస్తున్నార‌న్నారు. ఎవ‌రు కూడా ఆక‌లితో అల‌మ‌టించ‌కుండా ఉండేందుకు వారు తమ శాయాశక్తుల శ్రమిస్తున్నట్లు తెలిపారు.

లాక్‌డౌన్ సమయంలోనూ రైల్వే ఉద్యోగులు పని చేస్తున్నారని వారికి తన కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. కరోనా నివారణను అరిక‌ట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న చొరవ అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. 

 

మిస్ యు సుశాంత్ భూమి పెడ్నేకర్

మిస్ యు సుశాంత్ భూమి పెడ్నేకర్

   a few seconds ago


అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   12 minutes ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   5 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   20 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle