newssting
BITING NEWS :
ఎన్డీయేతో బంధం తెంచుకున్న అకాలీదళ్. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా అకాలీదళ్ నిర్ణయం. ఈ బిల్లుల ప్రభావం రైతులు, దళితులు, రైతు కూలీల అందరిపై పడిందని తెలిపిన అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటన. శనివారం పార్టీ నిర్వహించిన మూడు గంటల ఎమర్జెన్సీ కోర్ కమిటీ సమావేశం అనంతరం నిర్ణయం. 23 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ బంధాన్ని తెగతెంపులు చేసుకున్న అకాలీదళ్ * బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌పై కర్ణాటకలోని తుమకూరు కోర్టులో కేసు దాఖలు. కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్‌ చేయడాన్ని తప్పుబడుతూ తుమకూరు జేఎంఎఫ్సీ కోర్టులో రమేశ్‌ నాయక్‌ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు * అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎల్‌యూ వైస్‌ చాన్సలర్‌గా వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌ పి.శ్రీకృష్ణదేవరావు నియామకం. ప్రస్తుత వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌ పదవీ విరమణ చేయడంతో శ్రీకృష్ణదేవరావు నియామకం. దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో కీలక బాధ్యతలు నిర్వహించిన శ్రీకృష్ణదేవరావు న్యాయ విద్యలో మార్పులు తీసుకువచ్చేందుకు యూజీసీ నియమించిన నిపుణుల కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా కూడా పనిచేశారు * శివసేన నేత, లోక్ సభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఓ స్టార్ హోటల్ లో రహస్యంగా భేటీ అయినట్టు గుప్పుమన్న వార్తలు. ఓ లగ్జరీ హోటల్‌ లో సుమారు గంటన్నర పాటు వీరిమధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ సమావేశం వార్తలు. ఈ సమావేశం నిజమేనని, దీని వెనుక రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేసిన బీజేపీ * అమెరికాలోని హిందూఆధ్యాత్మిక గురువు స్వామి ప్రత్యాగ్‌బోధానంద కన్నుమూత. పెన్సిల్వేనియాలో అర్ష విద్యా గురుకులానికి ఉపాధ్యక్షులుగా ఉన్న ప్రత్యాగ్‌బోధానంద వయసు 69 సంవత్సరాలు. గురుకులం 34వ వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత తీవ్రమైన గుండెపోటు రావడంతో ఈనెల 20తేదీన తుదిశ్వాస విడిచినట్టు తెలిపిన ఆయన శిష్యులు. ప్రత్యాగ్‌బోధానంద పార్థివదేహాన్ని భారత్‌కు తరలింపుకు ప్రయత్నాలు * పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా పంజాబ్‌లో కొనసాగుతున్న రైల్‌ రోకో ఆందోళన. గత మూడు రోజులుగా రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిర్వహిస్తున్న రైల్‌ రోకో. తొలుత కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్ కమిటీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే, ఆ తర్వాత మద్దతు ప్రకటించిన వివిధ సంఘాలు * బాలీవుడ్‌ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్‌ వ్యవహారం. దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఎదుట శనివారం హాజరు. వేర్వేరుగా ఐదు గంటలకు పైగా కొనసాగిన విచారణ. నటీమణుల వాగ్మూలాన్ని రికార్డు చేసిన ఎన్సీబీ * ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రలలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అక్కడక్కడా నిలిచిన రాకపోకలు. పలుచోట్ల నీటమునిగిన పంట పొలాలు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నందిగామలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు * అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పరిస్థితులను గాడిలో పెట్టేందుకు అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్ల తెరిచేందుకు అనుమతినిస్తున్నామని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్ షోలు నిర్వహించేందుకు కూడా అనుమతినిస్తున్నామని ట్వీట్ * నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన రౌడీషీటర్ దారుణ హత్య మరువక ముందే చోటు చేసుకున్న మరో ఘటన. చిల్లకూరు మండలం కలవకకొండలో చేజర్ల సుబ్రహ్మణ్యం(38) అనే వ్యక్తి దారుణ హత్య. ఆదివారం ఉదయం అతి కిరాతకంగా చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు * సంగారెడ్డిలో వాగు దాటుతున్న వ్యక్తి వరద నీటిలో గల్లంతు. భారీ వర్షాలకు వాగు దాటుతున్న ముగ్గరు వ్యక్తులు గల్లంతవ్వగా ఇద్దరు వ్యక్తులను ఒడ్డుకు చేర్చిన స్థానికులు. కంగ్టి మండలం జంగి బికి చెందిన 55 ఏళ్ల మంగలి మారుతి కాకి వాగు వరద ఉధృతిలో గల్లంతు. మారుతి ఆచూకీ కోసం మండల రెవెన్యూ అధికారుల గాలింపు చర్యలు.

మహారాష్ట్రలో ఉత్కంఠకు తెర...శివసేన ఆశలు గల్లంతేనా?

12-11-201912-11-2019 15:04:07 IST
Updated On 12-11-2019 18:25:18 ISTUpdated On 12-11-20192019-11-12T09:34:07.334Z12-11-2019 2019-11-12T09:34:05.085Z - 2019-11-12T12:55:18.624Z - 12-11-2019

మహారాష్ట్రలో ఉత్కంఠకు తెర...శివసేన ఆశలు గల్లంతేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్రలో రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ కేంద్రానికి సిఫారసు లేఖ పంపారు గవర్నర్. దీంతో అక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేయాలన్న శివసేన ఆశలు గల్లంతయ్యాయి.

ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొనడంతో గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీకి ఇచ్చిన గడువు సాయంత్రం ఏడుగంటలకు ముగియనుండగా ఈలోగానే గవర్నర్‌ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం పట్ల విపక్షాలు భగ్గుమంటున్నాయి. 

ఇంకా సమయం మించిపోకముందే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు మండిపడుతున్నాయి. కేంద్ర హోంశాఖకు గవర్నర్‌ లేఖ చేరడంతో కేంద్ర క్యాబినెట్‌ గవర్నర్‌ సిఫార్సుపై మంగళవారం రాత్రే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు తొలుత అతి పెద్ద పార్టీ బీజేపీకి అవకాశం ఇచ్చారు. అయితే బీజేపీ నిస్సహాయత వ్యక్తం చేయడంతో తర్వాత శివసేనకు అవకాశం ఇచ్చారు గవర్నర్.

అయితే శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో సంప్రదింపులు జరిపింది. పదవులు పంపకాల గురించి కూడా వారిమధ్య చర్చ జరిగింది. కానీ కొంత గడువు కావాలని కోరింది శివసేన. అయితే, గడువు పొడిగించేందుకు నిరాకరించిన గవర్నర్‌ ఎన్సీపీని మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి మంగళవారం రాత్రి 8.30 గంటల వరకూ డెడ్ లైన్ విధించారు. 

ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ, కాంగ్రెస్‌, శివసేనలు సంప్రదింపులు జరుపుతున్న వేళ రాజ్ భవన్ నుంచి కేంద్ర హోంశాఖకు నివేదిక వెళ్ళడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. గవర్నర్‌ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. 

 

అక్టోబర్ 1 నుండి సినిమా థియేటర్లు ఓపెన్

అక్టోబర్ 1 నుండి సినిమా థియేటర్లు ఓపెన్

   25 minutes ago


బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌ సింగ్ ఇక లేరు ‌

బీజేపీ సీనియర్ నేత జశ్వంత్‌ సింగ్ ఇక లేరు ‌

   an hour ago


మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఇంకా నిరీక్షించాలా.. మోదీ విమర్శ

మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఇంకా నిరీక్షించాలా.. మోదీ విమర్శ

   2 hours ago


గొప్ప కూతురే.. తండ్రి లూడోలో మోసం చేశాడని కోర్టుకెక్కింది

గొప్ప కూతురే.. తండ్రి లూడోలో మోసం చేశాడని కోర్టుకెక్కింది

   2 hours ago


వ్యాక్సిన్ కొనుగోలుకు 80 వేల కోట్లు అవసరం.. సీరమ్ సీఈవో వెల్లడి

వ్యాక్సిన్ కొనుగోలుకు 80 వేల కోట్లు అవసరం.. సీరమ్ సీఈవో వెల్లడి

   3 hours ago


బీహార్ ఎన్నికలకు మోగిన నగారా.. విజయమెవరిది?

బీహార్ ఎన్నికలకు మోగిన నగారా.. విజయమెవరిది?

   15 hours ago


ముగ్గురు యువతుల వ్యభిచారం కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాంబే హైకోర్టు

ముగ్గురు యువతుల వ్యభిచారం కేసు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాంబే హైకోర్టు

   16 hours ago


సమష్టిగానే కట్టడి- యూరోప్ లో కరోనా సెకండ్ వేవ్ చెబుతున్నది ఇదే!

సమష్టిగానే కట్టడి- యూరోప్ లో కరోనా సెకండ్ వేవ్ చెబుతున్నది ఇదే!

   18 hours ago


తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. మంచికా ? చెడుకా ?

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. మంచికా ? చెడుకా ?

   a day ago


ఆత్మనిర్భర్ తోటే భారత్ సేఫ్.. ఐఎమ్ఎఫ్ ప్రశంస

ఆత్మనిర్భర్ తోటే భారత్ సేఫ్.. ఐఎమ్ఎఫ్ ప్రశంస

   26-09-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle