newssting
BITING NEWS :
బాబ్రీ మసీదును నేలమట్టం చేసిన కేసులో నేడు వెలువడనున్న తీర్పు. దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును ప్రకటించనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్‌. ఈ కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, కల్యాణ్‌ సింగ్‌, విశ్వహిందూ పరిషత్‌ నేతలు విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌, వినయ్‌ కటియార్‌, సాధ్వి రితంబర తదితరులు. వీరిలో అశోక్‌ సింఘాల్‌, విష్ణుహరి దాల్మియా, గిరిరాజ్‌ కిశోర్‌ మరణించగా కరోనాతో చికిత్స పొందుతున్న ఉమా భారతి, కల్యాణ్‌ సింగ్. మిగిలిన వారిలో కొందరు నేడు కోర్టుకు హాజరయ్యే అవకాశం * పాకిస్థాన్ దేశంలోని మర్దాన్ నగరంలో జరిగిన పేలుడు. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరో 12 మంది తీవ్రంగా గాయాలు. గ్యాస్ వల్ల మర్దాన్ నగరంలోని జడ్జి బజార్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని చెప్పిన పాక్ పోలీసులు. ఈ పేలుడులో ఓ బాలుడితోపాటు మొత్తం నలుగురు మృతి. గాయపడిన 12 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీసులు * ఒడిశాలో కరోనా వీర విజృంభణ. కరోనా బారిన పడ్డ ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో నాలుగు వందల మంది. అందులో 351 మంది సేవకులు, 53 మంది సిబ్బందికి వైరస్‌. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి. మరోవైపు ఒడిశా స్పీకర్‌ రజనీకాంత్‌ సింగ్‌ తో సహా మరో 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ * బిహార్ ఎన్నికల్లో పోటీకి బీఎస్పీతో కలిసి ఆర్ఎల్ఎస్‌పీ ప్రత్యేక ఫ్రంట్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి బహుజనసమాజ్ పార్టీ, జనతాంత్రిక్ పార్టీతో కలిసి తాము ప్రత్యేక ఫ్రంట్ గా పోటీ చేస్తామని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వా ప్రకటన. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని ప్రకటించిన ఉపేంద్ర * శీతాకాలంలో కరోనా వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ హెచ్చరిక. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ, నిపుణుల బృందం హెచ్చరిక. రాబోయే రెండు మూడు నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరాన్ని కొనసాగించాలని డాక్టర్ పాల్ సూచన * హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు బుధవారం తెల్లవారుజామున బలవంతంగా దహనం చేసినట్లుగా ఆరోపిస్తున్న బాధితురాలు కుటుంబ సభ్యులు. మృతురాలి కుటుంబసభ్యులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ మృతదేహాన్ని పోలీసులే బలవంతంగా దహనం చేశారని ఆరోపణ. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో నలుగురు మృగాలు యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసి, గొంతు నులిమిన ఘటనతో కన్నుమూసిన 19ఏళ్ల యువతి * సూర్యాపేట‌ జిల్లాలోని కోదాడ‌లో అదుపుత‌ప్పి ఇంట్లోకి దూసెకెళ్లిన లీలాద‌రి ట్రావెల్స్ ప్రైవేటు బ‌స్సు. రాజ‌స్థాన్ నుంచి విశాఖ‌ప‌ట్నం ప్రయాణిస్తుండగా బుధవారం తెల్ల‌వారుజామున సూర్యాపేటలో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టిన బస్సు. రోడ్డు వెంబ‌డి ఉన్న రెండు విద్యుత్ స్తంభాల మ‌ధ్య‌లోనుంచి ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు. ప్ర‌మాద సమ‌యంలో బ‌స్సులో 36 మంది ప్ర‌యాణికులు ఉండగా నలుగురికి గాయాలు * దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడటంతో రాష్ట్రంలో మొదలైన పొలిటికల్‌ ఫీవర్‌. నియోజకవర్గంపై దృష్టి సారించనున్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో అనివార్యమైన ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు కీలకం కానున్న గెలుపు * 288వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన రాజధాని రైతులు. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం *

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

10-08-202010-08-2020 13:49:29 IST
Updated On 10-08-2020 17:05:08 ISTUpdated On 10-08-20202020-08-10T08:19:29.922Z10-08-2020 2020-08-10T08:19:23.321Z - 2020-08-10T11:35:08.924Z - 10-08-2020

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. క‌రోనా ఉధృతికి ప్ర‌జ‌లు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ముఖ్య‌మంత్రులు, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ర్టాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల‌కు క‌రోనా సోకింది. వారంతా చికిత్స పొందుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి కూడా క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది.

త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ట్వీట్ చేశారు. వేరే స‌మ‌స్య వ‌ల్ల ఆస్ప‌త్రికి వెళ్లిన‌ప్పుడు.. త‌న‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌లో త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. గ‌త వారం రోజుల నుంచి త‌న‌ను ఎవ‌రైతే క‌లిశారో.. వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలి అని మాజీ రాష్ర్ట‌ప‌తి విజ్ఞ‌ప్తి చేశారు. కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకున్న త‌ర్వాత స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కోరారు. 

మరోవైపు దేశంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో 22లక్షల 15 వేల 074 కేసులు.. మరణాల సంఖ్య 44,466వ‌రుస‌గా నాలుగో రోజు 62 వేల‌కు పైగా పాజిటివ్ కేసుల‌తోపాటు, ఎనిమిది వంద‌ల‌కు పైగా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. తాజాగా రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా క‌రోనా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం మ‌ర‌ణాలు 44 వేలు దాటాయి.  

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 1,007 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించారు. ఇంత‌పెద్ద సంఖ్య‌లో క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డం ఇదే మొద‌టి సారి. అదేవిధంగా నిన్న ఉద‌యం నుంచి ఈరోజు ఉద‌యం వ‌ర‌కు 62,064 మంది కొత్త‌గా క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 22,15,075కు పెర‌గ‌గా, మ‌ర‌ణాలు 44,386కు చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 6,34,945 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 15,35,744 మంది బాధితులు కోలుకున్నారు.

దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి బారి నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 15 ల‌క్ష‌లు దాటింద‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది. దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా న‌మోద‌వుతున్న పాజిటివ్ కేసుల్లో 80 శాతం ప‌ది రాష్ట్రాల్లోనే ఉన్నాయ‌ని తెలిపింది. దేశవ్యాప్తంగా నిన్న‌టివ‌ర‌కు 2,45,83,558 క‌రోనా టెస్టులు చేశామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 9న 4,77,023 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది. దేశంలో రికవరీ కేసులు పెరగడం ఊరట నిస్తోంది. ఈ వారంలో కరోనా వ్యాక్సిన్ రానుండడంతో అందరి చూపు అటువైపే వుంది.  

 

సొంత వాళ్లకు కూడా చూపించకుండా అంత్యక్రియలు.. యూపీ ప్రభుత్వం తప్పు చేసిందా..?

సొంత వాళ్లకు కూడా చూపించకుండా అంత్యక్రియలు.. యూపీ ప్రభుత్వం తప్పు చేసిందా..?

   25 minutes ago


బాబ్రీ మసీదు కూల్చివేత కేసు : సంచలన తీర్పు ఇచ్చిన సీబీఐ ధర్మాసనం

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు : సంచలన తీర్పు ఇచ్చిన సీబీఐ ధర్మాసనం

   an hour ago


దేశంలో ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా.. ఐసీఎంఆర్‌ సర్వే

దేశంలో ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా.. ఐసీఎంఆర్‌ సర్వే

   an hour ago


భారత్‌‌పై ఆమ్నెస్టీ తీవ్ర ఆరోపణలు.. తిప్పికొట్టిన కేంద్రం

భారత్‌‌పై ఆమ్నెస్టీ తీవ్ర ఆరోపణలు.. తిప్పికొట్టిన కేంద్రం

   3 hours ago


బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు.. రాష్ట్రాల్లో హై అలర్ట్..!

బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు.. రాష్ట్రాల్లో హై అలర్ట్..!

   4 hours ago


బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

బ్రేకింగ్.. ఉపరాష్ట్రపతి వెంకయ్యకు కరోనా పాజిటివ్!

   15 hours ago


ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి.. భార్యను చితక్కొడుతూ అడ్డంగా దొరికిపోయారు

   21 hours ago


కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా..?

   29-09-2020


ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ తీరే కారణమా..!

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం.. ప్రభుత్వ తీరే కారణమా..!

   29-09-2020


నాలుక కోసి అత్యాచారం చేసిన కామాంధులు.. చికిత్స పొందుతూ యువతి మృతి

నాలుక కోసి అత్యాచారం చేసిన కామాంధులు.. చికిత్స పొందుతూ యువతి మృతి

   29-09-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle