newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

మానసిక సామర్థ్యంతోటే కరోనాకు భారతీయుల చెక్.. చైనా ప్రశంసలు

25-04-202025-04-2020 08:44:43 IST
Updated On 25-04-2020 08:59:27 ISTUpdated On 25-04-20202020-04-25T03:14:43.262Z25-04-2020 2020-04-25T03:14:30.824Z - 2020-04-25T03:29:27.733Z - 25-04-2020

మానసిక సామర్థ్యంతోటే కరోనాకు భారతీయుల చెక్.. చైనా ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ అడుగుపెట్టిన చోటల్లా మరణ మృదంగాన్ని మోగిస్తోంది. ఏ దేశంలో చూసినా కరోనా ధాటికి తాళలేని శవాల గుట్టలే చూస్తున్నాం. ఇక కరనా వైరస్ కేసులయితే వేలనుంచి లక్షల్లోకి పెరిగిపోతున్నాయి. అమెరికా వంటి అగ్రరాజ్యం, యూరప్ లోని అతి సంపన్న దేశాలు సైత్ కరోనా పేరెత్తితే వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో అతి తక్కువ కేసులు వెయ్యికి మించని మరణాలు మాత్రమే సంభవించడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నలు పలు కోణాలనుంచి పుట్టుకొస్తున్నాయి. 

ఉష్ణమండల దేశమైన భారత్‌లో సహజసిద్ధంగానే ప్రజల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని అందుకే వారు ఎలాంటి వైరస్‌ల బారిన కూడా పడకుండా తప్పించుకుంటారని ఎక్కువమంది అభిప్రాయ పడుతున్నారు. రానీ ఒక చైనా డాక్టర్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. భారతీయులకు శారీరకపరమైన రోగనిరోధక శక్తి తక్కువేనని కాకుంటే మానసికంగా సమస్యలను తట్టుకునే సామర్థ్యం భారతీయులకు ఉంది కాబట్టే వారు మహమ్మారులను సైతం దీటుగా ఎదుర్కొంటారని చైనా డాక్టర్ ఢంకా బజాయించి చెబుతున్నారు. 

వివరాల్లోకి వెళితే షాంఘైలోని హుషాన్ ఆసుపత్రి అంటువ్యాధుల విభాగం డైరెక్టర్ జాంగ్ వెన్‌హాంగ్ భారతీయుల గురించి ప్రత్యేక కోణంలో ప్రశంసలు కురిపించారు. కరోనా వైరస్‌ను శారీరకపరంగా ఎదుర్కొనే రోగనిరోధక శక్తి భారతీయులకు లేకున్నా మానసిక సామర్థ్యమే వారిని కరోనాబారి నుంచి కాపాడుతోందని చైనా నిపుణుడు, డాక్టర్ జాంగ్ వెన్‌హాంగ్ ప్రశంసించారు. కరోనా మహమ్మారిని భారతీయులు మానసికంగా దీటుగా ఎదుర్కొంటారని వారిలోని మనస్థ్యైర్యమే వ్యాధులనుంచి వారిని కాపాడుతూ వస్తోందని జాంగ్ చెప్పారు.

భారత్‌లో ఓ మతానికి సంబంధించిన సమావేశంలో ప్రజలు మాస్క్‌లు ధరించకుండా పాల్గొనడం తాను మీడియాలో చూశానని, భారతీయులకు కోవిడ్‌-19ను ఎదుర్కొనే మానసిక సామర్థ్యం మెండుగా ఉందని భారత్‌లో చైనా విద్యార్ధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జాంగ్‌ పేర్కొన్నారు. డాక్టర్ జాంగ్ చైనా ప్రభుత్వ వ్యూహాల వెనుక ప్రధాన సూత్రధారిగా కూడా వ్యవహరిస్తున్నారు. 

భారత్‌లో వైరస్‌ వ్యాప్తి వేగంగా చోటుచేసుకుంటున్నా అమెరికాలో రోగుల సంఖ్యతో పోలిస్తే అత్యధిక జనాభా ఉన్న భారత్‌లో అది పరిమితమైనదేనని అన్నారు. ఇన్ఫెక్షన్‌ రేటు భారత్‌లో తక్కువగా ఉందని, భారత్‌లో వైరస్‌ సోకే వారి సంఖ్య 10 శాతానికి మించదని, మీ చుట్టూ ఉండే వారిలో 90 శాతం మంది వైరస్‌ జాడలేని వారేనని చైనా విద్యార్ధులకు భరోసా ఇచ్చారు. 

భారతదేశంలో చదువుతున్న చైనా విద్యార్థులను ఉద్దేశించి చైనా రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఆన్ లైన్ వీడియో ఇంటరాక్షన్ కార్యక్రమంలో జాంగ్ పాల్గొని ప్రసంగించారు.

కాగా భారత్‌లో ఇప్పటివరకూ కోవిడ్‌-19 బారినపడిన వారి సంఖ్య 25,000 దాటగా 718 మంది మరణించారు. 4719 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 27,08,470 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 1,90,788 మంది మరణించారు.

లాక్ డౌన్ ప్రకటించి 31 రోజులయిన సందర్భంలోనూ భారత్‌లో కరోనా కేసులు, మరణాలు, పాజిటివ్‌లు ఇతరదేశాలతో పోలిస్తే చాలా తక్కువగా నమోదు కావడం ప్రపంచాన్ని ఆశ్చర్య పరుస్తోంది.

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   4 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   7 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   15 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle