newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

మహారాష్ట్ర సీఎంకి చిక్కులు తప్పవా? పదవీ గండమేనా?

24-04-202024-04-2020 09:14:10 IST
Updated On 24-04-2020 09:53:28 ISTUpdated On 24-04-20202020-04-24T03:44:10.070Z24-04-2020 2020-04-24T03:44:00.471Z - 2020-04-24T04:23:28.636Z - 24-04-2020

మహారాష్ట్ర సీఎంకి చిక్కులు తప్పవా? పదవీ గండమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజకీయ వైకుంఠపాళిలో మెట్లెక్కి పదవులు పొందేవారు కొందరైతే.. పాముల బారిన పడి పదవులు కోల్పోయేవారు మరికొందరు. తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే పరిస్థితి కొంచెం అయోమయంగానే వుంది. బీజేపీని ఎదిరించి పదవిని పొందారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి శివసేనకు అధికారం తెచ్చుకున్నారు. అయితే మహారాష్ట్ర సీఎం పీఠమెక్కిన ఉద్ధవ్ థాకరే పదవి మూన్నాళ్ళ ముచ్చట కానుందనే అంటుర్నారు.

కరోనా సంక్షోభం కారణంగా ఆయనకు పదవి ముప్పు పొంచివుందా? అంటే ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. రాష్ట్ర సీఎంగా ఠాక్రే గత ఏడాది నవంబర్‌ 28న పదవీ బాధ్యతలు స్వీకరించినా.. ఇప్పటి వరకు ఇటు అసెంబ్లీలో గానీ, మండలిలో గానీ ఆయన సభ్యుడిగా లేరు.

ఆయన కుమారుడైతే అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు కానీ.. ఆయన మాత్రం పోటీ చేయలేదు. దాంతో ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలనుకున్నారు. ప్రస్తుతం అది వర్కవుట్ అయ్యేలా లేదు. వాస్తవానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 164 ప్రకారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల లోపు ఏదోఒక సభలో సభ్యత్వం పొందాల్సి వుంటుంది. మే 28 నాటికి ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఎన్నికై ఆరు నెలలు పూర్తవుతుంది. ఈ క్రమంలో ఠాక్రేను శాసనమండలికి నామినేట్‌ చేయాలని మంత్రివర్గం కూడా నిర్ణయించింది. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా దేశంలో జరగాల్సిన అన్ని ఎన్నికలు వాయిదా పడ్డాయి. అలాగే మహారాష్ట్రలో జరగాల్సిన మండలి ఎన్నికలు కూడా ఆగిపోవడంతో ఏంచేయాలో ఆయనకు పాలుపోవడం లేదు.

మే 28 నాటికి ఉద్ధవ్‌ ఏ సభలో సభ్యుడు కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే.  దీనికి తోడు గవర్నర్‌ కోటాలో మండలికి నామినేట్‌ చేయాలని వున్నా... ఇద్దరు సభ్యుల పదవీకాలం రెండునెలలే వుంది.  ఎవరో ఒకరిని రాజీనామా చేయించి రెండునెలలు గెంటేసినా.. బీజేపీ సభ్యులు మాత్రం అభ్యంతరం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దవ్ థాకరే పరిస్థితి అర్థం కావడం లేదు. కరోనా కారణంగా రాజకీయ నేతల పదవులకు కూడా గండం ఏర్పడింది. 

మరోవైపు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడం, ఓ మంత్రికి కరోనా సోకడం సీఎం థాకరేకు తలనొప్పిగా మారింది. ఏప్రిల్‌ 30– మే 15 మధ్య మహారాష్ట్రలో కరోనా వికృతరూపాన్ని చూడడానికి సంసిద్ధంగా ఉండాలని ముంబై, పుణెలలో పర్యటించిన కేంద్ర బృందం ఉద్ధవ్‌ఠాక్రే ప్రభుత్వాన్ని హెచ్చరించింది. నాలుగు రోజుల్లోనే 2 వేలు తాజా కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్లుగా ప్రతిరోజూ సుమారుగా 400 కొత్త కేసులు నమోదు కావడం, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6 వేలకు చేరువలో ఉండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. 

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   14 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   17 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle