newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

మార్చిలో 30 శాతం సంస్థలే జీతాలిచ్చాయి.. ఏప్రిల్‌లో మరింత గడ్డుకాలమే

09-04-202009-04-2020 15:35:03 IST
Updated On 09-04-2020 15:56:22 ISTUpdated On 09-04-20202020-04-09T10:05:03.386Z09-04-2020 2020-04-09T10:05:00.380Z - 2020-04-09T10:26:22.487Z - 09-04-2020

మార్చిలో 30 శాతం సంస్థలే జీతాలిచ్చాయి.. ఏప్రిల్‌లో మరింత గడ్డుకాలమే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కట్టడికి ఈనెల 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అత్యవసర సేవలందించే సంస్థలు మినహా మిగతావన్నీ మూతబడ్డాయి. దీంతో రోజువారీ కార్యకలాపాలు ఆగిపోవడంతో ఆయా సంస్థలకు ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఫలితంగా ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు చెల్లించే ప్రక్రియ ఇంకా మొదలే కాలేదు. సంఘటిత రంగంలోని ఉద్యోగులకు మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 14 వరకు వేతనంతో కూడిన సెలవులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిబంధన ప్రకారం ప్రతి కంపెనీలో ఉద్యోగికి పూర్తి వేతనం ఇవ్వాలి. అయితే ఏప్రిల్‌ తొలివారం గడిచినా చాలా సంస్థలు వేతనాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందుల్లో పడ్డారు.

సాధారణంగా ప్రతి నెలా తొలివారంలోనే యాజమాన్యాలు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తుంటాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఈసారి ఏప్రిల్‌ తొలివారం గడిచినా మెజార్టీ ఉద్యోగులకు వేతనాలందలేదు. ఇక ప్రైవేటు రంగం ఉద్యోగులు వేతనాల కోసం కళ్లలో ఒత్తులేసుకుని చూస్తున్నారు. రాష్ట్రంలో సంఘటిత రంగంలో దాదాపు 45లక్షల మంది ఉద్యోగులున్నారు.  వీరిలో అత్యధికంగా విద్యారంగానికి సంబంధించిన స్కూళ్లు, కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్లు, కోచింగ్‌ సెంటర్లలో 20లక్షల మంది వరకు ఉన్నారు. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ తదితర సౌకర్యాలు కల్పించట్లేదు. దీంతో సంఘటిత రంగంలో అధికారిక లెక్కల ప్రకారం 19.5లక్షల మంది ఉన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 30శాతం సంస్థలు వేతనాలిచ్చినట్లు కార్మిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. కొన్ని సంస్థలు రెండుమూడు రోజుల నుంచి వేతనాలు చెల్లిస్తున్నాయి. అయితే చాలా సంస్థలు వేతనాల్లో సగమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్గనైజ్డ్‌ సెక్టార్‌లో వేతన చెల్లింపుల ప్రక్రియ కార్మికశాఖ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. కొన్ని సంస్థలు ఉద్యోగులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యం కల్పించకున్నా పని దినాల ప్రకారం వేతనాలు చెల్లిస్తాయి. నిర్దేశిత తేదీలను ప్రామాణికంగా తీసుకుని ఆ మేరకు వేతనాలిస్తారు. 

అయితే గతనెల 22 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. అంతకు ముందు పనిచేసిన రోజులను ప్రామాణికంగా తీసుకున్న కంపెనీలు పూర్తి వేతనం ఇస్తుండగా, ఆ తర్వాత పనిదినాలను పరిగణనలోకి తీసుకున్న కంపెనీలు మాత్రం కోత విధిస్తున్నాయి. కొన్ని కంపెనీలు.. పరిస్థితులు కుదుటపడ్డాక చూద్దామన్నట్టు ఉద్యోగులకు చెబుతున్నాయి.

వేతనాలు చెల్లించని పలు సంస్థలు ఉద్యోగులతో కొన్ని రకాల ప్రతిపాదనలు తెస్తున్నాయి. లాక్‌డౌన్‌తో సంస్థ లావాదేవీలు నిలిచిపోవడంతో కుటుంబ ఆర్థిక అవసరాలకు కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌ రూపంలో ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. కానీ, ఇంతవరకు ఇచ్చిన దాఖలాల్లేవు. కొన్ని సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు ఇలాంటి ప్రతిపాదన తీసుకొచ్చి ఆమేరకు చెల్లింపులు చేసినట్లు కార్మికశాఖ అధికారి ఒకరు చెప్పారు. లాక్‌డౌన్‌ నిబంధనల్లో భాగంగా ఉద్యోగులకు వేతనాలిచ్చిన అనంతరం కార్మికశాఖకు సమాచారమివ్వాలనే నిబంధన ఆధారంగా అన్ని సంస్థల వివరాలు తెలుసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   14 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   20 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle